ప్రధాన మంత్రి కార్యాలయం

జ‌మ్ము, క‌శ్మీర్ లో ఉగ్ర‌వాదుల కుట్ర‌ను భ‌గ్నం చేసినందుకు భ‌ద్ర‌త ద‌ళాల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపిన ప్ర‌ధాన మంత్రి

Posted On: 20 NOV 2020 4:11PM by PIB Hyderabad

జ‌మ్ము, క‌శ్మీర్ లో‌ అట్ట‌డుగు స్థాయి ప్ర‌జామ్వామిక క‌స‌ర‌త్తుల‌పై గురిపెట్టి జైష్-ఎ-మొహమ్మద్ ప‌న్నిన ఉగ్ర‌వాద కుతంత్రాన్ని నిష్ప‌లం చేసినందుకు భ‌ద్ర‌త ద‌ళాల‌కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ధ‌న్య‌వాదాలు తెలిపారు.

‘‘పాకిస్థాన్ లో ప్ర‌ధాన కేంద్రం క‌లిగిన ఉగ్ర‌వాద సంస్థ జైష్-ఎ-మొహమ్మద్ కు చెందిన న‌లుగురు ఉగ్ర‌వాదుల‌ను నిర్వీర్యుల‌ను చేసి, వారి వ‌ద్ద నుంచి పెద్ద సంఖ్య‌లో పేలుడు ప‌దార్థాల‌ను, ఆయుధాల‌ను స్వాధీనం చేసుకోవ‌డంతో, వారు భారీ ఎత్తున న‌ష్టాన్ని క‌ల‌గ‌జేయాల‌న్న ప్ర‌య‌త్నాల‌ను అడ్డుకోవ‌డ‌మైంది’’ అని ట్విట‌ర్ లో న‌మోదు చేసిన ఒక సందేశం లో ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.

ఆయ‌న ఇంకా ఇలా అన్నారు

‘‘మ‌న భ‌ద్ర‌త ద‌ళాలు మ‌రోసారి అత్యంత ధైర్య సాహ‌సాల‌ను, కార్య‌కుశ‌ల‌త‌ను చాటిచెప్పాయి.  వారు అప్ర‌మ‌త్తంగా ఉన్నందువ‌ల్ల‌నే జ‌మ్ము, క‌శ్మీర్ లో అట్ట‌డుగుస్థాయిలో ప్రజాస్వామిక ప్ర‌క్రియ‌ల‌ ను ల‌క్ష్యంగా చేసుకొని సాగిన ఒక దుర్మార్గమైన కుట్ర‌ను ఓడించ‌గ‌లిగారు.’’

***


(Release ID: 1674457) Visitor Counter : 196