రాష్ట్రపతి సచివాలయం
ఛాత్ పూజ సందర్భంగా ప్రజలకు రాష్ట్రపతి శుభాకాంక్షలు
प्रविष्टि तिथि:
19 NOV 2020 5:11PM by PIB Hyderabad
ఛాత్ పూజ సందర్భంగా, రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్ కోవింద్ భారతీయులకు శుభాకాంక్షలు తెలుపుతూ సందేశమిచ్చారు.
"దేశంలో, విదేశాల్లో నివశిస్తున్న భారతీయులందరికీ పవిత్రమైన ఛాత్ పూజ పండుగ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు. సూర్య భగవానుడికి వందనాలు సమర్పించడం ఛాత్ పూజ సంప్రదాయం. నదులు, చెరువులు, ఇతర జల వనరులకు పూజలు చేయడం ద్వారా ప్రకృతి మాతకు కృతజ్ఞతలు తెలపడం కూడా పూజలో భాగం. శుభకరమైన ఛాత్ పూజ సందర్భంగా ప్రకృతిని, పర్యావరణాన్ని సంరక్షించడానికి, కొవిడ్‌ను మదిలో ఉంచుకుని వేడుకలు జరుపుకోవడానికి మనమంతా సంకల్పిద్దాం. ఈ పండుగ అందరికీ మంచి ఆరోగ్యాన్ని, అభివృద్ధిని అందించాలని ప్రార్థిస్తున్నా"
రాష్ట్రపతి సందేశాన్ని హిందీలో చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
***
(रिलीज़ आईडी: 1674106)
आगंतुक पटल : 154