మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
కేంద్ర విద్యా మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశంక్‌కు వతయన్ జీవితకాల సాఫల్య పురస్కారం
Posted On:
19 NOV 2020 4:01PM by PIB Hyderabad
కేంద్ర విద్యామంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశంక్‌కు వతయన్ జీవితకాల సాఫల్య పురస్కారాన్ని నవంబర్ 21వ తేదీన వర్చువల్ కార్యక్రమం ద్వారా అందించనున్నారు.
రచన, కవిత్వం, సాహిత్య రచనలకు గాను మంత్రికి ఇచ్చిన జాతీయ, అంతర్జాతీయ అవార్డుల జాబితాలో ఇది అదనం. సాహితీరంగంలోను, పాలనలోనూ పోఖ్రియాల్ మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి నుంచి సాహిత్య భారతీ అవార్డు, మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఎ.పి.జి. అబ్దుల్ కలాం నుంచి సాహిత్య గౌరవ్ సమ్మాన్, దుబాయ్ ప్రభుత్వం నుంచి గుడ్ గవర్నెన్్స అవార్డు, మారిషయస్‌కు చెందిన గ్లోబల్ ఆర్గనైజేషన్ ఆఫ్ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్ నుంచి ఔట్‌స్టాండింగ్ అచీవ్‌మెంట్ అవార్డు, పర్యావరణ పరిరక్షణ రంగంలో ఉక్రైన్ నుంచి అవార్డును పొందారు. ఆయనను హిమల్ గౌరవ్ సమ్మాన్‌తో నేపాల్ గౌరవించింది.
నిశంక్ రచించిన జస్ట్ ఎ డిజైర్ అన్న కథల సంకలనం జర్మన్ అనువాదమైన న్యరీన్ వంష్‌ను హాంబర్గ్‌లోని ఆఫ్రో ఏషియన్ ఇనిస్టిట్యూట్ ప్రచురించింది. ఆయన స్పర్శ్ గంగ చొరవను మారిషస్ పాఠశాల పాఠ్య ప్రణాళికలో జోడించారు. ఆయన స్వరణ్ గంగ వంటి ప్రత్యేక కార్యక్రమం సహా వివిధ సామాజిక కార్యకలాపాలలో చురుకుగా పాలు పంచుకుంటున్నారు. ఉత్తర్ ప్రదేశ్‌లో సాంస్కృతిక వ్యవహారాల మంత్రిగా పోఖ్రియాల్ ప్రపంచవ్యాప్తంగా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు.
పోఖ్రియాల్ లిటరేచర్ బై గ్రాఫిక్ ఎరా అన్న అంశంపై డి. లిట్‌ను, ఉత్తరాఖండ్ డీమ్డ్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్‌ను పొందారు.
వివిధ విషయాంశాలపై పోఖ్రియాల్ 75 పుస్తకాలను రచించారు. వీటిని అనేక అంతర్జాతీయ, విదేశీ భాషలలోకి అనువదించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో పోఖ్రియాల్ నూతన విద్యా విధానాన్ని వివిధ ప్రక్రియలలో సారధ్యం వహించారు. దీనికి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు లభించాయి.
వతయన్ అంతర్జాతీయ అవార్డులను లండన్‌కు చెందిన వతయన్- యుకె సంస్థ కవులు, రచయితలు, కళాకారులకు తమతమ రంగాలలో ఆదర్శప్రాయమైన, ఉత్తమమైన రచనలకు అందిస్తారు. గతంలో ప్రసూన్ జోషి, జావేద్ అక్తర్ సహా పలువురు ప్రముఖ రచయితలకు వారి సాహితీ రచనలకు వతయన్ అవార్డును అందించారు.
వతయన్- యుకె సమ్మాన్‌ను దృశ్య వేదికపై నవంబర్ 21వ తేదీ రాత్రి 8.30లకు నిర్వహించనున్నారు. ప్రముఖ రచయిత, లండన్‌లోని నెహ్రూ సెంటర్ డైరెక్టర్ అయిన డాక్టర్ అమీష్ త్రిపాఠి ఈ కార్యక్రమంలో ప్రత్యేక అతిథిగా పాల్గొననున్నారు. వతయన్ చైర్మన్ మీరా కౌశిక్, కవి అనిల్ శర్మ జోషి, ఆగ్రాకు చెందిన కేంద్ర హిందీ బోర్్డ వైస్ చైర్మన్ అనిల్ కుమార్ జోషి, వాణి ప్రకాశన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అదితి మహేశ్వరి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
***
(Release ID: 1674072)
Visitor Counter : 136