శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
ప్రపంచంలోని అత్యుత్తమ 500 పంపిణీ చేయని సూపర్ కంప్యూటర్ల జాబితాలో 63వ స్థానాన్ని దక్కించుకున్న భారత్‌కు చెందిన ఎఐ సూపర్ కంప్యూటర్ పరమ సిద్ధి
Posted On:
18 NOV 2020 3:10PM by PIB Hyderabad
జాతీయ సూపర్ కంప్యూటింగ్ మిషన్ (ఎన్ ఎస్ ఎం) కింద సి-డిఎసి లో ఏర్పాటు చేసిన హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ -ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్్స (హెచ్‌పిసి-ఎ1)పరమ సిద్ధి ఎ1 సూపర్ కంప్యూటర్ ప్రపంచంలోనే అత్యుత్తమ 500 అత్యంత శక్తిమంతమైన పంపిణీ చేయని కంప్యూటర్ వ్యవస్థలలో పరమ సిద్ధి ఎ1 సూపర్ కంప్యూటర్ 63వ స్థానాన్ని దక్కించుకుంది. ఈ మేరకు జాబితాను 2020, నవంబర్ 16వ తేదీన విడుదల చేశారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ అత్యధునిక సామాగ్రి, కంప్యుటేషనల్ కెమిస్ట్రీ, ఆస్ట్రోఫిజిక్్స వంటి రంగాలలో అప్లికేషన్ ప్యాకేజీలను అభివృద్ధిని బలోపేతం చేయడమే కాకుండా, ఔషధాల నమూనాలను రూపొందించడం, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ, వరదలు వచ్చే అవకాశమున్న మెట్రో నగరాలైన ముంబై, ఢిల్లీ, చెన్నై, పాట్నా, గువాహతిలలో వరద ముంపు గురించి ముందుగానే తెలుసుకునే ప్యాకేజీ అభివృద్ధి చేయనుంది. కోవిడ్-19పై చేస్తున్న యుద్ధంలో భాగంగా నడుస్తున్న పరిశోధన, అభివృద్ధిని విడంబనలను, వైద్యపరమైన ఇమేజింగ్‌ను, జన్యుపరమైన అనుక్రమణను, వాతావరణాన్ని ముందుగా తెలుసుకునే పద్ధతులను వేగవంతం చేస్తుంది. ఇది భారతదేశ ప్రజలకు, స్టార్టప్‌లకు, ముఖ్యంగా మధ్య తరహా పరిశ్రమలకు ఒక వరం.
ఎన్‌సిఎంఆర్‌డబ్ల్యుఎఫ్, ఐఐటిఎం, చమురు, సహజవాయువు రాబట్టడం కోసం ప్యాకేజీలను, ఎయిరో డిజైన్ అధ్యయనాలు, కంప్యుటేషనల్ ఫిజిక్స్, మాథమెటికల్ అప్లికేషన్లు పరీక్షించేందుకు తోడ్పడడంతో పాటుగా విద్యకు సంబంధించిన ఆన్‌లైన్ కోర్సుల అప్లికేషన్ డెవలపర్లకు వరం.
ఎన్ ఎస్ ఎం కింద ఎలక్ర్టానిక్్స, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం తోడ్పాటుతో సి-డిఎసి 5.267 పెటాప్లాప్‌లు, 4.6 పెటాప్లాప్ల ఆర్ మాక్స్ (సస్టైన్డ్)తో ఆర్‌పీక్ కలిగిన సూపర్ కంప్యూటర్‌ను కల్పన చేసి, అభివృద్ధి చేశారు.
చరిత్రలో ఇదే మొదటిది. ప్రపంచంలోనే అతిపెద్ద సూపర్ కంప్యూటర్ల మౌలిక సదుపాయాలను నేడు భారత్ కలిగి ఉంది. నేడు పరమ్ సిద్ధి -ఎఐ అందుకున్న ర్యాంకింగే అందుకు తార్కాణం, అని సైన్్స అండ్ టెక్నాలజీ విభాగం కార్యదర్శి ప్రొఫెసర్ అషుతోష్ శర్మ చెప్పారు.
జాతీయ విద్య, ఆర్ అండ్ డి సంస్థలతో పాటుగా పరిశ్రమలను, దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న స్టార్టప్‌లను సాధికారం చేయడమే కాకుండా వాటిని నేషనల్ నాలెడ్జ్ నెట్ వర్క్ ద్వారా జాతీయ సూపర్ కంప్యూటర్ గ్రిడ్‌లో అనుసంధానం చేసే విషయంలో చాలా పురోగమనం సాధిస్తామని తాను విశ్వసిస్తున్నానని, ప్రొఫెసర్ శర్మ పేర్కొన్నారు.
ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, విద్య, ఇంధనం, సైబర్ సెక్యూరిటీ, అంతరిక్షం, ఎఐ అప్లికేషన్లు, వాతావరణం, పర్యావరణ నమూనా, నగరాల ప్రణాలికలలో ఎదురయ్యే బహుళ అంశాలకు సంబంధించిన గొప్ప సవాళ్ళను దేశంలోని శాస్త్ర, సాంకేతిక సమాజానికి పరమ్ సిద్ధి -ఎ1 ప్రవేశంతో పరిష్కరించడంలో సాధికారత లభిస్తుందని ప్రొఫెసర్ అషుతోష్ శర్మ అభిప్రాయపడ్డారు.
శాస్త్ర, సాంకేతికత, ఆవిష్కరణల ద్వారా ఆత్మనిర్భర్ ప్రయాణానికి ఇది ఒక ప్రేరణాత్మక ఉదాహరణ అని ఆయన నొక్కి చెప్పారు.
పరమ సిద్ధి సూపర్ కంప్యూటర్‌ను ఎన్‌విఐడిఐఎ డిజిఎక్స్ సూపర్ పిఒడి రిఫరెన్స్ ఆర్కిటెక్చర్ నెట్‌వర్కింగ్‌తో పాటుగా సి-డిఎసి దేశీయంగా అభివృద్ధి చేసిన హెచ్‌పిసి-ఎ1 ఇంజిన్, సాఫ్ట్‌వేర్ చట్రాలు, క్లౌడ్ ప్లాట్‌ఫాం పై నిర్మించారు. ఇది లోతైన అభ్యాసానికి, విజువల్ కంప్యూటింగ్‌కి, వర్చువల్ రియాలిటీ, వేగవంతమైన కంప్యూటింగ్‌కి, గ్రాఫిక్స్ వర్చువలైజేషన్‌కు తోడ్పడుతుంది.
***
(Release ID: 1673888)
Visitor Counter : 239