సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ

సామాజిక మరియు సాధికారత స్కాలర్‌షిప్‌ పథకాలకు సంబంధించి ఆ మంత్రిత్వశాఖ స్పష్టీకరణ

Posted On: 17 NOV 2020 5:47PM by PIB Hyderabad

కోవిడ్-19 సంక్షోభం కారణంగా స్కాలర్‌షిప్‌ పథకాల పంపిణీ ఆలస్యమవుతోందని తద్వారా విద్యార్ధులు సమస్యలను ఎదుర్కొంటున్నారంటూ కొన్ని వార్తా కథనాలు వెల్లడించాయి

వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వాలు / కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలనా విభాగాలు/యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్‌/ సహకారంతో సమాజంలోని పలు వర్గాలు అనగా షెడ్యూల్డ్ కులాలు / ఇతర వెనుకబడిన తరగతులు, డి-నోటిఫైడ్ తెగలు, ఆర్థికంగా బలహీనమైన వర్గాల కోసం సామాజిక న్యాయం మరియు సాధికారత శాఖ వివిధ రకాల స్కాలర్‌షిప్‌ పథకాలను అమలు చేస్తోంది.

కొవిడ్-19 యొక్క  సంక్షోభ సమయంలో లబ్ధిదారులు ఎటువంటి ఇబ్బంది ఎదుర్కోకుండా ఉండటానికి స్కాలర్‌షిప్‌ పథకాలను అమలు చేసే సంస్థలకు పలు నిర్దేశకాలను మంత్రిత్వశాఖ జారీ చేసింది. ప్రాముఖ్యత పథకం కింద షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు సంబంధించిన పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్  పథకానికి సంబందించి  జూన్, 2020 నాటికి 75% కేంద్ర వాటాను ఆ ప్రభుత్వ శాఖ సంబంధిత రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల డిమాండ్ మేరకు విడుదల చేసింది. మిగిలిన 25% కేంద్ర వాటా కూడా కేస్ టు కేస్ ప్రాతిపదికన విడుదలకు మంజూరు చేయబడింది.

అర్హతగల  విద్యార్ధులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనకుండా స్కాలర్‌షిప్ దరఖాస్తులను త్వరితగతిన ప్రాసెస్ చేయమని ఆయా ఏజెన్సీలకు కేంద్రప్రభుత్వం సూచించింది.  తద్వారా విద్యార్థులు ఎటువంటి సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉండది. దాంతో పాటు రోజువారి ప్రతిపదికన ఆయా ఏజెన్సీలకు స్కాలర్‌ షిప్‌ పథకాల అమలుకు సంబంధించిన నిధులను విడుదల చేయడంతో పాటు వాటి అమలును సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు ఆయా ఏజెన్సీలతో పర్యవేక్షణ చేస్తున్నారు.

ఎస్సీ నేషనల్ ఫెలోషిప్‌ పథకం కింద  లబ్ధిదారుల ఫెలోషిప్‌ల పంపిణీపై యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యుజిసి)తో పాటు సంబంధించ సంస్థలతో నెలవారీ ప్రాతిపదికన పర్యవేక్షిస్తుంది. ఈ పథకం కింద విద్యార్థులకు ఫెలోషిప్‌లను సకాలంలో పంపిణీ చేసేలా సామాజిక న్యాయ శాఖ  ఇప్పటికే ఆదేశాలను జారీ చేయడం జరిగింది. 

***



(Release ID: 1673617) Visitor Counter : 476