ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

8 రోజులుగా భారత లో కొత్త కోవిడ్ కేసులు 50 వేల లోపే

చికిత్స పొందుతున్న బాధితుల సంఖ్య మరింత తగ్గుదల

Posted On: 15 NOV 2020 12:30PM by PIB Hyderabad

భారతదేశంలో వరుసగా ఎనిమిదో రోజు కూడా కొత్త కోవిడ్ కేసులు 50 వేలలోపే నమోదయ్యాయి. గత 24 గంటలలో 41 వేలమంది కోవిడ్ పాజిటివ్ గా తేలారు. ఈ నెల 7న కోవిడ్ కేసులు 50 వేలలోపు నమోదు కాగా అప్పటినుంచి రోజూ ఆ సంఖ్య అంతకు దిగువనే కొనసాగుతోంది. ఒకవైపు యూరప్, అమెరికా దేశాల్లో కోవిడ్ బాధితులు పెరుగుతున్నప్పటికీ, భారత్ లో కోవిడ్ కు తగిన ముందు జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజలు వ్యవహరిస్తూ ఉండటం వల్ల అదుపులో ఉన్నట్టు అర్థమవుతోంది.  

 

గత 24 గంటలలో భారత్ లో 42,156  మంది కోలుకోవటంతో చికిత్స పొందుతూ ఉన్నవారి సంఖ్య మరింత తగ్గింది. ప్రస్తుతం దేశంలో చికిత్సపొందుతున్న కోవిడ్ బాధితులు 4,79,216 మంది ఉన్నారు. వీరు ఇప్పటిదాకా నమోదైన పాజిటివ్ కేసులలో  5.44% మాత్రమే. 15 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ప్రతి పదిలక్షల జనాభాకు కోవిడ్ కేసులు 6,387 కంటే దిగువన ఉన్నారు.

 

కొత్తగా వస్తున్న కేసులు తక్కువగా ఉండటం. ఎక్కువమంది చికిత్స అనంతరం కోలుకోవటం కారణంగా కోలుకున్నవారి శాతం  ఈ రోజు  93.09% కు చేరింది.  ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 82,05,728. కోలుకున్నవారికి, చికిత్సలో ఉన్నవారికి మధ్య తేడా బాగా పెరుగుతూ ప్రస్తుతం  77,26,51 కు చేరింది. కోలుకున్నవారిలో 79.91% మంది కేవలం 10 రాష్ట్రాలకు చెందినవారే ఉన్నారు. ఢిల్లీలో అత్యధికంగా  7,117 మంది కోలుకోగా, కేరళలో  6,793 మంది, పశ్చిమ బెంగాల్ లో  4,479 మంది గత 24 గంటలలో కోలుకున్నారు.

 

కొత్తగా పాజిటివ్ గా నిర్థారణ జరిగిన కేసులలో 82.87% కేవలం పది రాష్ట్రాల్లోనే నమోదయ్యాయి. గత 24 గంటలలో నిర్థారణ జరిగిన  కొత్త కేసులలో ఢిల్లీలో అత్యధికంగా  7,340 నమోదుకాగా కేరళలో 6,357, మహారాష్ట్రలో  4,237 కేసులు వచ్చాయి. 

గత 24 గంటలలో 447 మంది కోవిడ్ బాధితులు మరణించగా వారిలో 85.01% మంది కేవలం పది రాష్ట్రాలకు చెందినవారే ఉన్నారు.  తాజా మృతులలో 23.5% (105 మరణాలు) మహారాష్ట్రకు చెందినవారు. 96 మరణాలతో ఢిల్లీ, 53 మరణాలతో పశ్చిమ బెంగాల్ ఆ తరువాత స్థానాల్లో ఉన్నాయి.

 

21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రతి పది లక్షలమందిలో మరణాల సంఖ్య జాతీయ సగటు అయిన 94 కంటే తక్కువ నమోదైంది.

 

***


(Release ID: 1673029) Visitor Counter : 188