నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ
గరీబ్ కల్యాణ్ రోజ్గార్ అభియాన్ కింద 6 రాష్ట్రాల్లోని 116 జిల్లాలకు చెందిన 3 లక్షల మంది వలస కార్మికులకు స్కిల్ ఇండియా కార్యక్రమం కింద శిక్షణ ప్రారంభమైంది.
Posted On:
12 NOV 2020 5:32PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన (పిఎంకెవివై) పరిధిలోని సెంట్రల్లీ స్పాన్సర్డ్ అండ్ సెంట్రల్లీ మేనేజ్డ్ (సిఎస్సిఎం) భాగం కింద ఎక్కువ డిమాండ్ ఉన్న నైపుణ్యాలను కార్మికులకు నేర్పిస్తున్నారు. ఆరు రాష్ట్రాల్లోని 116 జిల్లాల్లో 200 మందికి పైగా శిక్షణ భాగస్వాములు నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తున్నారు
ప్రధాని మార్గదర్శకత్వంలో గరీబ్ కల్యాణ్ రోజ్గార్ అభియాన్ (జికెఆర్ఎ) కింద కేంద్ర నైపుణ్య అభివృద్ధి , వ్యవస్థాపక మంత్రిత్వ శాఖ (ఎంఎస్‌డిఇ) ఉత్తర ప్రదేశ్, బీహార్, రాజస్థాన్, ఒడిశా, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్‌లో గుర్తించిన 116 జిల్లాల నుండి 3 లక్షల మంది వలస కార్మికులకు శిక్షణ ఇచ్చింది.
కరోనా తరువాత నష్టపోయిన కార్మికులను, గ్రామీణులను శక్తిమంతం చేయడానికి ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన (పిఎంకెవివై)లోని సెంట్రల్ స్పాన్సర్డ్ అండ్ సెంట్రల్లీ మేనేజ్డ్ (సిఎస్సిఎం) ద్వారా డిమాండ్ ఉన్న నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తున్నారు. సంబంధిత జిల్లా కలెక్టర్లు / జిల్లా న్యాయాధికారులు / డిప్యూటీ కమిషనర్ల సహకారంతో, ఎంఎస్‌డిఇ ఈ జిల్లాల్లో నైపుణ్య శిక్షణ కోసం 125 రోజుల్లోపు కార్యక్రమాన్ని రూపొందిస్తున్నది. గుర్తించిన జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో శిక్షణ ఇప్పటికే ప్రారంభమైంది. నెల రోజుల్లోపు క్రమంగా ఇతర ప్రాంతాలకు విస్తరిస్తారు.
ఎంఎస్డీఈ అధీనంలోని నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎస్‌డిసి) ఇప్పటికే ఉన్న శిక్షణా ప్రొవైడర్లు , పిఎంకెవివై లేదా రాష్ట్ర పథకాల కింద పనిచేసే ప్రాజెక్ట్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీల ద్వారా శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. స్వల్పకాలిక శిక్షణ (ఎస్‌టిటి) కార్యక్రమం కింద 1.5 లక్షల మంది వలస కార్మికులకు తర్ఫీదు ఇస్తున్నది. మరో 1.5 లక్షల మంది వలస కార్మికులకు రికగ్నిషన్ ఆఫ్ ప్రియర్ లెర్నింగ్ (ఆర్‌పిఎల్) పథకం కింద సర్టిఫికెట్లు ఇవ్వనున్నారు. ఈ జిల్లాల్లో స్థానికంగా ఉద్యోగాలకు డిమాండ్ పెంచుతున్నారు. తిరిగి వచ్చిన వలసదారులకు జిల్లా యంత్రాంగాలు శిక్షణ ఇస్తున్నాయి. జిల్లా యంత్రాంగం సిఫారసుల ప్రకారం స్థానిక పరిశ్రమలకు అనువైన వివిధ ఉద్యోగాల కోసం నైపుణ్యకల్పన శిక్షణా కార్యక్రమాలను నిర్వహించడానికి నైపుణ్య మంత్రిత్వ శాఖ ప్రయత్నిస్తోంది.
కేంద్ర నైపుణ్య అభివృద్ధి , వ్యవస్థాపకత మంత్రి డాక్టర్ మహేంద్ర నాథ్ పాండే మాట్లాడుతూ గ్రామీణాభివృద్ధికి నైపుణ్యం , వ్యవస్థాపకతను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. “ నైపుణ్యాల కల్పన ద్వారా గ్రామీణాభివృద్ధికి స్కిల్ ఇండియా మిషన్ కీలకం. ఎందుకంటే మొత్తం శ్రామిక శక్తిలో 70% గ్రామీణ భారతదేశంలోనే ఉంది. మారుతున్న పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా శిక్షణ ఇవ్వడానికి నైపుణ్యాల శిక్షకుల మధ్య సమన్వయం ఎంతో అవసరం. శ్రామికశక్తి వలసల తరువాత నష్టాలను పూడ్చడానికి ప్రాంతీయ స్థాయిలో పరిశ్రమ-సంబంధిత ఉద్యోగాల కల్పనకు ఒకరికొకరం సహకరించుకోవాలి. డిమాండ్-ఆధారిత నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టడానికి మేము కట్టుబడి ఉన్నాం. దీంతో మన ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న వలసకార్మికులకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. వీళ్ల సమష్టి బలం మన ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటిది” అని ఆయన వివరించారు. జిల్లాల్లో నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు స్కిల్ ఇండియా పోర్టల్ ద్వారా శిక్షకులకు గుర్తింపు, అనుమతులు వచ్చిన తరువాత మొదలయ్యాయి. తరువాత వ్యవస్థ-ఆధారిత లక్ష్యాలను ఆమోదించింది. ఈ ఆరు రాష్ట్రాల్లో అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్, సెల్ఫ్ ఎంప్లాయ్డ్ టైలర్, రిటైల్ సేల్స్ అసోసియేట్, కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ (కాల్ సెంటర్), కుట్టు మెషిన్ ఆపరేటర్ , జనరల్ డ్యూటీ అసిస్టెంట్ వంటి వాటికి డిమాండ్ ఉంది. షార్ట్ టర్మ్ ట్రైనింగ్ (ఎస్‌టిటి) లో జికెఆర్ఎ ఉన్నందున, ఎస్‌టిటి-సిఎస్‌సిఎం-పిఎంకెవివై 2016-20 ప్రకారం అర్హత ఉన్న అభ్యర్థులకు అన్ని ప్రయోజనాలు వర్తిస్తాయి. డీబీటీ ప్రకారం అర్హత గల అభ్యర్థులు రవాణా సౌకర్యం, బోర్డింగ్ , బస, పోస్ట్ ప్లేస్‌మెంట్ మద్దతు, ఇతర సహకారం పొందవచ్చు.
స్కిల్ ఇండియా కింద పీఎంకేవీవై కింద చేపట్టిన స్వల్పకాలిక శిక్షణ (ఎస్టీటీ) లక్ష్యం.. పాఠశాల / కళాశాల డ్రాపౌట్స్ లేదా నిరుద్యోగ యువతకు వివిధ రంగాలు , ఉద్యోగాల కోసం నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వడం. శిక్షణా కార్యక్రమం. ఉద్యోగాల స్వభావాలను బట్టి శిక్షణ వ్యవధి 150 గంటల నుంచి, 300 గంటల వరకు ఉంటుంది. పూర్వ అభ్యాసం గుర్తింపు ప్రోగ్రామ్ ఒక అధికారిక వ్యవస్థకు వెలుపల పొందిన అభ్యాస విలువను గుర్తించి, ఒక వ్యక్తి నైపుణ్యాలకు ప్రభుత్వ ధృవీకరణ పత్రాన్ని అందిస్తుంది. అభ్యర్థులు డిజిటల్ , ఆర్థిక అక్షరాస్యత , ప్రమాదవశాత్తు బీమా కవరేజీని మూడు సంవత్సరాల పాటు ఉచితంగా పొందుతారు. ఆర్‌పిఎల్ కార్యక్రమంలో పాల్గొనడానికి అభ్యర్థి నుండి ఎటువంటి రుసుము వసూలు చేయరు. విజయవంతంగాశిక్షణ పూర్తి చేసుకున్న ప్రతి అభ్యర్థికి 500 రూపాయలు ఇస్తారు. ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన (పిఎంకెవివై) 2016-2020 కింద నైపుణ్య మంత్రిత్వ శాఖ ఇప్పటివరకు 92 లక్షలకు పైగా అభ్యర్థులకు శిక్షణ ఇచ్చింది.
***
(Release ID: 1672895)
Visitor Counter : 199