ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం

దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు

Posted On: 13 NOV 2020 4:18PM by PIB Hyderabad

దేశ ప్రజలకు, విదేశాలలో నివసిస్తున్న భారతీయులకు ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు దీపావళి పండుగ శుభాకాంక్షలను తెలిపారు.

 ' దీపాలపండుగ అయిన దీపావళి, దీవాళి పర్వదినాన దేశంలోనూ విదేశాలలోలోను నివసిస్తున్న భారతీయులందరికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. సంప్రదాయబద్ధంగా ఉత్సాహంగా జరుపుకొనే దీపావళి పండుగ చెడుపై మంచి సా దించిన విజయానికి ప్రతీక. శ్రీరాముని జీవిత ఆదర్శాలు, ఆయన అనుసరించిన నైతిక విలువలపై మనకున్న నమ్మకాన్ని దీపావళి పండుగ తెలియచేస్తుంది.రావణాసురుడిని ధర్మ యుద్ధంలో ఓడించి శ్రీరాముడు 14 సంవత్సరాల అరణ్యవాసాన్ని పూర్తి చేసుకుని సీత లక్షణ సమేతంగా అయోధ్యకు .చేరిన రోజు ఈ రోజు. ఉన్నత ఆశయాలు, విలువలతో జీవించిన శ్రీరాముడు ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయుడు. మనలో ఉన్న చేదు భావాలను పారద్రోలి శ్రీరాముడుని ఆదర్శంగా తీసుకుని ఉన్నత విలువలతో జీవించవలసిన అవసరం ఉంది .

దీపావళి పండుగను భారతదేశంలో మాత్రమే కాకుండా ఇతర దేశాలలో జరుపుకుంటారు. ప్రపంచవ్యాపితంగా ప్రజలు జరుపుకునే అతి పెద్ద పండుగ దీపావళి. విదేశాలలో జీవిస్తున్న భారతీయులు అత్యంత ఉత్సాహంగా భక్తితో ప్రతి ఒక్కరూ కలసి జరుపుకునే పండుగ దీపావళి.

సంపదలను ఇచ్చే లక్ష్మీదేవిని దీపావళి పండుగనాడు పూజించడం గొప్ప విశేషం.

దీపావళి రోజున కుటుంబసభ్యులు, బంధుమిత్రులు ఒకచోట చేరి అందరూ కలసి పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. అయితే, కోవిడ్-19 ను దృష్టిలో ఉంచుకుని ఆరోగ్య, సమాజ శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇస్తూ నిబంధనలను పాటిస్తూ పండుగను జరుపుకోవాలని నేను కోరుతున్నాను.

దీపావళి ప్రతి ఒక్కరి జీవితాలలో చీకట్లను తొలగించి వెలుగులను ప్రసాదించాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ ఆనందంతో, సుఖసంతోషాలతో కలసి జీవించాలని నేను కోరుకుంటున్నాను. ' అని శ్రీ వెంకయ్యనాయుడు తన సందేశంలో పేర్కొన్నారు.

***

 

 

 



(Release ID: 1672792) Visitor Counter : 104