రాష్ట్రపతి సచివాలయం
దీపావళి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన - భారత రాష్ట్రపతి
Posted On:
13 NOV 2020 6:11PM by PIB Hyderabad
దీపావళి సందర్భంగా భారత రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ తన తోటి పౌరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ మేరకు రాష్ట్రపతి ఒక సందేశం విడుదల జేస్తూ, “దీపావళి శుభ సందర్భంగా, భారతదేశం మరియు విదేశాలలో నివసిస్తున్న తోటి పౌరులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
వివిధ మతాలు, వివిధ వర్గాల ప్రజలు జరుపుకునే ఈ పండుగ మన దేశ ప్రజలలో ఐక్యత, సద్భావన, సోదర భావాన్ని బలపరుస్తుంది. మానవ సమాజానికి సేవ చేయాలనే ప్రేరణను ఈ పండుగ మనకు కల్పిస్తుంది.
ఒక దీపం దాని వెలుగును పంచుకోవడం ద్వారా అనేక దీపాలను వెలిగించినట్లే, మన ఆనందాన్ని పంచుకోవడం ద్వారా సమాజంలోని పేదలు, నిరాశ్రయులు, అవసరమైన వారందరికీ, ఈ పండుగ ఆశ మరియు శ్రేయస్సు యొక్క దీపంగా మారాలని ఈ సందర్భంగా, నిశ్చయించుకుందాం. దీపాల పండుగ దీపావళి, పరిశుభ్రత పండుగ కూడా, కాబట్టి కాలుష్య రహిత, పర్యావరణహిత, పరిశుభ్రమైన దీపావళిని జరుపుకోవడం ద్వారా ప్రకృతి మాతను గౌరవిద్దాం.
ఆనందాన్నీ, కాంతినీ ఇచ్చే ఈ గొప్ప పండుగ, మన దేశంలోని ప్రతి ఇంటికీ, ఉత్సాహం, శాంతి మరియు శ్రేయస్సుని తెస్తుంది ”.
హిందీలో రాష్ట్రపతి సందేశాన్ని చూడటానికి ఇక్కడ "క్లిక్" చేయండ
*****
(Release ID: 1672790)
Visitor Counter : 174