ఆర్థిక మంత్రిత్వ శాఖ

2021-22 వార్షిక బడ్జెట్‌ కోసం ఆలోచనలు, సూచనలు, ప్రతిపాదనలు కోరుతున్న ఆర్థిక మంత్రిత్వ శాఖ

प्रविष्टि तिथि: 13 NOV 2020 4:16PM by PIB Hyderabad

బడ్జెట్‌ రూపకల్పనకు ముందు పారిశ్రామిక, వాణిజ్య, వర్తక సంఘాలు, నిపుణులతో, నార్త్‌ బ్లాక్‌లో కేంద్ర ఆర్థిక శాఖ సంప్రదింపులు జరపడం ఏటా సంప్రదాయంగా వస్తోంది. బడ్జెట్ కోసం సలహాలు, ఆలోచనలను ఆ సమావేశాల్లో మంత్రిత్వ శాఖ కోరుతోంది. ఈ ఏడాది కరోనా కారణంగా విభిన్న మార్గంలో సంప్రదింపులు జరపాలని మంత్రిత్వ శాఖకు సూచనలు అందాయి. దాని ప్రకారం, వివిధ సంస్థలు, నిపుణుల నుంచి సూచనలు స్వీకరించడానికి ప్రత్యేక ఈ మెయిల్‌ ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. దీని సమాచారం త్వరలోనే ప్రకటిస్తారు.

    దేశ ప్రజలకు బడ్జెట్‌ను చేరువ చేసి, 2021-22 బడ్జెట్‌ సంప్రదింపుల్లో మరింత ఎక్కువ భాగస్వామ్యం, ప్రజాస్వామ్యం కల్పించాలని మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఇందుకోసం 'మైగవ్‌' వేదికగా ఆన్‌లైన్‌ పోర్టల్‌ను ప్రారంభించింది. సలహాలు, సూచనలు ఇవ్వడానికి వీలుగా ఆదివారం (15.11.2020‌) నుంచి ఇది ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. వాటిని సంబంధిత మంత్రిత్వ శాఖలు, విభాగాలు పరిశీలిస్తాయి. అవసరమైతే, ఆయా సలహాలు, సూచనలపై మరింత స్పష్టత కోసం, పోర్టల్‌లో నమోదు సమయంలో ప్రజలిచ్చిన ఈమెయిల్‌, ఫోన్‌ నంబర్‌ ద్వారా అధికారులు సంప్రదిస్తారు. 30.11.2020 వరకు ఈ పోర్టల్‌ ప్రజలకు అందుబాటులో ఉంటుంది.

***


(रिलीज़ आईडी: 1672683) आगंतुक पटल : 246
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Kannada , Malayalam , Bengali , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Punjabi , Tamil