మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

ఐఐటి బొంబాయి నిర్వహించిన జాతీయ విద్యా దినోత్సవ కార్యక్రమాన్ని వర్చువల్ విధానంలో ప్రారంభించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి
ఎన్‌ఇపి -2020 అమలు దేశలోని విద్యావ్యవస్థను మారుస్తుంది - శ్రీ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్

Posted On: 10 NOV 2020 4:35PM by PIB Hyderabad

 

కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ ఈ రోజు ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ విద్యా దినోత్సవం (రాష్ట్రీయశిక్షా దివాస్) కార్యక్రమాన్ని వర్చువల్ విధానంలో ప్రారంభించారు. భారతదేశ ప్రథమ విద్యా మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మదినం సందర్భంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-బొంబాయి ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. నవంబర్ 11న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటారు. ఇస్రో మాజీ చైర్మన్, కొత్త విద్యా విధానాన్ని రూపొందించడానికి ఏర్పాటైన కమిటీ చైర్మన్ కె. కస్తూరిరంగన్ గౌరవ అతిథిగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

 

EmdBZGdXUAIdzMg.jpgజాతీయ విద్యా దినోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించిన శ్రీ పోఖ్రియాల్ తన ప్రసంగంలో "భారతదేశంలో చదవండి.. భారతదేశంలో ఉండండి.. ప్రపంచ విద్యాకేంద్రంగా భారతదేశాన్ని మార్చడానికి మేము కట్టుబడి ఉన్నాము. విద్యావిధానంలో నాణ్యతను పెంపొందించేందుకు ప్రపంచంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల సహకారం, సమన్వయం అవసరం. ఆ మేరకు ఒప్పందాలు చేసుకుంటున్నాం. ప్రపంచంలోని టాప్ 100 విశ్వవిద్యాలయాలను ఆహ్వానించాలన్న విధానం ఎన్‌ఈపీ-2020 చేర్చాం" అని చెప్పారు.

నాయకులను, నూతన ఆవిష్కర్తలను సృష్టించడంతో పాటు ఉత్తమ విద్యను అందించే ప్రపంచ ప్రముఖ సాంకేతిక సంస్థ ఐఐటి బొంబాయి అని శ్రీపోఖ్రియాల్  చెప్పారు. తద్వారా సమాజానికి, పరిశ్రమలకు అవసరమైన మేదస్సు లభిస్తోందన్నారు. ఎన్ఇపి-2020 అమలుతో దేశ విద్యావ్యవస్థలో సమూల మార్పులు వస్తాయని అన్నారు. భారతదేశంలో పరిశోధన మరియు అభివృద్ధిని మరింత ఉన్నత స్థితికి తీసుకెళ్లడానికి అంకితభావంతో కృషి చేసినందుకు అవార్డు గ్రహీతలందరినీ మంత్రి అభినందించారు. భారతదేశ ప్రజల ప్రయోజనాల కోసం సైన్స్ అండ్ టెక్నాలజీని ఉపయోగించాలని ఆయన విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. మానవ వనరుల పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద దేశంగా ఉన్నాం కాబట్టి దేశ నిర్మాణ కార్యక్రమాలలో సహకరించమని కోరారు.

ఐఐటి బొంబాయి రీసెర్చ్ ఎక్సలెన్స్ అవార్డ్స్-2019 ను డైరెక్టర్ ప్రొఫెసర్ సుభాసిస్ చౌదరిగవే అందించారు.నూతన ఆవిష్కరణలపై పరిశోధన మరియు అభివృద్ధికి చేసిన కృషికి గాను అధ్యాపకులకు గత కొన్నేళ్లుగా ఐఐటీ బొంబాయి ఎక్స్‌లెన్సీ అవార్డులను ప్రధానం చేస్తోంది.  ఆ అవార్డులు..

1. రిసర్చ్ పబ్లికేషన్ అవార్డు (ఐదు అవార్డులు) డిజైన్, ఫిల్మ్ వంటి విభాగాల్లో చేసిన పరిశోధనల గుర్తించడంతో పాటు వాటిన అమలుచేసినందుకు

2. మోనోగ్రాఫ్‌లు / పుస్తకాలు / సమీక్ష అధ్యాయాలు / సమీక్షా పత్రాల ద్వారా పరిశోధనలను వ్యాప్తి చేయడానికి చేసిన కృషిని గుర్తించడానికి రిసర్చ్ డిస్‌మినేషన్ అవార్డు (3 అవార్డులు)

3. ఎర్లీ రిసెర్చ్ అచీవర్అవార్డు (3 అవార్డులు) - అత్యుత్తమమైన సామర్థ్యాన్ని ప్రదర్శించిన^యువ పరిశోధకులకు అందిస్తారు

ఐఐటి బొంబాయి డైరెక్టర్ ప్రొఫెసర్ సుబాసిస్‌ చౌదురి మాట్లాడుతూ "విద్యా మంత్రిత్వ శాఖ రూపొందించిన జాతీయ విద్యా విధానం-2020 దాని పరిధి, చాలా సమగ్రంగా ఉంది. తద్వారా భారతదేశంలోని విద్యార్థులందరికీ మరింత నాణ్యమైన విద్య  లభిస్తుందని మేము ఆశిస్తున్నాము. మా అధ్యయనాలు విస్తృతమైన, ముఖ్యమైన మరియు సామాజిక అనుసంధానం ద్వారా మరింత ఉపయోగకరంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నాం. జాతీయ విద్యా దినోత్సవాన్ని జరుపుకుంటున్న నేపథ్యంలో నాణ్యమైన విద్యను మరియు పరిశోధనలో రాణించటానికి మరింతగా కృషి చేస్తామని పునరుద్ఘాటిస్తున్నాము." అని చెప్పారు.

క్రియెటివ్ రిసెర్చ్-2019 ప్రొఫెసర్ కృతిరామృతం అవార్డును అన్‌సెర్టెనిటి మెనేజ్‌మెంట్ ఇన్ ద స్మార్ట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అనే ఆంశంపై పరిశోధన చేసినందుకు గాను ప్రొఫెసర్ జయక్రిష్ణ నాయక్,  డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌కు ప్రధానం చేయడం జరిగింది. అలాగే ఎలాక్ట్రోమాగ్నటిక్ కౌంటర్‌పార్ట్స్‌ టు గ్రావిషనల్ వేవ్ సోర్స్‌ అనే అనే ఆంశంపై పరిశోధన చేసినందుకు గాను  ప్రొఫెసర్ వరుణ్‌భలేరావ్‌కు పురష్కారం అందజేశారు. ఈ పురష్కారం కింది అవార్డుతో పాటు  ప్రశంసా పత్రం, లక్ష రూపాయల నగదు ప్రోత్సాహకంగా అందిస్తారు. ఆ మొత్తం  ప్రొఫెసర్ జయంత్ ఆర్. హరిస్తా, ఐఐఎస్‌సి, బెంగళూరు ఇచ్చిన ఎండోమెంట్ గ్రాంట్ నుండి ఇవ్వబడుతుంది.

గౌరవ అతిథి డాక్టర్ కె. కస్తూరిరంగన్ తన ప్రసంగంలో, "జాతీయ విద్యా విధానం-2020 విద్యకు సమగ్రమైన మరియు సరళమైన విధానాన్ని సూచిస్తుంది; విద్య యొక్క వివిధ దశలను వాటి  పరస్పర అనుసంధానతను దృష్టిలో ఉంచుకుని రూపొందించడం జరిగింది. ఈ ఎండ్‌ టు ఎండ్ విద్యా విధానం దేశాభివృద్ధిలో విశేషంగా ఉపయోగపడుతుంది" అని చెప్పారు.

ప్రారంభోత్సవం తరువాత జాతీయ విద్యా విధానం 2020 పై వర్క్‌షాప్ జరిగింది. ఈ వర్క్‌షాప్‌లో ప్రొఫెసర్ బిఎన్ జగతాప్, ఐఐటి బొంబాయి, డాక్టర్ జైతిర్త్ 'జెర్రీ' రావు, వ్యవస్థాపకుడు, విబిహెచ్‌సి మరియు హెచ్‌ఎఫ్‌ఎఫ్‌సి వ్యవస్థాపకుడు మరియు ప్రొఫెసర్ ధ్రుబా జె. సైకియా, టిఫ్ఆర్ , మాజీ-విసి, కాటన్ కాలేజ్ స్టేట్ యూనివర్శిటీ పాల్గొన్నారు.

***(Release ID: 1671856) Visitor Counter : 90