భారత ఎన్నికల సంఘం

బీహార్ శాసనసభకు సాధారణ ఎన్నికలు, ఉప ఎన్నిక‌ల‌ ఫలితాల గురించి తెలియ‌పరిచేందుకు ప్ర‌త్యేక ఏర్పాట్లు

Posted On: 09 NOV 2020 6:10PM by PIB Hyderabad

బీహార్ శాసన సభకు జ‌రిగిన సాధారణ ఎన్నికలు, దేశంలోని వివిధ రాష్ట్రాల‌లో ఖాళీ అయిన స్థానాల‌కు జ‌రిగిన ఉప ఎన్నికల ఫలిత పోకడలను గురించి ఎప్ప‌టిక‌ప్పుడు తెలియ‌జేసేందుకు ప్ర‌త్యేక ఏర్పాట్లు చేయ‌బ‌డినాయి. ఈ రోజు (10వ తేదీ) ఉద‌యం 8 గంట‌ల నుంచి ఓట్ల లెక్కింపు కేంద్రాల‌తో పాటుగా ఈ కింది ప్రాంతాల‌లో కూడా ఫ‌లితాల స‌ర‌ళిని గురించి తెలియ‌జేసేలా ఏర్పాట్ల‌ను చేశారు.
తాజా ఎన్నిక‌ల ఫ‌లితాలు భారత ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్
https://results.eci.gov.in/ ప్రదర్శించబడతాయి. ప్రతి నియోజకవర్గానికి సంబంధించి రౌండ్ల వారీగా ఫ‌లితాల‌ను ప్ర‌ద‌ర్శిస్తారు. కొన్ని నిమిషాల వ్య‌వ‌ధిలో
ఫ‌లితాల‌ను న‌వీక‌రిస్తూ ప్ర‌ద‌ర్శిస్తారు. గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్లలో లభించే “ఓటరు హెల్ప్‌లైన్” మొబైల్ యాప్‌లో కూడా ఫలితాలు అందుబాటులో ఉంటాయి. ఆయా ఓట్ల లెక్కింపు అధికారులు సంబంధిత కౌంటింగ్ కేంద్రాల నుంచి సిస్ట‌మ్‌లో అందుబాటులో ఉంచిన స‌మాచారం వెంట‌వెంట‌నే
భార‌త ఎన్న‌క‌ల క‌మిష‌న్ వెబ్‌సైట్ మ‌రియు మొబైల్ యాప్‌ల‌లో అందుబాటులో  ఉంచుతారు.

 

****


(Release ID: 1671701) Visitor Counter : 144