కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

'ఇండియా మొబైల్ కాంగ్రెస్-2020'‌ నాలుగో ఎడిషన్‌ను వీడియో సందేశం ద్వారా ప్రకటించిన శ్రీ సంజయ్ ధోత్రే

- డిసెంబర్ 8 నుండి 10 వరకు జ‌ర‌గ‌నున్న ఈ స‌మావేశంలో 50కి పైగా కంపెనీలు, 3,000ల‌కు పైగా సీఎక్స్ఓ స్థాయి డెలిగేట్‌లు, 15,000కు పైగా సంద‌ర్శ‌కులు వ‌ర్చువ‌ల్ అవ‌తార్‌లో పాల్గొన‌నున్నారు

Posted On: 09 NOV 2020 5:17PM by PIB Hyderabad

'ఇండియా మొబైల్ కాంగ్రెస్ - 2020' (ఐఎంసీ) నాలుగో ఎడిషన్‌ను కేంద్ర క‌మ్యూనికేషన్స్, ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ స‌హాయ‌ మంత్రి శ్రీ సంజయ్ ధోత్రే ఒక వీడియో సందేశం ద్వారా ప్రకటించారు.

 


డిసెంబ‌రు 8వ తేదీ నుంచి 10వ తేదీ వ‌ర‌కు ఐఎంసీ స‌మావేశం జ‌రుగ‌నుంది.
కోవిడ్ మ‌హ‌మ్మారి వ్యాప్తి కార‌ణంగా ఈ ఏడాది ఐఎంసీ వ‌ర్చువ‌ల్ విధానంలో జ‌రుగనుంది. కేంద్ర టెలికమ్యూనికేషన్స్ శాఖ (డీఓటీ), సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (కోవాయి) సంయుక్తంగా ఐఎంసీ కార్య‌క్ర‌మాన్ని
నిర్వ‌హించనున్నాయి. ఈ స‌మావేశంలో 50కి పైగా కంపెనీలు, 3,000ల‌కు పైగా సీఎక్స్ఓ స్థాయి డెలిగేట్‌లు, 15000కు పైగా సంద‌ర్శ‌కులు వ‌ర్చువ‌ల్ అవ‌తార్‌లో పాల్గొన‌నున్నారు. ఈ ఏడాది ఐఎంసీ కార్య‌క్ర‌మాన్ని "ఇన్‌క్లూజివ్ ఇన్నోవేష‌న్‌- స్మార్ట్ ఐ సెక్యూర్ ఐ స‌స్ట‌యినెబుల్‌" అనే థీమ్‌తో నిర్వ‌హించ‌నున్నారు. ఆత్మ‌
నిర్భ‌ర్ భారత్‌ను (మేక్ ఇన్ ఇండియా - స్థానిక తయారీ మరియు 'మేక్ ఫర్ వరల్డ్ విధానాన్ని ముందుకు తీసుకుపోవ‌డాన్ని), అంతర్జాతీయంగా ప్రాంతీయ సహకారాన్ని పెంపొందించుకోవ‌డం, సతత్ భారత్‌ను ప్రేరేపించ‌డం - సనాతన్ భారత్ (దాదాపు ఆరు లక్షల గ్రామాలను ఆప్టికల్ ఫైబర్, సుస్థిర అభివృద్ధితో అనుసంధానించడంలో డిజిటల్ స‌మ్మ‌ళితం), సమగ్ర భారత్ - సాక్షి భారత్‌ను (వ్యవస్థాపకత & ఆవిష్కరణ) ప్రోత్సహించడం, విదేశీ, స్థానిక పెట్టుబడులను, ఆర్ అండ్ డీని ప్రోత్సహించడం, టెలికాం & ఎమర్జింగ్ టెక్నాలజీ రంగాలు మరియు సహాయక నియంత్రణ & విధాన చట్రాలను సులభతరం చేయడాన్ని
ప్రోత్సహించాల‌న్న గౌరవ ప్రధానమంత్రి దృష్టి కోణానికి అనుగుణంగా ఐఎంసీ -2020 కార్య‌క్ర‌మం ల‌క్ష్యాన్ని స‌మ‌లేఖ‌నం చేయ‌నున్నారు. ఈ ఏడాది ఐఎంసీ కార్య‌క్ర‌మానికి డెల్ టెక్నాలజీస్, రిబ్బన్ కమ్యూనికేషన్స్, రెడ్ హాట్ సంస్థ‌లు
ప్రధాన భాగస్వాములుగా నిలువ‌నున్నాయి. ఈ ఏడాది జ‌రిగే భారత అతిపెద్ద టెక్నాలజీ ఈవెంట్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి పరిశ్రమల నాయకులు, నియంత్ర‌ణ సంస్థ‌లు, విధానక‌ర్త‌లు ఒక వేదిక‌పైకి కలిసి రావడానికి గాను సాక్షి భూతంగా నిలువనుంది. ఈ కార్య‌క్ర‌మంలో వివిధ మంత్రిత్వశాఖల వారు కూడా పాల్గొన‌నున్నారు. మ‌హ‌మ్మారి వెలుగు చూసిన నేప‌థ్యంలో వివిధ టెలికాం సంస్థ సీఈవోలు, గ్లోబల్ సంస్థ‌ల సీఈఓలు, ఎస్‌.జి.బ్రాడ్కాస్టింగ్ నిపుణులు, ఎస్‌.జి. ఎంటర్ప్రైజ్ సొల్యూషన్స్, ఓటీటీ, వివిధ స‌స్ట‌యిన‌బుల్ ఫ్యూచరిస్ట్‌లు మొబైల్ పరిశ్రమలు ఎదుర్కొంటున్న స‌మస్యలు, సవాళ్లు, భవిష్యత్ పోకడలు మరియు అవకాశాలపై చర్చించ‌నున్నారు. ఆసియాలోనే అతిపెద్ద డిజిటల్ టెక్నాలజీ ఫోరమ్‌గా పరిగణించబడుతున్న ఐఎంసీ, పరిశ్రమ, ప్రభుత్వం, అకాడెమియా మరియు ఇతర ఎకోసిస్ట‌మ్ ప్లేయ‌ర్‌ల‌ను ఏకతాటిపైకి తేవడానికి ఒక ప్రముఖ వేదికగా నిలుస్తోంది. ఎస్‌జీ, కృత్రిమ మేథ‌స్సు (ఏఎల్‌), ఇంటర్‌నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ), డేటా అనలిటిక్స్, క్లౌడ్ అండ్ ఎడ్జ్ కంప్యూటింగ్, ఓపెన్
సోర్స్టెక్, డేటా ప్రైవసీ అండ్ సైబర్ సెక్యూరిటీ, స్మార్ట్ సిటీస్,ఆటోమేషన్ ప్రధాన ఇతివృత్తాల చుట్టూనే తాజా పరిశ్రమ సాంకేతిక పోకడల్ని చర్చించేలా, స‌మాలోచ‌న‌లు చేయ‌నున్నారు. కార్య‌క్ర‌మం గురించి సంక్షిప్తంగా తెలియ‌ప‌రిచే
కర్టెన్ రైజర్ కార్య‌క్ర‌మంలో గౌరవనీయులైన‌ కమ్యూనికేషన్స్, ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి శ్రీ సంజయ్ ధోత్రే మాట్లాడుతూ, "ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2020 టెక్నాలజీ ఆధారిత కార్యక్రమాలకు కీలకమైన ప్రదర్శనగా ఉంటుందని మేము గట్టిగా నమ్ముతున్నాము. టెలి కమ్యూనికేషన్ పర్యావరణ వ్యవస్థలోని అన్ని భాగ‌స్వామ్య ప‌క్షాల వారిని ఒకచోట చేర్చుతుంది. విధాన రూపకర్తలు, నియంత్రకాలు మరియు ఈ పరిశ్రమలకు సంబంధించిన ముఖ్య అంశాలపై విలువైన చర్చకు సరైన వేదిక‌ను అందిస్తుంది. ఇండియా మొబైల్ కాంగ్రెస్ లాంటి వేదిక, భారత ప్రభుత్వం మరియు టెలికాం పరిశ్రమల ప్రయత్నాల‌ను మన దేశానికి మాత్రమే కాకుండా, ప్రపంచం మొత్తానికి గ‌రిష్టంగా తెలియ‌ప‌రుస్తుంది." ఈ కార్య‌క్ర‌మంలో భారత కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ డీసీసీ మ‌రియు కార్య‌ద‌ర్శి (టీ), ఛైర్మన్ శ్రీ అన్షూ ప్రకాశ్‌, కేంద్ర కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి (టీ) శ్రీమతి అనితా ప్రవీణ్, కోవాయి సంస్థ చైర్మెన్‌, భార‌తీ ఎయిర్‌టెల్ సీఓఓ శ్రీ అజ‌య్‌పురి అతిథులుగా హాజరయ్యారు.
కోవాయి డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ డాక్టర్ ఎస్పీ కొచ్చర్ మాట్లాడుతూ..
ఐఎంసీ వంటి ఇంత గొప్ప కార్యక్ర‌మం నాలుగో సంవత్సరంలోకి విజయవంతంగా చేరుకోవడానికి గాను గౌర‌వ విదేశాంగ మంత్రి శ్రీ సంజయ్ ధోత్రే చూపిన‌ అపార సహకారం, మార్గదర్శకత్వానికి మా కృతజ్ఞతలు.త‌మ ఈ ప్రయత్నానికి మరియు మొత్తం పరిశ్రమకు సౌకర్యవంతమైన వాతావరణాన్ని కల్పించినందుకు భారత ప్రభుత్వానికి మా కృతజ్ఞతలు అని అన్నారు. ఈ పూర్తి స‌హ‌కారంతో ఇండియా మొబైల్ కాంగ్రెస్.. దక్షిణ ఆసియాలో అతిపెద్ద టెక్నాలజీ ఈవెంట్, డిజిటల్ టెక్నాలజీ విభాగంలో భారతదేశ‌పు అతిపెద్ద నెట్‌వర్కింగ్ ఈవెంట్ ఎదిగిందని అన్నారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని, ఆవిష్క‌ర‌ణ‌ల‌ను ప్ర‌ద‌ర్శించేందుకు గాను
ఐఎంసీని ఒక వేదిక‌గా మార్చుకొనేందుకు గాను వాటాదారులు ఎదురుచూస్తారని మేము ఖచ్చితంగా అనుకుంటున్నాము. ప్రభుత్వం మరియు పరిశ్రమ రెండింటి నుండి అధికారులు మరియు సీనియర్ నిర్ణయాధికారులు హాజరవుతారు మరియు దేశంలోని ఈ మార్క్యూ కార్యక్రమంలో ఈ ఎకోసిస్ట‌మ్ అందించే ఉత్తమమైన వాటిని టెక్ కంపెనీలు ప్రదర్శిస్తాయి."

కోవాయి గురించి: కోవాయి 1995లో ఏర్పాటు చేయ‌బ‌డింది. రిజిస్టర్డ్ మ‌రియు ప్రభుత్వేతర సొసైటీగా దీనిని ఏర్పాటు చేయ‌డ‌మైంది. మొబైల్ కమ్యూనికేషన్ మౌలిక సదుపాయాలు, ఉత్పత్తులు మరియు సేవల ప్రపంచ నాయకుడిగా భారతదేశాన్ని నిల‌ప‌డం, బ్రాడ్ బ్యాండ్‌తో సహా నూటికి 100 శాతం జాతీయ టెలి సాంద్రతను సాధించడంపై కోవాయి విజ‌న్‌. ఆధునిక కమ్యూనికేషన్ యొక్క పురోగతికి, వినూత్న మరియు సరసమైన మొబైల్ కమ్యూనికేషన్ సేవల ప్రయోజనాలను భారత ప్రజలకు అందించడానికి అసోసియేషన్ అంకితం చేయబడింది.

                             

*******



(Release ID: 1671590) Visitor Counter : 195