శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
దేశంలో వేగంగా మారుతున్న భవిష్యత్తు అవసరాల కోసం డిఎస్‌టి కృషి చేస్తోంది: డిఎస్‌టి సెక్రటరీ ప్రొఫెసర్ అశుతోష్ శర్మ
"సైన్స్, సాంకేతికత మరియు నూతన ఆవిష్కరణలు చాలా విస్తృతమైన ప్రయోజనాలను కలిగి ఉంటాయి. ఆర్ధిక వ్యవస్థ అభివృద్ధికి మరియు దేశ శ్రేయస్సు కోసం వీటిని కార్పొరేట్లు, విధాన నిర్ణేతలు మరియు సంస్థలు ఉపయోగించడం అవసరం": డాక్టర్ కృష్ణమూర్తి సుబ్రమణియన్, చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ (సిఇఎ),జీవోఐ
Posted On:
09 NOV 2020 3:00PM by PIB Hyderabad
ఇటీవల 50వ వార్షికోత్సవం జరుపుకున్న నేపథ్యంలో డిఎస్‌టి ఏర్పాటు చేసిన వెబ్‌నార్‌లో సైన్స్ అండ్ టెక్నాలజీ (డిఎస్‌టి) కార్యదర్శి ప్రొఫెసర్ అశుతోష్ శర్మ పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఆవిష్కరణ, స్టార్టప్‌లకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం, సైన్స్, టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్‌లను ఉపయోగించడం ద్వారా కొత్త ఉద్యోగాలు మరియు సంపదను సృష్టించవచ్చని చెప్పారు. అతి వేగంగా మారుతున్న దేశ భవిష్యత్ అవసరాల కోసం డిఎస్‌టి కృషి చేస్తోందన్నారు.
"సైన్స్‌తో పాటు టెక్నాలజీలకు సంబంధించిన అన్ని రంగాలలో సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడానికి డిఎస్టి కృషి చేస్తోంది. గత ఐదేళ్ళలో, మా బడ్జెట్ రెట్టింపు అయ్యింది. అందువల్ల మేము భవిష్యత్తు కోసం ఆవిష్కరణలను ఉపయోగించుకునే దిశగా దేశానికి సహాయపడటానికి సైన్స్, టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ రంగంలో మరింత అన్వేషించగలుగుతున్నాం"అని నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్ & టెక్నాలజీ కమ్యూనికేషన్ (ఎన్‌సిఎస్‌టిసి)వెబ్‌నార్‌లో ప్రొఫెసర్ శర్మ తెలిపారు. డీఎస్టీ గోల్డెన్ జూబ్లీ డిస్కోర్స్ సిరీస్‌లో భాగంగా "అన్ ది అదర్ సైడ్ ఆఫ్ పాండమిక్" అనే ఆంశంపై విజ్ఞన్ ప్రసార్ నిర్వహించారు.
ఈ సందర్భంగా భారత ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు (సిఇఎ) డాక్టర్ కృష్ణమూర్తి సుబ్రమణియన్ మాట్లాడుతూ.. దేశ నిర్మాణంలో మరియు ఆర్థిక పురోగతిలో సైన్స్ అండ్ టెక్నాలజీ పాత్ర మరియు శరవేగంగా మారుతున్న ప్రస్తుత ప్రపంచంలో ముందుకు వెళ్ళే మార్గంపై చర్చించారు.
దేశ నిర్మాణంలో డిఎస్‌టి పాత్రను ఆయన అభినందిస్తూ.." దేశ ఆర్థిక వృద్ధిలో ఇన్నోవేషన్ చాలా ముఖ్యమైన అంశం. మేము ఇప్పటివరకు చాలా కృషి చేశాం. అయితే రాబోయే 50 ఏళ్ళ అవసరాల కోణంలో పరిశీలిస్తే.. సైన్స్, టెక్నాలజీ మరియు ఆవిష్కరణలు చాలా విస్తృతమైన ప్రాధాన్యతను కలిగి ఉన్నాయి. కార్పొరేట్లు, విధాన రూపకర్తలు మరియు సంస్థలు ఆ అవసరాన్ని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. దేశ సమస్యల నివారణతో పాటు ఆర్థిక వృద్ధి మరియు శ్రేయస్సు కోసం పరిశోధనలను కొనసాగించారు. అన్వేషణాత్మక ఆవిష్కరణల్లో అపజయాలు, వైఫల్యాలు ఎదురుకావొచ్చు. అయితే విజయం సాధించాలంటై వైఫల్యాలను ఎదుర్కొనక తప్పదని'' చెప్పారు.
కొన్ని యూరోపియన్, ఇతర దేశాల్లో రెండో దశలో కొరోనా మహమ్మారి తీవ్ర పరిణామాలను చూపుతోంది. అందువల్ల కరోనా సెకండ్‌వేవ్‌పట్ల మనం అప్రమత్తతో వ్యవహరించాలని సూచించారు. మాస్క్‌ను ధరించడంతో పాటు శానిటైజర్లను ఉపయోగించడం, తరచూ చేతులు కడుక్కోవడం, రద్దీ ప్రదేశాలకు దూరంగా ఉండడం,సామాజిక దూరాన్ని పాటించడం వంటి కొవిడ్ మార్గదర్శకాలను ఖచ్చితంగా అనుసరించాలని చెప్పారు.
***
(Release ID: 1671527)
Visitor Counter : 204