ప్రధాన మంత్రి కార్యాలయం

న‌వంబ‌ర్ 9న వార‌ణాశిలో ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు శంకుస్థాప‌న‌, ప్రారంభోత్స‌వాలు చేయ‌నున్న ప్ర‌ధానమంత్రి శ్రీ‌న‌రేంద్ర‌మోదీ.

Posted On: 07 NOV 2020 6:46PM by PIB Hyderabad

 

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ న‌వంబ‌ర్ 9 వ‌తేదీ ఉద‌యం 10.30 గంట‌ల‌కు వీడియో కాన్ఫ‌రెన్సు ద్వారా వార‌ణాశిలో వివిధ అభివృద్ధి ప‌థ‌కాలకు శంకుస్థాప‌న‌, ప్రారంభోత్స‌వాలు చేయ‌నున్నారు. ఈ ప్రాజెక్టుల మొత్తం విలువ రూ 614 కోట్ల‌రూపాయ‌లు. ప్ర‌ధాన‌మంత్రి ఈ సంద‌ర్భంగా ఈ ప‌థ‌కాల ల‌బ్ధిదారుల‌తో మాట్లాడ‌తారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి కూడా ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొంటారు.

సార‌నాథ్ లైట్‌, సౌండ్ షో, రామ్‌న‌గ‌ర్‌లోని లాల్‌బ‌హ‌దూర్ శాస్త్రి ఆస్ప‌త్రి స్థాయిపెంపు, మురుగునీటిపారుద‌ల వ్య‌వ‌స్థ‌కుసంబంధించిన ప‌నులు, గోవుల సంర‌క్ష‌ణ‌,ప‌రిర‌క్ష‌ణ‌కు సంబంధించిన మౌలిక స‌దుపాయాలు,బ‌హుళ ప్ర‌యోజ‌న‌క‌ర విత్త‌న నిల్వ‌కేంద్రం, 100 మెట్రిక్ ట‌న్నుల వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల గోదాము, ఐపిడిఎస్ రెండోద‌శ‌, సంపూర్ణానంద స్టేడియంలో క్రీడాకారుల‌కు గృహ‌నిర్మాణ కాంప్లెక్సు, వార‌ణాశి స్మార్ట్ లైటింగ్ వ‌ర్క్‌, దీనితోపాటు 105 అంగ‌న్‌వాడీ కేంద్రాలు, 102 గో ఆశ్ర‌య కేంద్రాల ప్రాజెక్టు వంటివి ప్ర‌ధాని ప్రారంభించ‌నున్న వాటిలో ఉన్నాయి.
 అలాగే ప్ర‌ధాన‌మంత్రి ద‌శాశ్వ‌మేథ ఘాట్ పున‌ర్భివృద్ధికి,ఖిడ్కియా ఘాట్‌,పిఎసి పోలిస్ ఫోర్స్ బ్యార‌క్‌ల‌కు, కాశీలోని కొన్ని వార్డుల పున‌ర్ అభివృద్ధి కార్యాక్ర‌మాల‌కు, పార్కింగ్‌స‌దుపాయాల‌కు, బేణియా బాగ్ పార్క్ పున‌ర్ అభివృద్ది ప‌నుల‌కు, గిరిజాదేవి సాంస్కృతిక్‌సంకుల్ బ‌హుళార్థ సాధ‌క హాలుకు,న‌గ‌రంలోని ప‌లురోడ్డు ప‌నులు, ప‌ర్యాట‌క ప్రాంతాల అభివృద్ధి ప‌నుల‌కు ప్ర‌ధాన‌మంత్రి వ‌ర్చువ‌ల్ విధానంలో శంకుస్థాప‌న చేయ‌నున్నారు.

***


(Release ID: 1671086) Visitor Counter : 144