సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
ముగ్గురు సమాచార కమిషనర్ల చేత నేడు ప్రమాణ స్వీకారం
प्रविष्टि तिथि:
07 NOV 2020 2:34PM by PIB Hyderabad
కేంద్ర సమాచార కమిషనర్ వై. కె. సిన్హా ముగ్గురు సమాచార కమిషనర్ల చేత శనివారం ప్రమాణ స్వీకారం చేయించారు. కేంద్ర సమాచార కమిషన్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముగ్గురు సమాచార కమిషనర్లు హీరాలాల్ సమారియా, సరోజ్ పున్హాని, ఉదయ్ మహూర్కర్ ప్రమాణం చేశారు. వీరి నియామకంతో కేంద్ర సమాచార కమిషన్లో ప్రధాన సమాచర కమిషనర్ సహా మొత్తం సమాచార కమిషనర్ల సంఖ్య 8కి చేరింది.
మాజీ ఐఎఎస్ అధికారి అయిన హీరాలాల్ సమారియా పదవీవిరమణకు ముందు కేంద్ర శ్రామిక, ఉపాధి శాఖ కార్యదర్శిగా ఉన్నారు. ఆయనకు సివిల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉంది. ఆయన పాలన, ప్రభుత్వ విధాన వ్యవహారాలలో నిపుణులు.

కేంద్ర సమాచార కమిషన్‌లో సమాచార కమిషనర్‌గా నియమితులైన సరోజ్ పున్హాని ఐఎ&ఎస్ అధికారి అతకు ముందు భారత ప్రభుత్వంలో డిప్యూటీ కంప్ట్రోలర్, ఆడిటర్ జనరల్ (హెచ్ ఆర్ & ట్రైనింగ్)గా పని చేశారు. ఆమెకు హ్యుమానిటీస్ లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉంది. ఆమె పాలన, ప్రభుత్వ విధాన వ్యవహారాలలో నిపుణురాలు.

కేంద్ర సమాచార కమిషన్‌లో చేరక ముందు ఉదయ్ మహూర్కర్ ఒక ప్రముఖ మీడియా సంస్థలో సీనియర్ డిప్యూటీ ఎడిటర్‌గా పని చేశారు. ఆయన మహారాజ సాయాజీరావ్ యూనివర్సిటీ నుంచి భారతీయ చరిత్ర, సంస్కృతి, పురాతత్వ శాస్త్రంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆయన నైపుణ్యం మీడియా వ్యవహారాలలో అనుభవం.

***
(रिलीज़ आईडी: 1670951)
आगंतुक पटल : 322