పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ

ప్రైవేట్ రంగంలో పర్యావరణ మార్పు గురించి కూడా ప్రకటించడం చరిత్రాత్మకం: శ్రీ ప్రకాష్ జవదేకర్

వాతావరణ మార్పులపై భారత సిఇఓ ఫోరం ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాల మధ్య దీర్ఘకాలిక మరియు స్థిరమైన భాగస్వామ్యాన్ని ఏర్పరుస్తుంది.

Posted On: 05 NOV 2020 4:22PM by PIB Hyderabad

పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రి శ్రీ ప్రకాష్ జవదేకర్ మాట్లాడుతూ, పారిస్ ఒప్పందంలో భారతదేశం తన లక్ష్యాలను సాధించే దిశగా ముందుకు సాగుతోందని, దేశం దాని జాతీయంగా నిర్ణయించిన సహకారాల(ఎన్‌డిసి) పై పనిచేస్తోందని అన్నారు. వాతావరణ మార్పులపై పోరాడటంలో, ప్రభుత్వ స్థాయిలోనే కాకుండా, ప్రైవేట్ స్థాయిలో కూడా, నిబద్ధతను చూపిస్తుంది మరియు పరిష్కరిస్తుందని తెలిపారు. వర్చువల్ ఇండియా సీఈఓ ఫోరం ఆన్ క్లైమేట్ చేంజ్‌లో 24 మంది ముఖ్య పరిశ్రమల దిగ్గజాలు, పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ సంతకం చేసిన వాతావరణ మార్పుపై డిక్లరేషన్ విడుదల చేసిన శ్రీ జవదేకర్, ప్రైవేటు రంగ సంస్థల ఈ ప్రకటన (రీడ్) స్వచ్ఛందమైనది, చారిత్రాత్మక మైనది అని అభివర్ణించారు. 

"ప్రపంచం చాలా విషయాలు చెబుతుంది మరియు బోధిస్తుంది కాని ఆచరణలోకి తీసుకురావడం చాలా కష్టమైన విషయం. ఈ రోజు ఐక్యరాజ్యసమితి పర్యావరణ వ్యవస్థ మరియు యుఎన్‌ఎఫ్‌సిసి తమ సొంత కార్బన్ తటస్థత  ప్రణాళికలను పాటించటానికి, ప్రకటించడానికి భారతదేశం మరియు దాని కార్పొరేట్ ప్రపంచం ఈ ప్రయత్నాన్ని గమనిస్తాయని నేను భావిస్తున్నాను. ”, అని శ్రీ జవదేకర్ అన్నారు

ఫోరంను ఉద్దేశించి శ్రీ జవదేకర్ కార్పొరేట్ ప్రపంచానికి డికార్బొనైజేషన్ కోసం వారు ఏ చర్యలు మరియు చొరవ తీసుకుంటున్నారో ప్రచారం చేయాలని సూచించారు. 

ఈ కార్యక్రమంలో సీఈఓలు, టాటా, రిలయన్స్, అదానీ గ్రూప్, మహీంద్రా, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ వంటి ముఖ్య పరిశ్రమల అధిపతులు వారు తీసుకున్న వివిధ స్వచ్ఛమైన ప్రక్రియలు  కార్యక్రమాలు,  2020 తరువాత మరింత డీకార్బోనైజేషన్ వైపు వారి ఎజెండాను రూపొందించారు.వాతావరణ మార్పులపై కార్పొరేట్ రంగం చూపించిన విశ్వాసంతో  ప్రభుత్వం, ప్రైవేటు రంగం సమన్వయం ఏర్పడింది. ఇది దేశ ప్రయోజనాలను పరిరక్షించడంలో సహాయపడుతుంది, 

పారిస్ ఒప్పందం ప్రకారం వాతావరణ మార్పుల బాధ్యతలను నెరవేర్చడానికి భారతదేశం సరైన గమనంలో ఉందని నిర్ధారించడానికి సహాయపడుతుంది.

తక్కువ కార్బన్ స్థిరమైన ఆర్థిక వ్యవస్థలను సృష్టించడంలో ప్రైవేట్ రంగం కీలక పాత్ర పోషిస్తుంది, వాతావరణ మార్పులపై అనేక స్వచ్ఛంద చర్యలను ప్రారంభించింది, ఇది భారతదేశం ఎన్డిసి లక్ష్యాలను సాధించడంలో దోహదపడుతుంది. క్యోటో ప్రోటోకాల్ క్లీన్ డెవలప్మెంట్ మెకానిజంలో భారతదేశం పాల్గొనడం మరియు పారిస్ ఒప్పందం ఆర్టికల్ 6 కు వెళ్లడం ద్వారా ప్రైవేటు రంగం కూడా ప్రయోజనం పొందింది, వాతావరణ మార్పు మరియు స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడానికి మరిన్ని అవకాశాలను అందిస్తుంది

పూర్తి కార్యక్రమం వీక్షించడానికి ఇక్కడ క్లిక్ చేయండి..... HERE

 

***(Release ID: 1670642) Visitor Counter : 178