సాంస్కృతిక మంత్రిత్వ శాఖ

“మ్యూజియంలు, ఆర్ట్ గ్యాలరీలు మరియు ఎగ్జిబిషన్లను తిరిగి తెరవడం కోసం” ఎస్.ఓ.పి. లను జారీ చేసిన - కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ

ఎస్.ఓ.పి. ల ప్రకారం మ్యూజియంలు, ఆర్ట్ గ్యాలరీలు మరియు ఎగ్జిబిషన్లు 2020 నవంబర్ 10వ తేదీ నుండి తిరిగి తెరవడానికి అనుమతిస్తారు

Posted On: 05 NOV 2020 4:39PM by PIB Hyderabad

హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన అన్ ‌లాక్-5.0 మార్గదర్శకాల ఆధారంగా మరియు సాంస్కృతిక, సృజనాత్మక పరిశ్రమల్లోని వివిధ భాగస్వాముల నుండి వచ్చిన సలహాలను పరిగణనలోకి తీసుకున్న అనంతరం, 

“మ్యూజియంలు, ఆర్ట్ గ్యాలరీలు మరియు ఎగ్జిబిషన్లను తిరిగి తెరవడం కోసం” సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఇప్పుడు వివరణాత్మక ఎస్.ఓ.పి. లను జారీ చేసింది. 

 

ఈ మార్గదర్శకాలలో మ్యూజియంలు, ఆర్ట్ గ్యాలరీలు మరియు ఎగ్జిబిషన్ల (తాత్కాలిక మరియు శాశ్వత) నిర్వహణతో పాటు ఈ ప్రదేశాలకు సందర్శకులు అనుసరించాల్సిన ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలు ఉన్నాయి.  తగిన విధంగా శుభ్రపరచడం, టిక్కెట్ల కొనుగోలుతో పాటు, మ్యూజియంలు, ఎగ్జిబిషన్లు, ఆర్ట్ గ్యాలరీలలో సందర్శకులు మరియు సిబ్బంది భద్రతను నిర్ధారించడానికి సమగ్ర మార్గదర్శకాలను జారీ చేయడం జరిగింది.   

 

కంటైన్మెంట్ జోన్ల లోపల మ్యూజియంలు మరియు / లేదా ఆర్ట్ గ్యాలరీలను  తిరిగి తెరవకూడదని స్పష్టం చేశారు. ఇంకా, రాష్ట్ర / కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వాలు తమ క్షేత్ర స్థాయి అంచనా ప్రకారం ప్రతిపాదించే అదనపు చర్యలను కూడా పరిగణించవచ్చు. 

 

కోవిడ్-19 నిర్వహణ కోసం జాతీయ ఆదేశాలతో పాటు, దేశీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు మొదలైనవి జారీ చేసిన సంబంధిత మార్గదర్శకాలను,  అన్ని కార్యకలాపాలు మరియు కార్యక్రమాల సమయంలో ఖచ్చితంగా పాటించాలి. 

 

ఈ మార్గదర్శకాలు వెంటనే అమలులోకి వస్తాయి మరియు తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అమలులో ఉంటాయి.  సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పరిధిలోని మ్యూజియంలు, ఎగ్జిబిషన్లు మరియు ఆర్ట్ గ్యాలరీలు 2020 నవంబర్, 10వ తేదీ నుండి తిరిగి తెరవబడతాయి.  కాగా ఇతరులు, తమ సౌలభ్యం ప్రకారం, అదేవిధంగా, సంబంధిత రాష్ట్ర / నగరం / స్థానిక చట్టాలు, నియమాలు మరియు నిబంధనలతో పాటు అన్ ‌లాక్ మార్గదర్శకాలకు అనుగుణంగా తిరిగి ప్రారంభించవచ్చు. 

 

కోవిడ్-19 వ్యాప్తిని నిరోధించే నివారణ చర్యలపై “మ్యూజియంలు, ఆర్ట్ గ్యాలరీలు మరియు ఎగ్జిబిషన్లను తిరిగి తెరవడం కోసం" జారీ చేసిన ఎస్.ఓ.పి. ల కోసం దయచేసి ఇక్కడ క్లిక్ చేయండి.

కోవిడ్-19 మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా మ్యూజియం మరియు కళా రంగాలను ప్రభావితం చేసింది.  అయితే, మ్యూజియంలు, ఆర్ట్ గ్యాలరీలు నెమ్మదిగా తమ కార్యకలాపాలను తిరిగి ప్రారంభిస్తూ, తమ ప్రాంగణాలను తిరిగి తెరుస్తూ ఉండడంతో, కోవిడ్-19 వ్యాప్తిని నివారించడానికి, సందర్శకులు మరియు సిబ్బంది భద్రతను నిర్ధారించడానికి, సమగ్ర మార్గదర్శకాలను రూపొందించవలసిన అవసరం ఎంతైనా ఉంది. 

 

సాంస్కృతిక మంత్రిత్వ శాఖ యొక్క పరిపాలనా నియంత్రణలో ఉన్న అన్ని మ్యూజియంలు, ఆర్ట్ గ్యాలరీలు 2020 మార్చి 17వ తేదీ నాటి ఆదేశాలతో ఆరోజు నుండి మూసివేయడం జరిగింది.  ఇప్పుడు పండుగ సీజన్ కొనసాగుతున్నందున, 2020 నవంబర్, 10వ తేదీ నుండి అన్ని మ్యూజియంలు, ఆర్ట్ గ్యాలరీలు,  ప్రదర్శనలను తిరిగి తెరవాలని నిర్ణయించడం జరిగింది. తద్వారా భారతదేశం యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని అన్వేషించడం ద్వారా ప్రజలు ఆనందించవచ్చు.

 

సంబంధిత నగరాలు / రాష్ట్రాల్లోని కంటైన్మెంట్ జోన్ల నోటిఫికేషన్ ‌కు లోబడి, అన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ఇతర సంస్థలకు వర్తించే విధంగా, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు అన్ లాక్ మార్గదర్శకాలను జారీ చేసింది.    సామాజిక / విద్యా / క్రీడలు / వినోదం / సాంస్కృతిక మరియు మతపరమైన కార్యక్రమాలు మరియు ఇతర సమ్మేళనాలను 2020 సెప్టెంబర్ 21 నుండి అమలులోకి వచ్చే విధంగా కంటైన్మెంట్ జోన్ల వెలుపల 100 మంది వ్యక్తుల పరిమితితో, 2020 ఆగష్టు 30వ తేదీ నాటి అన్ ‌లాక్ 4.0 మార్గదర్శకాలు, సామాజిక దూరం, పరిశుభ్రత వంటి కోవిడ్-19 నిబంధనలతో,  అనుమతించాయి. 

 

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ 2020 సెప్టెంబర్ 30వ తేదీన జారీ చేసి2020 నవంబర్ 30వ తేదీ వరకు పొడిగించిన, అన్ లాక్ 5.0 మార్గదర్శకాలు ప్రస్తుతం అమలులో ఉన్నాయి.  ఈ మార్గదర్శకాలలో, సాంస్కృతిక సంస్థలకు సంబంధించిన భాగాలను ఈ దిగువ తిరిగి పొందుపరచడం జరిగింది. 

 

(iv)     2020 అక్టోబర్ 15వ తేదీ నుండి సినిమా హాళ్ళు / రంగస్థల థియేటర్లు / మల్టీప్లెక్సులు వారి సీటింగ్ సామర్థ్యంలో 50 శాతం వరకు, కంటైన్మెంట్ జోన్ల వెలుపల ఉన్న ప్రాంతాలలో మాత్రమే తెరవడానికి అనుమతించబడతాయి. దీని కోసం, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ తగిన ఎస్.ఓ.పి.లను జారీ చేస్తుంది.

(v)     2020 అక్టోబర్, 15వ తేదీ నుండి వినోదాత్మక పార్కులు మరియు అటువంటి ప్రదేశాలు తెరవడానికి అనుమతించబడతాయి. దీని కోసం, తగిన ఎస్.ఓ.పి. లను  ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (ఎమ్.ఓ.హెచ్.ఎఫ్.డబ్ల్యూ ) జారీ చేస్తుంది.

(vi)     2020 అక్టోబర్ 15వ తేదీ నుండి బిజినెస్ టు బిజినెస్ (బి 2 బి) ఎగ్జిబిషన్లు కంటైన్మెంట్ జోన్ల వెలుపల ఉన్న ప్రాంతాలలో మాత్రమే తెరవడానికి అనుమతించబడతాయి. దీని కోసం తగిన ఎస్.ఓ.పి. లను, వాణిజ్య శాఖ జారీ చేస్తుంది.

(vii)      సామాజిక / విద్యా / క్రీడలు / వినోదం / సాంస్కృతిక / మత / రాజకీయ కార్యక్రమాలు, ఇతర సమ్మేళనాలు 100 మంది వ్యక్తుల గరిష్ట పరిమితితో  ఇప్పటికే,  కంటైన్మెంట్ జోన్ల వెలుపల మాత్రమే, అనుమతించబడ్డాయి.  అయితే, 100 మంది వ్యక్తుల పరిమితికి మించిన ఇటువంటి సమావేశాలను, 2020 అక్టోబర్, 15వ తేదీ తర్వాత రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు, ఈ క్రింది షరతులకు లోబడి కంటైన్మెంట్ జోన్ల వెలుపల అనుమతించవచ్చు: 

ఏ).     మూసి ఉంచిన ప్రదేశాలలో, హాల్ సామర్థ్యంలో గరిష్టంగా 50 శాతం  లేదా గరిష్టంగా 200 మంది వ్యక్తుల పరిమితికి లోబడి అనుమతించబడుతుంది.  ఫేస్ మాస్కులు ధరించడం, సామాజిక దూరాన్ని పాటించడంతో పాటు, థర్మల్ స్కానింగ్ మరియు హ్యాండ్‌ వాష్ లేదా శానిటైజర్ వాడకం తప్పనిసరిగా ఉండాలి.

బి).     బహిరంగ ప్రదేశాల్లో, స్థలం / భూమి యొక్క పరిమాణాన్ని దృష్టిలో ఉంచుకుని, సామాజిక దూరాన్ని తప్పనిసరిగా పాటించాలి, ఫేస్ మాస్కులు తప్పనిసరిగా ధరించాలి, థర్మల్ స్కానింగ్ మరియు హ్యాండ్ వాష్ లేదా శానిటైజర్ సౌకర్యాలు ఉండాలి. 

అటువంటి సమావేశాలను క్రమబద్ధీకరించడానికి మరియు ఖచ్చితంగా అమలు చేయడానికి  సంబంధిత  రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు వివరణాత్మక ఎస్.ఓ.పి.. లను జారీ చేస్తాయి. ”

 

*****


(Release ID: 1670494) Visitor Counter : 262