రక్షణ మంత్రిత్వ శాఖ
డైమండ్ జూబ్లీ జరుపుకున్న నేషనల్ డిఫెన్స్ కాలేజ్
ఇండియాస్ నేషనల్ సెక్యూరిటీ 'ఎ డికేడ్ ఎహెడ్' పేరుతో రెండు రోజుల వెబ్‌నార్ నిర్వహణ
మిత్రదేశాలకు మరిన్ని ఎక్కువ సీట్లు కేటాయించనున్న ఎన్‌డిసి
Posted On:
04 NOV 2020 2:32PM by PIB Hyderabad
డైమండ్ జూబ్లీ వేడుకల్లో భాగంగా 'ఇండియాస్ నేషనల్ సెక్యూరిటీ- ఎ డికేడ్ ఎహెడ్' అనే థీమ్‌తో నేషనల్ డిఫెన్స్ కాలేజ్ (ఎన్‌డిసి) రెండు రోజుల వెబ్‌నార్‌ను ఈ నెల ఐదు, ఆరు తేదీల్లో నిర్వహించనుంది. ఈ రోజు న్యూ ఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో రక్షణ కార్యదర్శి డాక్టర్ అజయ్ కుమార్ మరియు ఎన్డిసి కమాండెంట్ ఎయిర్ మార్షల్ డి.చౌదరి ఈ విషయాన్ని ప్రకటించారు.
సాయుధ దళాలతో పాటు మనదేశంలో ఎంపిక చేసిన సివిల్ సర్వీసెస్ సీనియర్ అధికారులకు, ఇతర దేశ అధికారులకు శిక్షణనిస్తున్న ఎన్‌డీసీ ప్రపంచంలోనే అత్యుత్తమ వ్యూహాత్మక శిక్షణా కేంద్రాలలో ఒకటని డాక్టర్ అజయ్ కుమార్ ఈ సందర్భంగా చెప్పారు. మొదటి ఎన్‌డిసి కోర్సు 21 మందితో 1960లో ప్రారంభమయిందని గుర్తు చేశారు. డైమండ్ జూబ్లీ సంవత్సరంలో ఎన్‌డిసిలో వందమంది పాల్గొంటున్నారని..వారిలో మనదేశానికి చెందినవారు 75 మంది కాగా మిత్ర దేశాల నుండి మరో 25 మంది ఉన్నారని చెప్పారు. సాయుధ దళాలు మరియు సివిల్ సర్వీసెస్ రెండింటిలోనూ అత్యుత్తమ శిక్షణను అందించేందుకు ఇది అత్యుత్తమ శిక్షణ కార్యక్రమం అని వెల్లడించారు. ఎన్‌డిసి కార్యక్రమంలో చాలా మంది పూర్వ విద్యార్థులు ఉన్నారు. ఎన్డిసీ పూర్వ విద్యార్దుల్లో ఇద్దరు గవర్నర్లు, ప్రస్తుత జాతీయ భద్రతా సలహాదారు, ఇద్దరు ఎన్నికల కమిషనర్లు, 30 మంది సివిల్ సర్వీసెస్ ప్రముఖులు, 74 విదేశాంగశాఖ అధికారులు, 20 మందికి పైగా రాయబారులు, నలుగురు రక్షణ కార్యదర్శులు, ఐదుగురు విదేశాంగ కార్యదర్శులు ఉన్నారు.
కొంతమంది విదేశీ పూర్వ విద్యార్థులు కూడా తమ దేశాలలో ముఖ్యమైన స్థానాలు సాధించారు. విదేశీ సాయుధ దళాల్లో 74 మంది ఉన్నత స్థానాల్లో ఉన్నారు. వారిలో కొందరు ప్రముఖులు:
1. హిజ్ మెజెస్టి జిగ్మే ఖేసర్ నామ్‌గైల్ వాంగ్‌చక్, భూటాన్ రాజు
2. లెఫ్టినెంట్ జనరల్ హుస్సేన్ ముహమ్మద్ ఎర్షాద్, బంగ్లాదేశ్ మాజీ అధ్యక్షుడు
3. లెఫ్టినెంట్ జనరల్ ఫ్రెడ్రిక్ విలియం క్వాసి అకుఫో, ఘనా మాజీ రాష్ట్ర అధిపతి
''ఇండియాస్ నేషనల్ సెక్యూరిటీ- ది డికేడ్ అహెడ్'థీమ్‌తో జరగనున్న రెండు రోజుల వెబ్‌నార్ గౌరవ రక్షణ మంత్రి శ్రీ రాజనాథ్ సింగ్ ముఖ్య ఉపన్యాసంతో రేపు ప్రారంభమవుతుంది. ఈ సదస్సు వక్తల్లో ఉన్న కొంతమంది ప్రముఖులు:
మిస్టర్ పీటర్ వర్గీస్, ఛాన్సలర్ క్వీన్స్‌లాండ్ విశ్వవిద్యాలయం
మిస్టర్ సి రాజమోహన్, డైరెక్టర్, సౌత్ ఏషియన్ యూనివర్శిటీ
-చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్
-విదేశాంగ కార్యదర్శి
-చీఫ్స్ ఆఫ్ ది ఆర్మ్‌డ్ ఫోర్సెస్
-మిస్టర్ రుద్ర చౌదరి, డైరెక్టర్, కార్నెగీ ఇండియా
-డాక్టర్ షమికా రవి, బ్రూకింగ్స్ ఇండియా
రక్షణ కార్యదర్శి డాక్టర్ అజయ్ కుమార్ మాట్లాడుతూ..ప్రపంచంలో ఈ తరహా కార్యక్రమాల్లో ఎన్‌డిసికి ఎక్కువ ఆదరణ ఉందని పేర్కొన్నారు. ఎన్‌డిసిలో సీట్ల కోసం ఇతర దేశాల నుండి కూడా వస్తున్న డిమాండ్‌ను దృష్టిపెట్టుకుని 2021 నాటికి ఎన్‌డిసి సామర్థ్యాన్ని 100 నుండి 110కి, 2022 నాటికి 120 పెంచాలని రక్షణశాఖ నిర్ణయించినట్టు తెలిపారు. దాంతో డిమాండ్ ఎక్కువగా ఉన్న మిత్రదేశాలకు ఎక్కువ సీట్లను అందించే అవకాశం లభిస్తుందని చెప్పారు. ఆ మేరకు మౌలిక సదుపాయాలను కల్పిస్తామని వివరించారు. ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్ ఫిలిపైన్స్, ఇండోనేషియా మరియు మాల్దీవులతో పాటు నేపాల్, మయన్మార్, బంగ్లాదేశ్ లకు అదనపు సీట్లు ఇవ్వబోతున్నామని వెల్లడించారు.
డైమండ్ జూబ్లీ సంవత్సరాన్ని పురస్కరించుకుని ఎన్.డి.సిలో జాతీయ భద్రత మరియు వ్యూహంపై ప్రెసిడెంట్స్ చైర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేయడానికి భారత రాష్ట్రపతి అంగీకరించినట్టు తెలిపారు. ఇది ఎన్డిసిలో 2021 నుండి పనిచేస్తుందన్నారు. ఈ సందర్భంగా ఎన్డిసిపై 'ఎన్డీసి- అబోడ్ ఆఫ్ స్ట్రాటజిక్ ఎక్సలెన్స్' అనే ఈ-బుక్‌ను భారత రక్షణమంత్రి విడుదల చేశారు.
ఎన్డీసి కమాండెంట్, ఎయిర్ మార్షల్ డి.చౌదరి మాట్లాడుతూ..కొవిడ్-19 పరిమితులు ఉన్నప్పటికీ మార్చి 2020 నుండి ఎన్డీసి తన కార్యక్రమాన్ని ఆన్‌లైన్‌లో కొనసాగించిందని.. దాంతో పాఠ్యాంశాలన్నీ పూర్తయ్యాయని వివరించారు.
***
(Release ID: 1670238)
Visitor Counter : 124