గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
పరిసరాల అభివృద్ధి, జీవనస్థితిగతుల మెరుగుదల , పిల్లలు వారి కుటుంబాల జీవన ప్రమాణాల మెరుగుదలకు పట్టణాలకు సహకారం
సమాచార సంస్కృతీ రూపకల్పనకు డి ఎం ఎ సైకిల్-2 స్థానిక సంస్థలలో సమాచార
ఆధారిత
నిర్ణయాలను తీసుకోవడానికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను ప్రారంభించిన శ్రీ హారదీప్ ఎస్ పూరీ
:హైదరాబాద్ నవంబర్ 4:
పట్టణ ప్రాంతాలలో ప్రజల జీవన స్థితిగతులను మెరుగు పరచాలన్న లక్ష్యంతో రూపొందించిన మూడు కార్యక్రమాలను కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ (స్వతంత్ర) మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరీ ఈ రోజు ప్రారంభించారు. పిల్లల భవిషత్ ను దృష్టిలో ఉంచుకుని పట్టణ ప్రాంతాల పరిసర ప్రాంతాల అభివృద్ధి, పట్టణాలలో పర్యావరణ
प्रविष्टि तिथि:
04 NOV 2020 4:25PM by PIB Hyderabad
అంశాలను శాస్త్రీయంగా మదింపు వేయడం మరియు స్మార్ట్ సిటీలుగా ఎంపిక చేసిన 100 నగరాల్లో సిటీ డాటా ఆఫీసర్లకు (CDO) ఆన్ లైన్ లో శిక్షణా కార్యక్రమాలను నిర్వహించడానికి కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ ఈ కార్యక్రమాలను రూపొందించింది.
పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేసి పిల్లలు వారి సంరక్షకులు మరియు కుటుంబాలకు పట్టణ వాతావరణంలో సౌకర్యాలను కల్పించడానికి ఉద్దేశించిన పధకం మూడు సంవత్సరాల పాటు అమలు జరుగుతుంది. దేశానికి చెందిన WRI సంస్థ అందించే సాంకేతిక సహకారంతో నెథర్లాండ్స్ కి చెందిన బెర్నార్డ్ వాన్ లీర్ ఫౌండేషన్ దీనిని అమలు చేస్తుంది. ఈ పధకం కింద పిల్లల కోసం పార్కులను పునఃనిర్మించడం , బహిరంగ ప్రదేశాలను అభివృద్ధి చేయడం, బహిరంగ ప్రదేశాలను దత్తత తీసుకోవడం లాంటి కార్యక్రమాలను అమలు చేయడానికి నగరాలకు సాంకేతిక సహకారం మరియు సహాయం అందించడం జరుగుతుంది. పిల్లలు వారి కుటుంబ సభ్యులు ప్రమాదాలకు గురికాకుండా సురక్షితంగా ఉండే నడక మార్గాలను అభివృద్ధి చేయడం జరుగుతుంది. స్మార్ట్ సిటీలు, అయిదు లక్షలకు మించి జనాభా కలిగి ఉన్న నగరాలు, రాష్ట్రాల రాజధానులు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో అమలు చేస్తారు.
' పట్టణ ప్రాంతాల పర్యావరణం చిన్న పిల్లలు ముఖ్యంగా అయిదు సంవత్సరాల లోపు వయస్సు ఉన్న పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఒక పిల్లవాడి 1000 రోజుల వయస్సులో పది లక్షలకు పైగా నాడీ మండల వ్యవస్థలు ప్రతి సెకండ్ లో అభివృద్ధి చెందుతాయి. పిల్లలు మరియు వారి కుటుంబ సభ్యుల ప్రాథమిక ఆరోగ్య పరిరక్షణ ద్వారా పిల్లలు మరింత చురుగ్గా పెరగడానికి అవకాశం కలుగుతుంది. రానున్న కాలంలో భారత దేశ నగరాలు సామాజికంగా ఆర్ధికంగా అభివృద్ధి చెందడానికి ఈ పథకం ఉపయోగపడుతుంది.'
' ప్రస్తుతం సరైన రవాణా సౌకర్యాలు, ఆహారం అందుబాటులో లేకపోవడంతో పాటు ఆరోగ్య సమస్యలవల్ల పిల్లలు బాల్యానికి దూరం అవుతున్నారు. పట్టణ ప్రాంతాల అభివృద్ధికి సక్రమమైన ప్రణాళికలు రూపొందించి అమలు చేయడం ద్వారా ఈ సమస్యలను పరిష్కరించి పిల్లలు తమ జీవితాన్ని సరైన మార్గంలో ప్రారంభించడానికి అవకాశం కలుగుతుంది. దీనికోసం సురక్షితమైన నడక మార్గాలను అభివృద్ధి చేయడం, పిల్లలకు అవసరమైన అన్ని వస్తువులను నడుచుకుంటూ వెళ్లి 15 నిమిషాలలో పొందడం లాంటి సౌకర్యాలను కల్పించడంతో పాటు , పిల్లలు ప్రమాదం లేకుండా నడవడానికి, ఇదే సమయంలో వారి తల్లితండ్రులు సేద తీరడానికి సౌకర్యాలను కల్పించడంతో పాటు పిల్లలతో కలసి వారి కుటుంబ సభ్యులు ప్రయాణించడానికి అందుబాటులో సురక్షిత రవాణా సౌకర్యాలను అందుబాటులోకి తీసుకుని వచ్చి వాయు శబ్ద కాలుష్యంలేని ఆరోగ్యకరమైన వాతావరణాన్నిరూపొందించి ప్రతి కుటుంబ శ్రేయస్సుకు ఈ పథకం ప్రాధాన్యతను ఇస్తుంది' ..... కేంధ్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ సహాయ (స్వతంత్ర) మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరీ
' అన్ని వర్గాలకు చెందిన ప్రజలకు అవసరమైన సౌకర్యాలను కల్పించడానికి సమాజంలో అత్యంత ముఖ్యమైన వర్గాలకు అవసరమైన అవసరాలను గుర్తించవలసి ఉంటుంది . నగరాల ప్రణాళికల్లో చిన్న పిల్లల అవసరాలను గుర్తించినప్పుడు నగరాలను సమగ్రంగా అభివృద్ధి చేయడానికి అవకాశం కలుగుతుంది'.... కేంధ్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ కార్ర్యదర్శి శ్రీ దుర్గాశంకర్ మిశ్రా .
' నగరాలు సమగ్రంగా అభివృద్ధి చెందడానికి రూపొందించే ప్రణాళికల్లో పిల్లలు, చిన్నపిల్లలు మరియు వారి కుటుంబ సభ్యుల అవసరాలకు స్థానం కల్పించినప్పుడు మాత్రమే ఆశించిన అభివృద్ధి సాధించడానికి వీలవుతుందని మేము నమ్ముతున్నాము . బహిరంగ ప్రదేశాలు , రవాణా మరియు ఇతర సేవలు పిల్లలకు అందుబాటులో వారి ఆరోగ్య స్థితిగతులు మెరుగవుతాయి. పిల్లలకు ఈ సౌకర్యాలు అందుబాటులోకి వస్తే వీటి ప్రయోజనం ప్రతి ఒక్కరికి కలుగుతుంది. ఇటువంటి ముఖ్యమైన కార్యక్రమానికి రూపకల్పన చేసిన కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖకు మేము కృతజ్ఞతలను తెలియచేస్తున్నాం. వరల్డ్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఇండియా మరియు పథకంలో పాల్గొంటున్న నగరాల సహకారం కోసం ఎదురుచూస్తున్నాము '--- రష్దా మజీద్,బెర్నార్డ్ వాన్ లీర్ ఫౌండేషన్, భారత ప్రతినిధి
స్మార్ట్ సిటీస్ మిషన్ పథకంలోని డేటా స్మార్ట్ సిటీస్ కార్యక్రమంకింద రూపొందిన డేటా మెచ్యూరిటీ అసెస్‌మెంట్ ఫ్రేమ్‌వర్క్ కార్యక్రమం కింద నగర స్థాయిలో విధానాల రూప కల్పన ,పరిపాలనా యంత్రాంగం, వ్యవస్థల రూప కల్పన తదితర అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఆవిష్కరణలు, సహకారం, విద్యా పరమైన పరిశోధనా కార్యక్రమాలకు అవసరమైన సమాచారాన్ని, సహకారాన్ని ఈ పథకం కింద అందచేయడం జరుగుతుంది. కేవలం స్మార్ట్ నగరాలు మాత్రమే కాకుండా ఇతర నగరాలకు కూడా ఈ పథకాన్ని వర్తింపుచేయడం జరుగుతుంది.
' దేశ ప్రజలకు ప్రభుత్వ సేవలను అందుబాటులోకి తెచ్చి వాటిని మరింత సమర్ధంగా అమలు చేయడానికి గౌరవ ప్రధానమంత్రి రూపొందించిన డిజిటల్ ఇండియా ప్రధాన లక్ష్యం. దీనిలో సమాచార సేకరణ, డిజిటల్ సాంకేతిక అంశాలు కీలకంగా ఉంటాయి. డేటా మెచ్యూరిటీ అసెస్‌మెంట్ ఫ్రేమ్‌వర్క్ ఈ దిశలో ప్రధాన వనరుగా ఉంటుంది. సమాచారానికి సాంకేతికతను జోడించి ఆచరణ సాధ్యమైన ప్రణాళికలకు రూపకల్పన చేసి వ్యవస్థ పని తీరును మెరుగుపర్చడం జరుగుతుంది.'.... కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ ( స్వతంత్ర ) మంత్రి శ్రీ. హర్దీప్ సింగ్ పూరీ
' పథకాలు, ప్రాజెక్టులు, సేవల రూపకల్పన, అమలు
లాంటి అంశాలలో ప్రపంచ దేశాలు సమాచారం వ్యవస్థపై ఆధారపడుతున్నాయి. సమాచారాన్ని సక్రమంగా ఉపయోగించ గలిగితే ప్రజల జీవన స్థితిగతులను మెరుగుపరచి, అందుబాటులో ఉన్న సౌకర్యాలతో పరిపాలనా కార్యక్రమాలను సాగించ వచ్చును. దీనివల్ల ఫలితాలను సాధించడానికి యంత్రాంగ పనితీరును మెరుగుపరచడానికి అవకాశం కలుగుతుంది. నగరాల్లో సేవలను సరైన విధంగా వినూత్నంగా అందించడానికి సమాచార వ్యవస్థ ఉపయోగపడుతుంది.'.... కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ కార్యదర్శి శ్రీ. దుర్గా శంకర్ మిశ్రా.
సి డీ ఓ శిక్షణా కార్యక్రమంలో టాటా ట్రస్ట్ సహకారంతో కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ ' పట్టణ స్థానిక సంస్థలలో సమాచారం ఆధారంగా నిర్ణయాలను తీసుకోవడం 'అనే అంశంపై ఆరు వారాలపాటు 100 స్మార్ట్ నగరాలకు చెందిన అధికారులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. సమాచార సేకరణ, విశ్లేషణ, భవిషత్ అవసరాలపై సి డి ఓ లకు శిక్షణ ఇచ్చి వారికి సమాచార సేకరణ వినియోగంలో వాస్తవిక శిక్షణ ఇవ్వడం జరుగుతుంది.
'సి డి ఓలు తమ పనితీరును మెరుగుపరచుకుంటూ పరిపాలనలో మార్పులు తీసుకుని వచ్చేలా చూడడానికి అవసరమైన శిక్షణా కార్యక్రమాలను నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దీనివల్ల స్థానిక పట్టణ సంస్థలలో మాత్రమే కాకుండా దేశంలో సమగ్ర డిజిటిల్ యాజమాన్య వ్యవస్థకు పునాది వేయడం జరుగుతుంది.'కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ ( స్వతంత్ర ) మంత్రి శ్రీ. హర్దీప్ సింగ్ పూరీ
' శిక్షణా కార్యక్రమాలను టాటా ట్రస్ట్ రూపకల్పన చేసింది. స్థానిక పట్టణ సంస్థల అధికారులకు సమాచారం ఆధారంగా పనిచేసి వ్యవస్థలు, విద్య, వైద్య రంగాలలో సమాచార వినియోగం ద్వారా పరిపాలనలో సమూల మార్పులు తీసుకుని రాడానికి దోహదపడే విధంగా కార్యక్రమానికి రూపకల్పన చేయడం జరిగింది.' .. కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ కార్యదర్శి శ్రీ. దుర్గా శంకర్ మిశ్రా.
' 2016నుంచి టాటా ట్రస్ట్ సమాచార ఆధారిత పరిపాలన( DDG ) ద్వారా పట్టణ గ్రామీణ ప్రాంతాల స్థానిక సంస్థలకు అవసరమైన సమాచార సేకరణ దాని వినియోగంపై దృష్టి సారించి పనిచేస్తున్నది. ఈ శిక్షణా కార్యక్రమాల ద్వారా వనరులను సమర్ధంగా వినియోగించుకోడానికి సిబ్బందికి శిక్షణ ఇచ్చి స్మార్ట్ నగరాల్లో పరిపాలన సమర్ధంగా, పారదర్శకంగా సాగేలా అవకాశం కలుగుతుంది. '.. డాక్టర్ పూర్ణిమా దొరే, టాటా ట్రస్ట్ డేటా డ్రివెన్ గవర్నెన్స్, అధిపతి.
***
(रिलीज़ आईडी: 1670234)
आगंतुक पटल : 359