రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

సూప‌ర్ ఫాస్పేట్‌, బెంటోనైట్ స‌ల్ఫ‌ర్ అమ్మ‌కాల‌లో గ‌ణ‌నీయ‌మైన పురోగ‌తి సాధించిన ఎన్‌.ఎఫ్‌.ఎల్‌

దేశంలో స‌మ‌తుల ఎరువులకు ప్రోత్సాహం

Posted On: 03 NOV 2020 11:11AM by PIB Hyderabad

నేష‌న‌ల్ ఫ‌ర్టిలైజ‌ర్ లిమిటెడ్ (ఎన్‌.ఎఫ్‌.ఎల్‌) డిఎపి, ఎం.ఒ.పి, ఎన్‌పికె, స‌ల్ఫ‌ర్ ఆధారిత ఎరువుల‌ను రైతులు వాడేవిధంగా ప్రోత్స‌హిస్తున్న‌ది. ఇది యూరియా యేత‌ర ఎరువులు వాడాల్సిందిగా రైతుల‌ను ప్రోత్స‌హిస్తున్న‌ది. ఈ కృషి కార‌ణంగా కంపెనీకి చెందిన యూరియాయేత‌ర ఎరువుల అమ్మ‌కాల‌లో వృద్ధి ప్ర‌స్తుత ఆర్ధిక సంవ‌త్స‌రం తొలిఆరునెల‌ల కాలంలో బాగా వృద్ధిలోకి వ‌చ్చింది

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/IMG-20201102-WA0053GENI.jpg

కంపెనీకి చెందిన స‌ల్ఫ‌ర్ ఆధారిత ఎరువు అమ్మ‌కం- బెంటొనైట్ స‌ల్ఫ‌ర్  గ‌త ఏడాదితో పోలిస్తే 247 శాతం వృద్దిని, సింగిల్ సూప‌ర్ ఫాస్పేట్ (ఎస్ఎస్‌పి) 133 శాతం వృద్ధిని సాధించాయి. బెంటొనైట్ స‌ల్ఫ‌ర్ , ఎన్ఎఫ్ఎల్‌కు చెందిన పానిప‌ట్ ప్లాంట్‌లో త‌యారు కాగా 11,739 మెట్రిక్ ట‌న్నులు 2020 ఏప్రిల్ - అక్టోబ‌ర్ మ‌ధ్య అమ్మ‌కాలు జ‌రిగాయి. గ‌త ఏ డాది ఇదే కాలంలో దీని అమ్మ‌కాలు 3,478 మెట్రిక్ ట‌న్నులు. ఎస్.ఎస్‌.పి అమ్మ‌కాలు 14,726 మెట్రిక్ ట‌న్నుల‌కు చేరుకున్నాయి. గ‌త ఏడాది ఇదే కాలంలో వీటి అమ్మకాలు 6,323 మెట్రిక్ ట‌న్నులు.

భూమికి స‌మ‌తుల పోష‌కాలు అంద‌డానికి అన్ని ర‌కాల ఎరువుల వాడాక‌న్ని ప్రోత్స‌హించ‌డం అవ‌స‌ర‌మ‌ని కంపెనీ సిఎండి శ్రీ వి.ఎన్ . ద‌త్ తెలిపారు. మొక్క ఎదుగుద‌ల‌కు , అధిక‌దిగుబ‌డికి స‌ల్ఫ‌ర్ ఎంతో అవ‌స‌ర‌మ‌ని ఆయ‌న తెలిపారు.నాలుగ‌వ అతి ముఖ్య‌మైన పోష‌కంగా స‌ల్ప‌ర్‌, నైట్రోజ‌న్ ను స‌మ‌ర్ధంగా వాడుకోవ‌డానికి మొక్క‌కు అవ‌స‌ర‌మ‌న్నారు.

ఎన్‌.ఎఫ్‌.ఎల్ సంస్థ యూరియా, డిఎపి, ఎంఒపి, ఎన్‌పికె, ఎ పిఎస్ , కంపోస్ట్‌, ఎస్‌.ఎస్‌.పి, బెంటొనైట్ స‌ల్ఫ‌ర్ , ఎన్నొ ర‌కాల బ‌యో ఫ‌ర్టిలైజ‌ర్ల‌ను త‌యారు చేస్తుంది. రైతుల‌కు ఉపయోగ‌ప‌డే అన్ని ర‌కాల ఎరువుల‌ను ఇది ఒకే గొడుగు కింద అందిస్తుంది.

నైట్రోజ‌న్ (ఎన్‌), ఫాస్ఫ‌ర‌స్ (పి), పొటాష్ (కె), త‌ర్వాత స‌ల్ఫ‌ర్ నాలుగ‌వ ముఖ్య‌మైన పోష‌కం. భార‌తీయ నేల‌ల్లో చాలావ‌ర‌కు స‌ల్ఫ‌ర్ లోపం ఉంది. నూనె గింజ‌లు, ప‌ప్పుదినుసులు, కూర‌గాయ‌లు, చెర‌కు, వ‌రి, పండ్ల‌తోట‌లు వంటి వాటికి ఇది ఎంతో ఉప‌యోగం.

స‌ల్ఫ‌ర్ ను బెంటొనైట్ స‌ల్ఫ‌ర్ , ఎస్‌.ఎస్‌.పి ద్వారా తిరిగి పెంపొందించ‌డానికి వీలు క‌లుగుతుంది.  బెంటొనైట్ స‌ల్ఫ‌ర్ లో 90 శాతం స‌ల్ఫ‌ర్‌, ఉంటుంది. ఎస్‌.ఎస్.పి లో 11 శాతం స‌ల్ఫ‌ర్‌, 16 శాతం పి2ఒ5, 21 శాతం కాల్షియం ఉంటుంది.

***



(Release ID: 1669866) Visitor Counter : 180