రక్షణ మంత్రిత్వ శాఖ
మలబార్ -20
తొలి దశః నవంబర్ 03-06, 2020
ఆఫ్రికా బయిట పర్యటిస్తున్న తొలి దేశం
Posted On:
02 NOV 2020 4:40PM by PIB Hyderabad
మలబార్ (MALABAR) నావికాదళ విన్యాసాల 24వ ఎడిషన్ నవంబర్ 2020లో రెండు దశల్లో జరుగనుంది. తొలి దశలో భారతీయ నావికాదళం (ఐఎన్), యునైటెడ్ స్టేట్స్ నావికాదళం (యుఎస్ ఎన్), జపాన్ నావికాదళ ఆత్మరక్షణ దళం (Japan Maritime Self Defence Force (JMSDF) ), రాయల్ ఆ్రస్టేలియన్ నావికాదళం (ఆర్ ఎఎన్)లు మలబార్ 20 విన్యాసాలలో పాల్గొననున్నాయి. ఈ విన్యాసాలు నవంబర్ 03-06వరకు బంగాళఖాతంలో విశాఖపట్నంలో ప్రారంభం కానున్నాయి.
మలబార్ నావికాదళ విన్యాసాల పరంపర భారతీయ నావికాదళం - యునైటెడ్ స్టేట్స్ నావికాదళ ద్వైపాక్షిక విన్యాసంగా1992లో ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది జరుగనున్న సంయుక్త విన్యాసాలలో ఆర్ ఎ ఎన్ కూడా పాలుపంచుకోనున్నది.
మలబార్ 20, తొలి దశలో భారతీయ నావికా దళ యూనిట్లు, యునైటెడ్ స్టేట్స్ షిప్ (యుఎస్ ఎస్) జాన్ ఎస్ మెకెయన్ (గైడెడ్ మిసైల్ డిస్ర్టాయర్ ), హర్ మెజస్టీస్ ఆస్ర్టేలియన్ షిప్ (హెచ్ ఎంఎఎస్) ఎంహెచ్ -60 హెలికాప్టర్ ను అంతర్గతంగా కలిగి ఉన్న బలారత్ (దీర్ఘ పరిధికలిగిన ఫిరంగులవంటివి కలిగిన యుద్ధనౌక), ఎంహెచ్ -60 హెలికాప్టర్ ను అంతర్గతంగా కలిగి ఉన్నజపాన్ మారిటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ షిప్ (జెఎంఎస్‌డిఎఫ్) ఒనామీ (యుద్ధ నావ) విన్యాసాలు జరుపనున్నాయి.
తొలి దశలో భారత నావికాదళ భాగస్వామ్యానికి ఈస్టర్న్ ఫ్లీట్ కమాండింగ్ ఫ్లాగ్ ఆఫీసర్ రేర్ అడ్మిరల్ సంజయ్ వాత్సాయన్ నాయకత్వం వహించనున్నారు. ఈ విన్యాసాలలో యుద్ధ నౌక రణ్ విజయ్, రక్షణ నౌక శివాలిక్, తీర ప్రాంత గస్తీ నౌక సుకన్య, ఫ్లీట్ సపోర్ట్ షిప్ శక్తి, జలాంతర్గామి సింధురాజ్ పాల్గొననున్నాయి. వీటికి అదనంగా, ఆధునిక జెట్ ట్రైనర్ హాక్, దీర్ఘపరిధి కలిగిన నావికాదళ గస్తీ విమానం పి-81, నావికాదళ గస్తీ విమానం డోర్నియర్, హెలికాప్టర్లు కూడా పాల్గొననున్నాయి.
కోవిడ్ -19 సంక్షోభ నేపథ్యంలో ఎటువంటి సంపర్కం లేని, సముద్రంలో మాత్రమే నిర్వహించనున్న ఈ విన్యాసాలు స్నేహపూర్వక నావికాదళాల మధ్య అత్యున్నత స్థాయి సమిష్టి భావనను, సమన్వయాన్ని చూపనున్నాయి. స్పష్టమైన, సంఘటిత ఇండో-పసిఫిక్‌కు, నిబంధనల ఆధారితమైన అంతర్జాతీయ క్రమానికి కట్టుబడి ఉండేండటం అన్న సమిష్టి విలువల ఆధారంగా ఇవి కొనసాగనున్నాయి. మలబార్ 20 తొలి దశలో సంక్లిష్టమైన, అత్యాధునిక నావికా విన్యాసాలు జరుగనున్నాయి. ఇందులో ఉపరితల, జలాంతర్గామి విధ్వంసక, వైమానిక యుద్ధ కార్యకలాపాల విధ్వంసక, క్రాస్ డెక్ ఫ్లైయింగ్, సీమన్ షిప్ ఎవల్యూషన్లు, ఆయుధాలను పేల్చడం వంటి విన్యాసాలు ఉంటాయి.
మలబార్ 20 రెండవ దశ విన్యాసాలు నవంబర్ నెల మధ్యలో అరేబియా సముద్రంలో జరుగనున్నాయి.
***
(Release ID: 1669520)
Visitor Counter : 279