ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ

విప్లవాత్మక ఈ-ఇన్వాయిస్కు అక్టోబర్ 31 నాటికి ఒక నెల పూర్తవుతుంది

పరిచయం చేసిన మొదటి నెలలోనే 27,400 పన్ను చెల్లింపుదారులు 495 లక్షలకు పైగా ఇ-ఇన్వాయిస్‌లు ఎన్ఐసి పోర్టల్‌లో అప్లోడ్ చేశారు

20201 అక్టోబర్ నెలలో 641 లక్షల ఈ-వే బిల్లులు తయారయ్యాయి, ఈ-వే బిల్ వ్యవస్థ అమల్లోకి వచ్చిన రెండున్నర సంవత్సరాల్లో ఇవే అత్యధికం

Posted On: 02 NOV 2020 1:33PM by PIB Hyderabad

విప్లవాత్మక ఈ-ఇన్వాయిస్ విధానానికి అక్టోబరు 31తో నెల పూర్తయింది. వ్యాపారాలు పరస్పరం సమన్వయం చేసుకోవడానికి ఈ విధానంలో ఎంతో ఉపయోగపడుతుంది. ఎన్ఐసి ప్రకారం, కొత్త విధానాన్ని ప్రవేశపెట్టిన మొదటి నెలలోనే, ఎన్ఐసి పోర్టల్‌లో 27,400 పన్ను చెల్లింపుదారులు 495 లక్షలకు పైగా ఇ-ఇన్‌వాయిస్‌లను అప్లోడ్ చేశారు. జీఎస్టీ వ్యవస్థలో కీలకమైన ఈ-ఇన్వాయిస్ విధానం 2020 అక్టోబర్ 1 న మొదలయింది.  ఆర్థిక సంవత్సరంలో 500 కోట్లు, అంతకంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న వ్యాపారాల కోసం ఈ విధానాన్ని మొదలుపెట్టారు. వ్యాపారం సౌలభ్యాన్ని పెంచేందుకు భారతదేశ తీసుకుంటున్న చర్యల్లో ఇది మరో మైలురాయి అవుతుంది. ఇన్వాయిస్ రిజిస్ట్రేషన్ పోర్టల్ సేకరించిన డేటా జీఎస్టీ కామన్ పోర్టల్ (gst.gov.in) లో పన్ను చెల్లింపుదారు  జీఎస్టీఆర్1 రిటర్న్కు వెళ్తుంది. రాబడికి సక్రమంగా వెళ్తుంది. తద్వారా చాలా ఇబ్బందులను తగ్గిస్తుంది.

2020 అక్టోబర్ 1 న 8.4 లక్షల ఈ-ఇన్వాయిస్‌లతో ఈ పోర్టల్ మొదలయింది. వినియోగం క్రమంగా పెరిగింది  2020 అక్టోబర్ 31 నాడు ఒక్క రోజే 35 లక్షల ఈ-ఇన్‌వాయిస్‌లు అప్లోడ్ అయ్యాయి. అక్టోబర్ నెలలో 641 లక్షల ఈ-వే బిల్లుల ఉత్పత్తితో పాటు (ఈ-వే బిల్ సిస్టమ్  రెండున్నర సంవత్సరాల్లో ఇదే అత్యధికం), వ్యవస్థ  మరింత దృఢంగా మారింది. పన్ను చెల్లింపుదారుల నుండి వచ్చిన స్పందన ప్రకారం, ఈ–ఇన్వాయిస్ ఎంతో ప్రయోజనకరమని ట్యాక్స్పేయర్లు తెలియజేశారు. సులువుగా  ఐఆర్ఎన్‌లు జెనరేట్ అవుతున్నాయని పేర్కొన్నారు.   ఎన్ఐసీ హెల్ప్ డెస్క్ అందుబాటులో ఉండటం వల్ల ట్యాక్స్పేయర్లు వారి బిజినెస్లను తప్పులు లేకుండా నిర్వహించుకోగలుగుతున్నారు.

ప్రస్తుతం, ఎన్ఐసి వ్యవస్థలో మూడు రకాల ఐఆర్ఎన్ మోడ్లు ఉన్నాయి. మొదటిది ఎన్ఐసీ వ్యవస్థలోని పన్ను చెల్లింపుదారుల ఈఆర్పీ వ్యవస్థ  ప్రత్యక్ష ఏపీఐ విధానం.  రెండో విధానంలో ఈఆర్పీ వ్యవస్థ  ఏపీఐ ఇంటర్ఫేస్ ద్వారా ట్యాక్స్పేయర్కు అందుబాటులో ఉంటుంది.  జీఎస్పీ ద్వారా ఎన్ఐసీ వ్యవస్థతో ఇది అందుబాటులోకి వస్తుంది. మూడవది ఇన్వాయిస్‌లను భారీగా అప్‌లోడ్ చేయడానికి  ఐఆర్ఎన్‌లను ఉత్పత్తి చేయడానికి ఆఫ్‌లైన్ టూల్ను ఉపయోగిస్తారు. పన్ను చెల్లింపుదారులలో 15శాతం మంది ఐఆర్ఎన్ తయారీ కోసం ఆఫ్‌లైన్ టూల్ను ఉపయోగిస్తున్నారు  85శాతం మంది ఏపీఐ ద్వారా అనుసంధానం అవుతున్నారు.

రాబోయే రోజుల్లో పన్ను చెల్లింపుదారులకు ఐఆర్ఎన్లు ఇవ్వడానికి వారి టర్నోవర్‌ను రూ .100 కోట్లకు తగ్గించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ పన్ను చెల్లింపుదారుల కోసం ఎన్ఐసి ఇప్పటికే ఏపీఐ  ఆఫ్‌లైన్ టూల్ బేస్డ్ ట్రయల్ సైట్‌లను ప్రారంభించింది. పన్ను చెల్లింపుదారుల నుండి ఈ-ఇన్‌వాయిస్‌ల ఉత్పత్తిని నిర్వహించడానికి అవసరమైన మౌలిక సదుపాయాలతో సన్నద్ధమైంది.

ఒక రోజులో 5-10 బి 2 బి ఇన్వాయిస్‌లను సిద్ధం చేయాల్సిన చిన్న పన్ను చెల్లింపుదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, ఎన్ఐసి ఆఫ్‌లైన్ ఎక్సెల్ ఆధారిత ఐఆర్ఎన్ తయారీ,  ఐఆర్ఎన్ ప్రింటింగ్ టూల్ను కూడా అభివృద్ధి చేస్తోంది, ఇది ఇన్‌వాయిస్ వివరాలను నమోదు చేయడానికి, ఫైల్‌ను సిద్ధం చేయడానికి వీలు కల్పిస్తుంది.  దీనివల్ల క్యూఆర్ కోడ్తో ఐఆర్ఎన్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. క్యూఆర్ కోడ్తోనే ప్రింట్ తీసుకోవచ్చు.

ప్రస్తుతం, ఏపీఐ ఇంటర్‌ఫేస్‌ను ఉపయోగించి ఐఆర్ఎన్ జెనరేషన్ సదుపాయం మొత్తం రూ .500 కోట్లకు పైగా టర్నోవర్ ఉన్న ట్యాక్స్ పేయర్లకు, తుది జాబితాలోని ఈఆర్పీలకు, జీఎస్పీలకు మాత్రమే ఉంది. ఇప్పుడు, ఈ-వే బిల్ ఏపీఐ ఇంటర్ఫేస్ ఉపయోగించి పన్ను చెల్లింపుదారులకు నేరుగా యాక్సెస్ ఇస్తారు. సాధారణంగా, పెద్ద వ్యాపారాలు వారి సరఫరాదారులు  క్లయింట్లు తమ ఈఆర్పీ / ఎస్ఏపీ వ్యవస్థలను ఇన్వాయిస్‌ల ఉత్పత్తికి ఎస్ఏపీని ఉపయోగించుకునేలా చేస్తాయి. అందువల్ల, వారి సరఫరాదారులు,  క్లయింట్లు  ఇంటిగ్రేషన్ ఛానెల్‌లను ఉపయోగించుకునేలా వారికి సహకరించాలని నిర్ణయించారు.

***


(Release ID: 1669452) Visitor Counter : 270