యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
2024 ఒలంపిక్ క్రీడా పోటీల్లో పాల్గొనేవారికోసం నిర్వహించే శిక్షణను తిరిగి ప్రారంభించిన క్రీడాకారులు, ఎస్ ఏ ఐ ఎన్ సిఓఇలకు రిపోర్టు చేసిన 96శాతం మంది క్రీడాకారులు
Posted On:
29 OCT 2020 5:41PM by PIB Hyderabad
2024 ఒలంపిక్ క్రీడా పోటీల్లో పాల్గొనేవారికోసం నిర్వహించే శిక్షణను భారతదేశ క్రీడా ప్రాధికార సంస్థ ( ఎస్ ఏ ఐ) తిరిగి ప్రారంభించింది. ఎస్ ఏఐ నిర్వహించే నేషనల్ ఎక్స్ లెన్స్ సెంటర్ల ( ఎన్ సి ఓ)లో నిర్వహించే శిక్షణా కార్యక్రమాల్లో పాల్గొంటున్న క్రీడాకారుల్లో 96 శాతంమంది ఆయా కేంద్రాల్లో రిపోర్ట్ చేశారు. దేశవ్యాప్తంగా ఔరంగాబాద్, భోపాల్, బెంగళూరు, ఢిల్లీ, లక్నో, రోహతక్, సోనెపట్ లలో ఎస్ ఏ ఐ ఎన్ సివోలున్నాయి. టోక్యో ఒలంపిక్స్ కు ఎంపికయినవారందరూ శిక్షణా శిబిరాలు తిరిగి ప్రారంభం కాగానే తిరిగి తమ శిక్షణను ప్రారంభించారు. వీరు తప్పనిసరిగా క్వారంటైన్ లో వుండాలి. అంతే కాదు ఆర్ టి పిసిఆర్ పరీక్ష కూడా చేయించుకోవాలి. కొంత మంది క్రీడాకారులు వెంటనే హాజరు కానప్పటికీ వారు కూడా దీపావళి తర్వాత శిక్షణ శిబిరాలకు చేరుకుంటారని అధికారులు తెలిపారు. ఒకసారి ఎన్ సి ఓ ఇ బయో బబుల్ లోకి వచ్చిన క్రీడాకారులు ఆ తర్వాత వారు తమ శిబిరాలను వీడడానికి ఆస్కారముండదు. వారి భద్రతకోసమే ఈ నియమం పెట్టారు. అందుకే నవంబర్ 1గానీ, దీపావళి తర్వాతగానీ శిబిరాలకు చేరుకునే అవకాశం కూడా వారికి కల్పించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన కేంద్ర క్రీడాశాఖ మంత్రి శ్రీ కిరెన్ రిజిజు..క్రీడాకారుల భద్రతే తమకు ముఖ్యమని అన్నారు. టోక్యో ఒలంపిక్స్ లో పాల్గొంటున్న క్రీడాకారులు ఇప్పటికే శిక్షణ ప్రారంభించారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నియమ నిబంధనల ప్రమాణాల ప్రకారమే వారి శిక్షణ కొనసాగుతుందని అన్నారు.
శిబిరాలకు వచ్చిన క్రీడాకారులు ఆ తర్వాత బైటవారితో కలవకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కేంద్ర ఆరోగ్యశాఖ, రాష్ట్ర ప్రభుత్వాల ప్రోటోకాల్ ప్రకారం శిక్షకకులందరూ భద్రమైన వాతావరణంలో శిక్షణ పొందుతున్నారు.
క్రీడాకారులు ఈ ఎస్ ఏ ఐ కేంద్రాల్లో చేరకముందే వారు అనుసరించాల్సిన ప్రమాణాలతో కూడిన నియమ నిబంధనల్ని అధికారులకు వివరించారు. కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సౌకర్యాలపట్ల క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు సంతృప్తి వ్యక్తం చేశారు. శిక్షణా శిబిరాలకు చేరుకునే క్రీడాకారులకోసం రవాణా సౌకర్యాలను కూడా ఏర్పాటు చేశారు. 500 కిలోమీటర్ల లోపు దూరంలో వుండే క్రీడాకారులు థర్డ్ ఏసీ రైలులో ప్రయాణం చేయాలని, 500 కిలోమీటర్లకంటే ఎక్కువ దూరంలో వున్నవారు విమానంలో ప్రయాణం చేసి శిబిరాలకు చేరుకోవచ్చని తెలిపారు.
***
(Release ID: 1669031)
Visitor Counter : 153