రక్షణ మంత్రిత్వ శాఖ
ఇంటర్నెట్ కోసం సురక్షితమైన అప్లికేషన్ ను (ఎస్ ఎ ఐ) ప్రారంభించిన సైన్యం
Posted On:
29 OCT 2020 12:49PM by PIB Hyderabad
ఆత్మ నిర్భర్ భారత్ సాధనలో భాగంగా భారతీయ సైన్యం సరళమైన, సురక్షితమైన మెస్సేజింగ్ అప్లికేషన్‌ను సెక్యూర్ అప్లికేషన్ ఫర్ ఇంటర్నెట్ (SAI) అభివృద్ధి చేసింది. ఇంటర్నెట్‌పై ఆండ్రాయిడ్ వేదిక కోసం ఉద్దేశించిన ఈ అప్లికేషన్ ఎండ్ టు ఎండ్ సెక్యూర్ వాయిస్, టెక్ట్స్, వీడియో కాలింగ్ సురక్షితంగా సాగేలా మద్దతు ఇస్తుంది. ఈ అప్లికేషన్ ప్రస్తుతం వాణిజ్యపరంగా అందుబాటులో ఉన్న వాట్సాప్, టెలిగ్రాం, ఎస్ ఎ ఎం వి ఎడి, జిఐఎమ్ ఎస్ ను ఈ నమూనా పోలి ఉండటమే కాకుండా, ఎండ్ టు ఎండ్ సంకేత నిక్షిప్త సందేశం (ఎన్క్రిప్షన్) మెసేజింగ్ ప్రోటోకాల్‌ను ఉపయోగిస్తుంది. స్థానిక అంతర్గత సర్వర్లు, కోడింగ్ లో సురక్షితమైన లక్షణాలను ఎస్ ఎఐ కలిగి ఉండటమే కాదు, అవసరాలను బట్టి సవరించుకునేందుకు అనుగుణంగా ఉంటుంది.
ఈ అప్లికేషన్‌ను సిఇఆర్‌టి నియమిత అంతర్గత ఆడిటర్, ఆర్మీ సైబర్ గ్రూప్‌లు పరీక్షించాయి. మేథో సంపత్తి హక్కుల కోసం దాఖలు, ఎన్ ఐసి పై మౌలిక సదుపాయాల ఏర్పాటు, ఐఒఎస్ ప్లాట్‌ఫాంపై పని చేయడం ప్రస్తుతం పురోగమనంలో ఉన్నాయి. సైన్యంలో సురక్షితమైన మెసేజింగ్ సేవల సౌలభ్యం కోసం ఎస్ ఎఐని సైన్యం మొత్తం ఉపయోగించనుంది.
అప్లికేషన్ ప్రయోజనాలను సమీక్షించిన రక్షణ మంత్రి దానిని అభివృద్ధి చేసిన కల్నల్ సాయి శంకర్ నైపుణ్యాలను, బుద్ధి కుశలతను ప్రసంశించారు.
***
(Release ID: 1668503)
Visitor Counter : 303