వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

ఎస్‌సీవోకు చెందిన ఆర్థిక మరియు విదేశీ వాణిజ్య మంత్రుల సమావేశం నిర్వహించిన భారత్

మహమ్మారి తరువాత ఆర్ధికవ్యవస్థ త్వరగా కోలుకోవటానికి వాణిజ్యం మరియు పెట్టుబడులను పెంచాలని ఎస్సీఓ దేశాలకు ఈ సందర్భంగా శ్రీ పియూష్ గోయల్ పిలుపునిచ్చారు.

Posted On: 28 OCT 2020 5:01PM by PIB Hyderabad

విదేశీ ఆర్థిక వ్యవస్థ మరియు విదేశీ వాణిజ్య కార్యకలాపాలకు బాధ్యత వహించే షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) మంత్రుల 19 వ సమావేశాన్ని నేడు భారత్ నిర్వహించింది.

తన ప్రారంభ ఉపన్యాసంలో వాణిజ్య మరియు పరిశ్రమలశాక మంత్రి శ్రీ పియూష్ గోయల్ మాట్లాడుతూ.. కోవిడ్ -19 కారణంగా నెలకున్న ఆర్ధిక సంక్షోభాన్ని అదిగమించేందుకు ఈ ప్రాంతంలో వాణిజ్యం మరియు పెట్టుబడులను పెంచే భాగస్వామ్యాలను అన్వేషించడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. మహమ్మారి అనంతర పరిస్థితుల నుండి త్వరగా కోలుకోవడంలో కీలకమైన ఇంట్రా-ఎస్సీఓ వాణిజ్యం మరియు పెట్టుబడులను పెంచడానికి దేశాలమధ్య సహకారాన్ని కొనసాగించాలని కోరారు. ప్రతి దేశం తన ప్రపంచ దృక్పథాన్ని దాని నాగరికత మరియు తాత్విక సంప్రదాయం ద్వారా రూపొందించుకుంటుందని చెప్పారు. ప్రపంచాన్ని ఒక కుటుంబంగా భావించడమే భారత సనాతన సాంప్రదాయమని..అదే వసుదైక కుటుంబక భావన అని శ్రీ గోయల్ అన్నారు.

ఈ సందర్భంగా వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరి కూడా మాట్లాడారు. ఈ వర్చువల్ సమావేశంలో కిర్గిజ్ రిపబ్లిక్, కజికిస్థాన్, పాకిస్తాన్, రష్యా, తజికిస్తాన్ మరియు ఉజ్బెకిస్తాన్ నుండి ఎస్సీఓ సెక్రటరీ జనరల్ మరియు మంత్రులు పాల్గొన్నారు.

ఈ సమావేశంలో నాలుగు ఉత్తర్వులను  స్వీకరించారు.. అవి:

i.కోవిడ్ -19 ప్రతిస్పందనపై ప్రకటన. ఇది ఔషాదాల లభ్యతను, వాణిజ్యాన్ని సులభతరం చేయడానికి ఆ మేరకు దేశాల మధ్య సహకారాన్ని ఇది బలోపేతం చేస్తుంది.

ii.డబ్లూటీవో  సభ్యులైన ఎస్‌సివో దేశాల మంత్రుల బహుళపాక్షిక వాణిజ్య వ్యవస్థపై ప్రకటన మరొకటి.  నిబంధనల ఆధారిత బహుపాక్షిక చర్చల యొక్క ప్రాముఖ్యతను  ఈ  ప్రకటన తెలియజేస్తుంది.

iii.మేధో సంపత్తి హక్కులపై ఎస్‌సివో సహకారం (ఐపిఆర్) పై ప్రకటన. ఇది మేధో సంపత్తి యొక్క సహకారానికి సంబంధించినది మరియు చట్టం అమలు, అంతర్జాతీయ సంస్థలు మరియు ఇతర రంగాలలో సహకారం గురించి సమాచారం /అనుభవాన్ని పంచుకోవడం.

iv:ఎంస్‌ఎంఈల రంగంలో ఎస్‌సివో పరిధిలో సహకారాన్ని పెంపొందించుకోవడానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక.  ఎంఎస్‌ఎంఈల మధ్య సమాచార మార్పిడి, పరిశోధన మరియు సహకారం పెంపునకు ఇది ఉపయోగపడుతుంది. ఎంఎస్‌ఎంఈల మధ్య సహకారానికి ఈ ఒప్పందం ఎంతగానో ప్రయోజనకరంగా ఉంటుంది.

ఈ సమావేశం ద్వారా లభించిన ఫలితాలు ఎస్సీఓ సంఘీభావానికి చాలా ముఖ్యమైన మైలురాళ్ళు అని శ్రీ గోయల్ తన ముగింపు సందేశంలో స్పష్టం చేశారు.

 

****



(Release ID: 1668286) Visitor Counter : 145