రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ

ఎస్‌సీఓ దేశాలతో ర‌వాణా అనుసంధాన‌త విష‌య‌మై భారతదేశం ఇస్తున్న‌ ప్రాధాన్యతను వివ‌రించిన ర‌వాణా కార్య‌ద‌ర్శి

- కోవిడ్‌-19 మహమ్మారి వంటి అత్యవసర పరిస్థితుల్లో సుస్థిరమైన రవాణా కార్యకలాపాలను నిర్ధారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయ‌ప‌డిన‌
శ్రీ గిరిధర్ అరమానే

Posted On: 28 OCT 2020 6:01PM by PIB Hyderabad

 

రష్యా సమాఖ్య అధ్యక్షతన ఈ నెల 28న ఎస్‌సీఓ సభ్య దేశాల మంత్రుల 8వ సమావేశం జ‌రిగింది. వీడియో కాన్ఫ‌రెన్స్ విధానంలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో భారత ప్రభుత్వం త‌ర‌పున కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ‌ కార్యదర్శి శ్రీ గిరిధర్ అరమానే పాల్గొన్నారు. ఎస్‌సీఓలోని స‌భ్య దేశాల‌ మధ్య సహకారం, నమ్మకం పెంపొందించేందుకు భార‌త దేశం ఇస్తున్న ప్రాధాన్య‌త గురించి ఆయ‌న ఈ సంద‌ర్భంగా వివ‌రించారు. 'ఇంటెలీజెంట్ ట్రాన్స్‌పోర్ట్' వ్య‌వ‌స్థ విష‌య‌మై భార‌త్‌కున్న‌ అనుభవాన్ని శ్రీ గిరిధర్ అరమానే ఈ వేదిక‌పై పంచుకున్నారు. కోవిడ్ మహమ్మారి వంటి అత్యవసర పరిస్థితుల్లో సుస్థిర రవాణా కార్యకలాపాలను నిర్ధారించడానికి, సరిహద్దుల్లో అత్యవసర పరిస్థితుల వ్యాప్తిని నివారించడానికి సభ్య దేశాల రవాణా మంత్రిత్వ శాఖలు / డిపార్ట్‌మెంట్‌ స్థాయిలో సమన్వయపు చర్యల ఆవశ్యకత గురించి ఆయన ప్ర‌సంగించారు.

 

 

***


(Release ID: 1668256) Visitor Counter : 172