రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

రక్షణ ఎగుమతులను పెంచడం: ఉమ్మడి ఉత్పత్తి, పరస్పర వాణిజ్యం ద్వారా మరింత రక్షణ సహకారానికి భారత్ - యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంగీకారం

Posted On: 28 OCT 2020 2:44PM by PIB Hyderabad

రక్షణ ఎగుమతులను పెంచడానికి "ఇండియన్ డిఫెన్స్ ఇండస్ట్రీ గ్లోబల్ ఔట్రీచ్ ఫర్ కొలాబరేటివ్ పార్టనర్‌షిప్: వెబ్‌నార్ అండ్ ఎక్స్‌పో ఇండియా - యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ డిఫెన్స్ కో–ఆపరేషన్"  అనే ప్రాధాన్యత అంశంతో భారతదేశం, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ల మధ్య ఒక వెబ్‌నార్ జరిగింది.  రక్షణ ఉత్పత్తుల శాఖ, రక్షణ మంత్రిత్వశాఖ (ఎంఓడీ), సొసైటీ ఆఫ్ ఇండియన్ డిఫెన్స్ మానుఫ్యాక్చరర్స్ (ఎస్ఐడీఎం) ద్వారా ఈ నెల 27న ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.  వెబ్‌నార్‌లో ఇరుపక్షాల రాయబారులు, ఎంఓడీ సీనియర్ అధికారులు పాల్గొని ఇరు దేశాల మధ్య లోతైన సంబంధాల గురించి మాట్లాడారు. ఉమ్మడి ఉత్పత్తి , పరస్పర వాణిజ్యం ద్వారా రక్షణరంగంలో మరింత సహకారాన్ని అందించుకోవడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి. ఇది రెండు దేశాలకూ మేలని పేర్కొన్నాయి. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్‌లో తాము రక్షణవాదాన్ని సమర్థించడం లేదని జెఎస్ (డిఐపి)  సంజయ్ జాజు అన్నారు. "దీనికి విరుద్ధంగా, మేం బహిర్గతకు, అనుసంధానాలకు ప్రాధాన్యత ఇస్తున్నాము, తద్వారా మా కంపెనీలు ప్రపంచ సరఫరా గొలుసులలో భాగమవుతాయి.  విదేశీ రక్షణ సంస్థలు భారత రక్షణ ఉత్పాదక వ్యవస్థలో భాగమవుతాయి"

రక్షణ ఎగుమతులను పెంచడానికి,  రాబోయే ఐదేళ్లలో 5 బిలియన్ డాలర్ల రక్షణ ఎగుమతి లక్ష్యాన్ని సాధించడానికి స్నేహపూర్వక విదేశాలతో నిర్వహిస్తున్న వెబ్‌నార్ల శ్రేణిలో ఈ వెబినార్ ఒక భాగం.  ఎల్ అండ్ టి డిఫెన్స్, జిఆర్ఎస్ఇ, ఓఎఫ్బీ, ఎమ్కెయు, భారత్ ఫోర్జ్ , అశోక్ లేలాండ్ వంటి కంపెనీలు... ఆర్టిలరీ సిస్టమ్స్, రాడార్స్, ప్రొటెక్టెడ్ వెహికల్స్, కోస్టల్ సర్వైలెన్స్ సిస్టమ్, ఆకాష్ క్షిపణి వ్యవస్థ  మందుగుండు సామగ్రి వంటి వాటి గురించి కంపెనీ, ఉత్పత్తి ప్రదర్శనలు ఇచ్చారు.  యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వైపు నుండి ఎస్టీఆర్ఈఐటీ గ్రూప్, రాక్‌ఫోర్డ్ జెల్లెరీ, ఎడ్జ్, తవాజున్  మరకేబ్ టెక్నాలజీస్ ప్రదర్శనలు ఇచ్చాయి. వెబ్‌నార్‌లో 180 మందికి పైగా పాల్గొన్నారు  ఎక్స్‌పోలో 100 కి పైగా వర్చువల్ ఎగ్జిబిషన్ స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు.

***


(Release ID: 1668230) Visitor Counter : 202