ఆర్థిక సంఘం
గత విత్త కమిషన్ల చైర్మన్లతో చర్చించిన 15వ విత్త కమిషన్
Posted On:
28 OCT 2020 3:53PM by PIB Hyderabad
పదిహేనవ విత్త కమిషన్ చైర్మన్ ఎన్. కె. సింగ్ గత విత్త కమిషన్ల చైర్మన్లతో బుధవారం దృశ్య మాధ్యమం ద్వారా సమావేశాన్ని నిర్వహించారు. తమ చర్చలు పూర్తి అయిన అనంతరం ఆయన 12వ విత్త కమిషన్ చైర్మన్ డాక్టర్ సి.రంగరాజన్, 13వ విత్త కమిషన్ చైర్మన్ డాక్టర్ విజయ్ కేల్కర్‌లతో సమావేశాన్ని ఆయన నిర్వహించారు.
గత 20 ఏళ్ళ సమాఖ్య చరిత్రకు ప్రతినిధిగా నిలిచిన విత్త కమిషన్ల బాటలో 15 విత్త కమిషన్ రాబోయే ఐదేళ్లకీ తన ప్రణాళికను అందిస్తోందన్న పిలుపుతో చైర్మన్ ఎన్.కె. సింగ్ సమావేశాన్ని ప్రారంభించారు.
పదిహేనవ విత్త కమిషన్ (XVFC) తప్పనిసరిగా అక్టోబర్ 30, 2020 నాటికి 2021-26కు తమ అంతిమ నివేదికను తయారు చేయడం తప్పనిసరి. ఈ పనిని పూర్తి చేయడంలో కమిషన్ నిమగ్నమై ఉంది.
కోవిడ్ -19 సంక్షోభం, తత్ఫలితంగా ఆర్థిక కలాపాలలో నష్టం, సాధారణ ప్రభుత్వ విత్త పారామతుల పై దాని ప్రభావం నేపథ్యంలో 15వ విత్త కమిషన్ ఎదుర్కొన్న కఠినమైన సవాలును గత విత్త కమిషన్ల చైర్మన్లు ప్రశంసించారు. తమ చర్చల నేపథ్యంలో గత విత్త కమిషన్ల చైర్మన్ల ఆలోచనలు, చట్రానికి సంబంధించిన అంతర్దృష్టులకు 15వ విత్త కమిషన్ చైర్మన్, సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
***
(Release ID: 1668218)
Visitor Counter : 237