రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
త్రిపురలో రేపు 9 జాతీయ రహదారి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్న శ్రీ గడ్కరీ
ఆ ప్రాంత సామాజిక-ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచనున్న ప్రాజెక్టులు
పర్యాటక, ఆర్థిక, అంతర్జాతీయ అనుసంధానంలో అనూహ్య వృద్ధికి ఆస్కారం
Posted On:
26 OCT 2020 2:03PM by PIB Hyderabad
త్రిపురలో రేపు 9 జాతీయ రహదారుల నిర్మాణ ప్రాజెక్టులకు; కేంద్ర రహదారి రవాణా, హైవేల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేయనున్నారు. వీటి మొత్తం పొడవు దాదాపు 262 కి.మీ. రూ.2752 కోట్ల విలువతో నిర్మాణం చేపట్టనున్నారు. ముఖ్యమంత్రి శ్రీ బిప్లబ్ కుమార్ దేవ్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తారు. కేంద్ర సహాయ మంత్రులు శ్రీ జితేంద్ర సింగ్, వి.కె.సింగ్, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
ఈ ప్రాజెక్టులు పూర్తయితే; వేగవంతమైన, ఇబ్బందులు లేని అంతర్రాష్ట్ర, బంగ్లాదేశ్‌తో అంతర్జాతీయ అనుసంధానానికి వీలవుతుంది. రాష్ట్రంలో పర్యాటక వృద్ధికి ప్రధాన కారకమవుతుంది. రాష్ట్రంలోని వివిధ పర్యాటక, చారిత్రక,
మతపరమైన ప్రాంతాలను సందర్శించడానికి ఉత్తమ, వేగవంతమైన, సురక్షిత ప్రయాణాలను ఈ ప్రాజెక్టులు అందిస్తాయి. ఆ ప్రాంత ప్రజలకు ఉద్యోగాలు, స్వయం ఉపాధిని కల్పిస్తాయి. దీంతోపాటు, ప్రయాణ సమయం, ఇంధనాన్ని ఆదా చేస్తాయి. వాహనాల నిర్వహణ ఖర్చులు కూడా తగ్గుతాయి. రాష్ట్రంలోని సామాజిక-ఆర్థిక పరిస్థితుల్లో పురోగతి కనిపిస్తుంది. మార్కెట్లకు వెళ్లే సదుపాయం, వ్యవసాయ ఉత్పత్తుల రవాణా మెరుగవుతుంది. తద్వారా ఆయా వస్తువులు, సేవల ధరలు తగ్గుతాయి. ఆరోగ్యపరంగానూ వేగవంతమైన సేవలను అందుకోవచ్చు. రాష్ట్రంలో పర్యాటక, ఆర్థిక, అంతర్జాతీయ అనుసంధానంలో వృద్ధి కనిపిస్తుంది. మొత్తంగా ఈ కొత్త ప్రాజెక్టులు త్రిపుర జీడీపీకి కారకాలవుతాయి.
కొత్త ప్రాజెక్టులు:
క్ర.సం.
|
ప్రాజెక్టు పేరు
|
పొడవు (కి.మీ.)
|
ఖర్చు (రూ.కోట్లలో)
|
1
|
ఎన్‌హెచ్-108ఏ, జోలయ్బారి-బెలోనియా
|
21.4
|
201.99
|
2
|
ఎన్‌హెచ్-208, కైలాషహర్ - కుమార్‌ఘాట్
|
18.60
|
277.50
|
3
|
ఎన్‌హెచ్-8, ఖాయేర్‌పూర్-ఆమ్తాలి (అగర్తాలా బైపాస్)
|
12.90
|
147
|
4
|
ఎన్‌హెచ్-108బి, అగర్తలా - ఖోవై
(మూడు ప్యాకేజీలు)
|
38.80
|
480.19
|
5
|
ఎన్‌హెచ్-208ఎ, కైలాషహర్-కుర్తి వంతెన
( మూడు ప్యాకేజీలు )
|
36.46
|
473.49
|
6
|
ఎన్‌హెచ్ 44ఎ, మను-సిమ్లంగ్
( రెండు ప్యాకేజీలు )
|
36.54
|
595.12
|
7
|
ముహురి నదిపై ఉన్న ఆర్‌సీసీ బ్రిడ్జి & గోమతి నదిపై ఉన్న ఆర్‌సీసీ బ్రిడ్జి
|
2
|
83.06
|
8
|
ఎన్‌హెచ్-8 ద్వారా చురైబారి-అగర్తాలా విభాగాన్ని బలోపేతం చేయడం
|
74.85
|
257.96
|
9
|
ఎన్‌హెచ్-44 సెక్షన్‌లోని చురైబారి-అగర్తాలా విభాగంలో వృద్ధి
|
21.789
|
236.18
|
|
మొత్తం
|
261.339
|
2752.49
|
***
(Release ID: 1667594)
Visitor Counter : 178