యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

టేబుల్ టెన్నిస్ జాతీయ శిక్ష‌ణా శిబ‌ర నిర్వ‌హ‌ణ‌కు ఆమోదం తెలిపిన ఎస్ ఎఐ, శిబిరాన్ని సోనేప‌ట్‌లో నిర్వ‌హించ‌నున్న టిటిఎఫ్ ఐ

Posted On: 24 OCT 2020 5:42PM by PIB Hyderabad

జాతీయ టేల‌డ‌ట‌బుల్ టెన్నిస్ శిక్ష‌ణా శిబిరాన్ని నిర్వ‌హించేందుకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా శ‌నివారం ఆమోదించింది. ఈ శిబిరం అక్టోబ‌ర్ 28న ప్రారంభ‌మై, డిసెంబ‌ర్ 8వ తేదీన ముగుస్తుంది. ఈ శిక్ష‌ణా శిబిరాన్ని సోనేప‌ట్‌లోని ఢిల్లీ ప‌బ్లిక్ స్కూల్‌లో టేబుల్ టెన్నిస్ ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా నిర్వ‌హించ‌నుంది. ఇందులో 11 మంది ఆట‌గాళ్ళు (5గురు అబ్బాయిలు, 6 అమ్మాయిలు), నలుగురు స‌హాయక సిల‌ట‌బ్బంది పాల్గొన‌నున్నారు.ఈ శిబిర నిర్వ‌హ‌ణ‌కు సుమారు రూ. 18 ల‌క్ష‌ల‌ను (అద‌నంగా విమాన ఛార్జీలు, వైద్య ఖ‌ర్చులు) మంజూరు చేశారు.
శిక్ష‌ణ పొందేవారు సోనేప‌ట్‌లోని డిపిఎస్‌లోని వ‌స‌తి నివాsసంలో బ‌స చేస్తారు. శిబిరం క్రీడాకార్య‌క‌లాపాల పునఃప్రారంభంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్దేశించిన ప్ర‌మాణిత విధి విధానాల‌కు క‌ట్టుబ‌డి ఉంటుంది.  ఈ ఏడాది మార్చిలో క‌రోనా వైర‌స్ కార‌ణంగా దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్ర‌క‌ట‌న త‌ర్వాత టేబుల్ టెన్నిస్ కోసం నిర్వ‌హిస్తున్న తొలి జాతీయ శిబిరం ఇది. 

నాలుగుసార్లు కామ‌న్‌వెల్త్ క్రీడ‌ల్లో బంగారు ప‌తకాన్ని సాధించిన ఆచంట శ‌ర‌త్ క‌మ‌ల్ పురుషుల శిక్ష‌ణా బృందంలో భాగంగా ఉంటారు. అత‌డి‌తో పాటుగా మ‌నుష్ షా, మాన‌వ్ థ‌క్క‌ర్‌, సుధాంశు గ్రోవ‌ర్‌, జుబిన్ కుమార్ పాల్గొన‌నున్నారు. మ‌హిళ‌ల శిక్ష‌ణా శిబిరంలో అనూష కుటుబాలె, దియా చితాలే, సుతిరితా ముఖ‌ర్జీ, అర్చ‌నా కామ‌త్‌, ట‌కామె స‌ర్కార్‌, క‌న్షాని నాథ్ ఉంటారు. ల‌క్ష్యిత ఒలింపిక్ పోడియం ప‌థ‌క అభివృద్ధి బృందంలో భాగం కావ‌డ‌మే కాక‌, యూత్ ఒలింపిక్స్‌లో సెమీ ఫైన‌లిస్ట్ అర్చ‌నా కామ‌త్‌, శిబిర వాతావ‌ర‌ణానికి తిరిగి రావ‌డం ప‌ట్ల, త‌న స‌హ క్రీడాకారుల‌ను దీర్ఘ‌కాలం త‌ర్వాత క‌ల‌వ‌డం ప‌ట్ల‌ సంతోషాన్ని వ్య‌క్తం చేశారు. నేను బెంగళూరులో ఇంటి ద‌గ్గ‌ర శిక్ష‌ణ పొందుతున్నా కానీ శిబిర వాతావ‌ర‌ణానికి తిరిగి రావ‌డం కోసం ఎదురు చూస్తున్నాను. దీర్ఘ‌కాలం త‌ర్వాత భార‌త టీంకు చెందిన స‌హ క్రీడాకారుల‌ను చూడ‌ట‌మే కాక వారితో క‌లిసి శిక్ష‌ణ పొందాల‌నుకున్నాను అని చెప్పారు. 
ఒలింపిక్స్‌లో అర్హ‌త పొందటం, అందులో ఆడ‌టం త‌న అంతిమ ల‌క్ష్య‌మ‌ని, అయితే ప్ర‌స్తుతం త‌ను వ‌ర్త‌మానంపై దృష్టిపెట్టి, ఒక‌సారి ఒక మ్యాచ్ గెల‌వ‌డం గురించి ఆలోచిస్తున్నాన‌ని కామ‌త్ తెలిపారు. 
ఇటీవ‌లి కాలంలో భార‌త‌ టేబుల్ టెన్నిస్ ఆట‌గాళ్ళు ఆట‌లో బాగా రాణించారు. కామ‌న్ వెల్త్ గేమ్స్ 2018లో 8 మెడ‌ళ్ళ‌ను సాధించ‌డ‌మే కాక, అదే ఏడాదిలో జ‌రిగిన ఏషియ‌న్ గేమ్స్‌లో తొలిసారి మోడ‌ల్స్ సాధించారు. 

***


 


(Release ID: 1667407) Visitor Counter : 194