ప్రధాన మంత్రి కార్యాలయం
"ఇండియా ఎనర్జీ ఫోరం" ను ప్రారంభించి, ప్రముఖ అంతర్జాతీయ చమురు మరియు గ్యాస్ కంపెనీల సి.ఇ.ఓ.లతో సంభాషించనున్న - ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
Posted On:
23 OCT 2020 8:11PM by PIB Hyderabad
నీతీ ఆయోగ్ మరియు పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ 2020 అక్టోబర్, 26వ తేదీన భారత కాలమాన ప్రకారం సాయంత్రం ఆరు గంటలకు వీడియో కాన్ఫరెన్సు ద్వారా నిర్వహించే వార్షిక కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ పాల్గొని, ప్రముఖ అంతర్జాతీయ చమురు మరియు గ్యాస్ కంపెనీల సి.ఇ.ఓ. లతో సంభాషించనున్నారు.
ముడి చమురు వినియోగంలో మూడవ అతిపెద్ద దేశంగా మరియు ఎల్.ఎన్.జి. దిగుమతిలో నాల్గవ అతిపెద్ద దేశంగా భారతదేశం, ప్రపంచ చమురు మరియు గ్యాస్ రంగంలో ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తోంది. అంతర్జాతీయ చమురు మరియు గ్యాస్ వ్యాపారంలో కేవలం ఒక వినియోగదారుని పాత్ర నుండి ఒక చురుకైన వాటాదారునిగా వ్యవహరించవలసిన అవసరాన్ని గ్రహించి, నీతీ ఆయోగ్ 2016 లో గౌరవనీయ ప్రధానమంత్రితో అంతర్జాతీయ చమురు మరియు గ్యాస్ సంస్థల సి.ఈ.ఓ.ల మొదటి రౌండ్ టేబుల్ సమావేశాన్ని ప్రారంభించింది.
అంతర్జాతీయ ఆయిల్ మరియు గ్యాస్ రంగాన్ని రూపొందించే 45-50 మంది అంతర్జాతీయ సంస్థల సిఇఓలు మరియు ముఖ్య వాటాదారులు ప్రతి సంవత్సరం సమావేశమై గౌరవనీయ ప్రధానమంత్రితో సమస్యలు మరియు అవకాశాల గురించి చర్చించడానికి ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. అంతర్జాతీయ సి.ఈ.ఓ. ల వార్షిక పరస్పర చర్చల ప్రభావాన్ని, ఆ చర్చల ఆకర్షణ, సలహాల నాణ్యత మరియు వారు వ్యవహరించే తీవ్రతలో గమనించవచ్చు.
ఇది, నీతీ ఆయోగ్ మరియు పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న 5 వ కార్యక్రమం. ప్రధాన చమురు, గ్యాస్ కంపెనీలకు చెందిన 45 మంది సీ.ఈ.ఓ.లు ఈ ఏడాది కార్యక్రమానికి హాజరుకానున్నారు.
ఉత్తమ పద్ధతులను అర్థం చేసుకోవడానికి, సంస్కరణలను చర్చించడానికి మరియు భారతీయ చమురు మరియు గ్యాస్ సంస్థలలో పెట్టుబడులను వేగవంతం చేయడానికి అవసరమైన వ్యూహాలను తెలియజేయడానికి వీలుగా ఒక అంతర్జాతీయ స్థాయి వేదికను అందించడం - ఈ సమావేశానికి వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం. ఈ వార్షిక పరస్పర చర్చ క్రమంగా మేధో చర్చ మాత్రమే కాకుండా కార్యనిర్వాహక చర్యకు సంబంధించిన ముఖ్యమైన సమావేశాలలో ఒకటిగా మారింది. ప్రపంచంలోని మూడవ అతిపెద్ద ఇంధన వినియోగదారు అయిన భారతదేశం యొక్క పెరుగుదలతో ఈ కార్యక్రమం కూడా పెరుగుతుంది, ఇది పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి 2030 నాటికి చమురు మరియు గ్యాస్ రంగంలో 300 బిలియన్ అమెరికా డాలర్ల పెట్టుబడులను చూడవచ్చు.
పెట్రోలియం, సహజవాయువు, ఉక్కు శాఖల మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ఈ సదస్సులో ప్రారంభోపన్యాసం చేస్తారు. ప్రారంభోపన్యాసం అనంతరం, చమురు మరియు గ్యాస్ రంగం యొక్క అవలోకనాన్ని తెలియజేసే సమగ్ర ప్రదర్శనతో పాటు భారతీయ చమురు మరియు గ్యాస్ రంగంలో ఆశయం మరియు అవకాశాలను వివరించనున్నారు.
దీని తరువాత అంతర్జాతీయ సీ.ఈ.ఓ.లు, నిపుణులతో పరస్పర చర్చా కార్యక్రమం జరగనుంది. అబుదాబి జాతీయ చమురు సంస్థ (ఏ.డి.ఎన్.ఓ.సి), సి.ఈ.ఓ., గౌరవనీయులు డాక్టర్ సుల్తాన్ అహ్మద్ అల్ జాబెర్; యూ.ఏ.ఈ. పరిశ్రమలు, అధునాతన సాంకేతిక శాఖల మంత్రి, గౌరవనీయులు సాద్ షెరిడా అల్-కాబీ; ఖతార్ ఇంధన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి, ఖతార్ పెట్రోలియం, డిప్యూటీ చైర్మన్, ప్రెసిడెంట్, సి,ఈ,ఓ,, గౌరవనీయులు మహ్మద్ సానుసి బార్కిండో; ఆస్ట్రియా, ఒపెక్, సెక్రటరీ జనరల్ వంటి కీలక అంతర్జాతీయ ఆయిల్ మరియు గ్యాస్ వాటాదారులు ఈ సదస్సులో పాల్గొని చమురు, గ్యాస్ రంగం పై తమ వద్ద అందుబాటులో ఉన్న సమాచారాన్ని తెలియజేస్తారు.
రష్యా లోని రోస్నెఫ్ట్, ఛైర్మన్, సి.ఈ.ఓ., డాక్టర్ ఇగోర్ సెచిన్; బి.పి. లిమిటెడ్, సి.ఈ.ఓ., మిస్టర్ బెర్నార్డ్ లూనీ; ఫ్రాన్సు లోని టోటల్ ఎస్.ఏ., చైర్మన్, సి.ఈ.ఓ., మిస్టర్ పాట్రిక్ పౌయన్నే; వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్ చైర్మన్ శ్రీ అనిల్ అగర్వాల్; ఆర్.ఐ.ఎల్., ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, శ్రీ ముఖేష్ అంబానీ, ఫ్రాన్సు లోని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, డాక్టర్ ఫాతిహ్ బిరోల్; సౌదీ అరేబియాలోని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఫోరం, సెక్రటరీ జనరల్, మిస్టర్ జోసెఫ్ మెక్ మోనిగ్లే, జి.ఈ.సి.ఎఫ్., సెక్రటరీ జనరల్, యూరి సెంటురిన్ మొదలైన వారు తమ, తమ సంస్థల గురించిన సమాచారాన్ని గౌరవ ప్రధానమంత్రితో పంచుకోనున్నారు. ప్రధాన చమురు మరియు గ్యాస్ కంపెనీలైన లియోండెల్ బాసెల్, టెల్లూరియన్, ష్లంబర్గర్, బేకర్ హ్యూస్, జె.ఈ.ఆర్.ఏ., ఎమెర్సన్ మరియు ఎక్స్-కోల్ సంస్థలతో పాటు భారతదేశానికి చెందిన చమురు మరియు గ్యాస్ కంపెనీలకు చెందిన సి.ఈ.ఓ.లు, నిపుణులు కూడా తమ దృక్పథాన్నివ్యక్తపరచనున్నారు.
దీనికి ముందు ప్రధానమంత్రి, ఇప్పుడు నాల్గవ సంవత్సరంలో ఉన్న సెరా వీక్ నిర్వహించే ఇండియా ఎనర్జీ ఫోరంను ప్రారంభిస్తారు. క్లిష్టమైన సమాచారం, విశ్లేషణలు మరియు పరిష్కారాలలో అంతర్జాతీయ స్థాయి సంస్థ ఐ.హెచ్.ఎస్. మార్కిట్ దీనికి ఆతిధ్యమిస్తోంది. ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ వక్తల బృందంతో పాటు, భారతదేశం మరియు 30 కి పైగా దేశాల నుండి ప్రాంతీయ ఇంధన సంస్థలు, ఇంధన సంబంధిత పరిశ్రమలు, సంస్థలు మరియు ప్రభుత్వాలకు చెందిన వెయ్యి మందికి పైగా ప్రతినిధులు పాల్గొంటున్నారు.
ముందుగా ప్రసంగించే వక్తలలో -
* సౌదీ అరేబియా ఇంధన శాఖ మంత్రి గౌరవనీయులు అబ్దులాజీజ్ బిన్ సల్మాన్ ఐ.ఏ. సాద్;
* అమెరికా ఇంధన శాఖ కార్యదర్శి, డాన్ బ్రౌలెట్;
* ఐ.హెచ్.ఎస్. మార్కిట్, వైస్ చైర్మన్, సెరా వీక్ ఛైర్మన్, డాక్టర్ డేనియల్ యెర్గిన్ ఉన్నారు.
ఇండియా ఎనర్జీ ఫోరం సందర్భంగా అన్వేషించాల్సిన ముఖ్య అంశాలలో - భారతదేశం యొక్క భవిష్యత్తు ఇంధన డిమాండు పై హమ్మారి ప్రభావం; భారతదేశ ఆర్ధికాభివృధికి తగిన సరఫరా చేయడం; భారతదేశానికి శక్తి పరివర్తన మరియు వాతావరణ ఎజెండా అంటే ఏమిటి; భారతదేశ ఇంధన మిశ్రమంలో సహజ వాయువు: మార్గం ఏమిటి; శుద్ధి చేయడం మరియు పెట్రో రసాయనాలు: మిగులు మధ్య వ్యూహాలు; ఆవిష్కరణ వేగం: జీవ ఇంధనం, హైడ్రోజన్, సి.సి.ఎస్, ఎలక్ట్రిక్ వాహనాలు మరియు డిజిటల్ పరివర్తన; మార్కెట్ మరియు నియంత్రణ సంస్కరణ: ముందుకు ఏమి ఉంది? మొదలైనవి ఉన్నాయి.
*****
(Release ID: 1667250)
Visitor Counter : 263
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam