కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
35 ఏండ్ల తరువాత 'అంతర్జాతీయ కార్మిక సంస్థ' పాలక మండలి అధ్యక్ష పదవి చేపట్టిన భారతదేశం
Posted On:
23 OCT 2020 3:54PM by PIB Hyderabad
భారతదేశం 35 ఏండ్ల తరువాత 'అంతర్జాతీయ కార్మిక సంస్థ' (ఐఎల్ఓ) పాలక మండలి అధ్యక్ష పదవిని చేపట్టింది. ఈ పరిణామం భారత్, ఐఎల్ఓల మధ్య వంద సంవత్సరాల ఉత్పాదక సంబంధంలో కొత్త అధ్యాయాన్ని సూచిస్తుంది. అక్టోబర్ 2020- జూన్ 2021 మధ్య కాలానికి అంతర్జాతీయ లేబర్ ఆర్గనైజేషన్ పాలక మండలి ఛైర్‌పర్సన్‌గా కార్మిక, ఉపాధిశాఖ కార్యదర్శి శ్రీ అపుర్వ చంద్ర ఎన్నికయ్యారు. ఐఎల్‌ఓ పాలకమండలి ఛైర్‌పర్సన్‌కు అంతర్జాతీయంగా తగిన గుర్తింపు ఉంటుంది. పాలకమండలి (జీబీ) అనేది ఐఎల్‌ఓ యొక్క అత్యున్నత కార్యనిర్వాహక సంస్థ. ఇది విధానాలను, కార్యక్రమాలను, ఎజెండాను, బడ్జెట్‌ను నిర్ణయిస్తుంది. డైరెక్టర్ జనరల్‌ను ఎన్నుకుంటుంది. ప్రస్తుతం ఐఎల్‌ఓలో 187 మంది సభ్యులు ఉన్నారు. ఈ ఏడాది నవంబర్‌లో జరగబోయే పాలకమండలి సమావేశానికి శ్రీ అపుర్వ చంద్ర అధ్యక్షత వహించనున్నారు. జెనీవాలో, సభ్య దేశాల సీనియర్ అధికారులు, సామాజిక భాగస్వాములతో సంభాషించే అవకాశం ఆయనకు కలుగనుంది. కార్మిక మార్కెట్ యొక్క కాఠిన్యములను తొలగించడంలో ప్రభుత్వం తీసుకున్న పరివర్తన కార్యక్రమాలలో పాల్గొనే వారి మూల్యాంకణకు గాను ఇది ఒక వేదికను అందిస్తుంది. దీనికి తోడు.. వ్యవస్థీకృత, అసంఘటిత రంగంలో ఉన్నా కార్మికులందరికీ సామాజిక భద్రత యొక్క విశ్వీకరణ గురించి దాని ఉద్దేశాన్ని కూడా స్పష్టం చేస్తుంది. శ్రీ అపుర్వ చంద్ర, 1988 బ్యాచ్‌కు చెందిన 'ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్'కు (ఐఏఎస్) చెందిన అధికారి.

శ్రీ అపుర్వ చంద్ర మహారాష్ట్ర క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. శ్రీ చంద్ర భారత ప్రభుత్వంలోని పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖలో ఏడు సంవత్సరాలకు పైగా తన సేవలనందించారు. శ్రీ అపుర్వ చంద్ర, మహారాష్ట్ర ప్రభుత్వంలో 2013- 2017 మధ్య నాలుగు సంవత్సరాలు ప్రిన్సిపల్ సెక్రటరీ (పరిశ్రమలు) గా పనిచేశారు. శ్రీ అపుర్వ చంద్ర 01.12.2017 నుంచి రక్షణ మంత్రిత్వ శాఖలో డైరెక్టర్ జనరల్‌గా (కొనుగోళ్లు) చేరారు. సముపార్జన ప్రక్రియ వేగవంతం చేయడం ద్వారా భారత సాయుధ దళాలను బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో ఆయన పని చేశారు. రక్షణ రంగంలో కొనుగోళ్లకు సంబంధించి కొత్త విధానాల్ని రూపొందించడానికి ఏర్పాటైన కమిటీకి శ్రీ అపుర్వ చంద్ర అధ్యక్షత వహించారు. ఈ 'డిఫెన్స్ అక్విజిషన్ ప్రొసీజర్ 2020' శ్రీ అపుర్వ చంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా చేరిన రోజు (అక్టోబర్ 1, 2020) నుండి అమల్లోకి వచ్చింది.
******
(Release ID: 1667189)
Read this release in:
Punjabi
,
Tamil
,
Malayalam
,
Bengali
,
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Odia