రాష్ట్రపతి సచివాలయం
దుర్గాదేవి పూజ సందర్భంగా ప్రజలకు రాష్ట్రపతి శుభాకాంక్షలు
Posted On:
23 OCT 2020 5:12PM by PIB Hyderabad
దుర్గాదేవి పూజ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ, భారత జాతికి రాష్ట్రపతి శ్రీ రామ్నాథ్ కోవింద్ సందేశం ఇచ్చారు.
"దేశంలో, విదేశాల్లో ఉన్న భారతీయులందరికీ శుభకరమైన దుర్గాదేవి పూజ సందర్భంగా శుభాకాంక్షలు. ప్రాచీనమైన దుర్గామాత పూజను దేశమంతటా జరుపుకుంటాం. ముఖ్యంగా ఉత్తరాదిన 10 రోజులపాటు నిర్వహిస్తాం. శక్తినిచ్చే దేవతగా దుర్గను, జ్ఞాన ప్రదాయినిగా సరస్వతిని, సిరులు కురిపించే తల్లిగా లక్ష్మిని పండుగ రోజుల్లో ఆరాధిస్తాం. మహిళలను గౌరవించే మన సంప్రదాయం ఈ పండుగలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. మాతృశక్తిని గౌరవించడానికి, సాధికారం చేయడానికి ఈ పండుగ సందర్భంగా మనమంతా గట్టి నిర్ణయం తీసుకుందాం".
"దుష్టశక్తితో పోరాటంలో దేవతలందరి శక్తులను దుర్గామాత ప్రయోగించినట్లు నమ్ముతాం. మనమంతా ఒక్కటై నిలబడితే ఎలాంటి సంక్షోభాన్నైనా ఎదుర్కొనవచ్చని ఇది తెలియజేస్తుంది".
రాష్ట్రపతి హిందీ సందేశం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
***
(Release ID: 1667097)
Visitor Counter : 119
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Malayalam