సాంస్కృతిక మంత్రిత్వ శాఖ

"లైఫ్ ఇన్ మినియేచర్" ప్రాజెక్టును వర్చువల్ విధానంలో ప్రారంభించిన కేంద్ర సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్

ఢిల్లీలోని నేషనల్ మ్యూజియం మరియు గూగుల్ ఆర్ట్స్ అండ్ కల్చర్ భాగస్వామ్యంతో "లైఫ్ ఇన్ మినియేచర్" కార్యక్రమం

ఢిల్లీలోని నేషనల్ మ్యూజియంలో వందల సంఖ్యలో ఉన్న చిత్రాలను "లైఫ్ ఇన్ మినియేచర్" ప్రాజెక్ట్ ద్వారా ప్రపంచంలో ఎక్కడినుండైనా చూడవచ్చు: శ్రీ పటేల్

నేషనల్ మ్యూజియంలో ప్రసిద్ధి చెందిన సూక్ష్మ సేకరణలను గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఇక్కడ క్లిక్‌ చేసి చూడవచ్చు: g.co/LifeInMiniature

Posted On: 22 OCT 2020 4:03PM by PIB Hyderabad

నేషనల్ మ్యూజియం-న్యూఢిల్లీ,  సాంస్కృతిక మంత్రిత్వ శాఖ మరియు గూగుల్ ఆర్ట్స్ అండ్ కల్చర్‌ సంయుక్తంగా చేపట్టిన 'లైఫ్ ఇన్ మినియేచర్' ప్రాజెక్టును కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి  శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్ వర్చువల్ విధానంలో నేడు ప్రారంభించారు.

ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్ మాట్లాడుతూ'' భారతదేశ వారసత్వాన్ని పరిరక్షించుకోవడంలో ప్రధాని మోదీ చేపట్టిన డిజిటల్ ఇండియా కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. సాంకేతిక రంగంలో గూగుల్ నాయకత్వ చొరవ మరియు కొత్త ఆవిష్కరణల సృష్టికి ఆ సంస్థ చేస్తోన్న ప్రయత్నాలను కేంద్రమంత్రి ప్రశంసించారు. గూగుల్ నిబద్ధత, సామాజిక సాధికారత భారతదేశానికి నిజమైన ఆస్తి అని పేర్కొన్నారు.

'లైఫ్ ఇన్ మినియేచర్' ప్రాజెక్ట్ ద్వారా నేటినుండి న్యూఢిల్లీలోని నేషనల్ మ్యూజియంలో ఉన్న అనేక వందల సూక్ష్మ చిత్రాలను గూగుల్ ఆర్ట్స్&కల్చర్‌ విభాగంలో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు చూడవచ్చని కేంద్రమంత్రి తెలిపారు. ఈ ప్రత్యేకమైన కళాకృతులను ప్రదర్శించడానికి  మెషిన్ లెర్నింగ్, ఆగ్మెంటెడ్ రియాలిటీ మరియు హై-డెఫినిషన్ రోబోటిక్ కెమెరాలు వంటి డిజిటలైజేషన్ సాంకేతికతలను గూగుల్ సంస్థ  ఈ ప్రాజెక్ట్‌లో ఉపయోగించిందని చెప్పారు.

గూగుల్ ఆర్ట్స్ & కల్చర్ యాప్‌ ద్వారా వీక్షకులు ఆగ్మెంటెడ్ రియాలిటీ విధానంలో సాంప్రదాయ భారతీయ నిర్మాణంతో రూపొందించిన మొట్టమొదటి ఆర్ట్ గ్యాలరీని ఆన్‌లైన్‌లో అస్వాదించవచ్చు. ఆర్ట్‌ గ్యాలరీలోని కళాకృతులను వాస్తవంగా చూస్తున్న అనుభూతితో పాటు అక్కడ నడుస్తున్న అనుభవాన్ని పొందవచ్చు. ఇక్కడ ప్రదర్శనకు ఉంచిన కళాకృతులు ప్రకృతితో మానవుని అనుబంధం, ప్రేమ, వేడుక, విశ్వాసం మరియు శక్తి అనే ఐదు ఇతివృత్తాలతో రూపుదిద్దుకున్నాయి.

'లైఫ్ ఇన్ మినియేచర్' ప్రాజెక్ట్‌ లో మరో ముఖ్యమైన ఆంశం ఏంటంటే..ఈ ఆన్‌లైన్‌లో ఉంచే కళాకృతుల ప్రదర్శనలో మెషిన్ లెర్నింగ్ ఆధారిత అల్గారిథంలను అభివృద్ధి చేయడం. తద్వారా కృత్రిమ మేథ సహాయంతో వీక్షకులు ఈ సూక్ష్మ అద్భుతాలను ఆస్వాదించవచ్చు. ఒక సూక్ష్మ చిత్రలేఖనం చూడడం వీక్షకులు అరుదైన ఆనందం పొందితే ఆ అనుభవాన్ని 'మాగ్నిఫై మినియేచర్స్' అని పిలుస్తారు. ఈ విధానంలో వీక్షకులు ఒకేసారి బహుళ కళాకృతులను ఏకకాలంలో అన్వేషించడానికి వీలవుతుంది.

'లైఫ్ ఇన్ మినియేచర్'తో వీక్షకులు గతంలో ఎప్పుడూ చూడని రామాయణం, రాయల్ సాగా, పహారీ స్టైల్ వంటి ప్రసిద్ధ కళాఖండాలను అసాధారణ స్పష్టతతో చూడవచ్చు. ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా ఆ అద్భుతాన్ని అనుభవించవచ్చు g.co/LifeInMiniature ;

ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కోసం నేషనల్ మ్యూజియం, గూగుల్ ఆర్ట్స్ అండ్ మ్యూజియంలు  2011లో భాగస్వాములయ్యాయి. గూగుల్ బ్లాగ్ స్పాట్‌లో మరింత సమాచారం పొందవచ్చు.
 
ది నేషనల్ మ్యూజియం, ఢిల్లీ:
భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహింపపడుతున్న నేషనల్ మ్యూజియం దేశంలోనే ప్రముఖ సంస్కృతిక సంస్థ. ఇందులో సుమారు 2 లక్షలకు పైగా  పురాతన వస్తువులు, కళా సంపదలు ఉన్నాయి. భారతదేశంతో పాటు విదేశీ సంస్కృతులకు సంబంధించిన 5వేళ ఏళ్లనాటి సంస్కృతిక సంపద ఇందులో ఉంది. ప్రస్తుతం కరోనా మహమ్మారి నేపథ్యంలో డిజిటల్ ఫ్లాట్ ద్వారా సందర్శకులను ఈ మ్యూజియం అలరిస్తోంది.
 
గూగుల్ ఆర్ట్స్ & కల్చర్:
ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఉన్న  2 వేలకు పైగా మ్యూజియంలలోని చిత్రాలను, కళఖండాలను గూగుల్ ఆర్ట్స్ అండ్ కల్చర్ సేకరించింది. కేవలం చేతివేళ్ల దూరంలో వీటిని ఆన్‌లైన్‌ దర్శించవచ్చు. కళ, చరిత్ర మరియు ప్రపంచంలోని అద్భుతాలను అన్వేషించడానికి ఇది ఒక అద్భుతమైన మార్గం. గూగుల్ ఆర్ట్స్ & కల్చర్ యాప్ అండ్రాయిడ్ మరియు ఆపిల్ స్టోర్ లో ఉచితంగా అందుబాటులో ఉంది.

***



(Release ID: 1667011) Visitor Counter : 176