వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2020-21 కింద కనీస మద్దతు ధర కార్యకలాపాలు
పంజాబ్, హర్యానా, యుపి, తమిళనాడు, ఉత్తరాఖండ్, చండీగఢ్, జమ్ము, కాశ్మీర్ కేరళ రాష్ట్రాలలో సాఫీగా సాగుతున్న ఖరీఫ్ 2020-21 వరి సేకరణ; లబ్ధి పొందిన సుమారు 10.09 లక్షల మంది రైతులకు
Posted On:
22 OCT 2020 5:19PM by PIB Hyderabad
ప్రస్తుత కనీస మద్దతు ధరకు అనుగుణంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలైన పంజాబ్, హర్యానా, యుపి, తమిళనాడు, ఉత్తరాఖండ్, చండీగఢ్, జమ్ము,కాశ్మీర్ కేరళ రైతుల నుంచి ఖరీఫ్ 2020-21కు గాను ప్రభుత్వం 116.6 లక్షల మెట్రిక్ టన్నుల వరిని 21.10.2020 వరకు కొనుగోలు చేసింది. గత ఏడాది కొనుగోళ్ళతో పోలిస్తే 28.55% అంటే 90.76 లక్షల మెట్రిక్ టన్నులు ఎక్కువగా కొనుగోలు జరిగింది. మొత్తం 116.66 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోళ్ళలో ఒక్క పంజాబ్ రాష్ట్రమే 75.11 లక్షల మెట్రిక్ టన్నుల అంటే మొత్తం సేకరణలో 64.38% దోహదం చేసింది. సుమారు 10.09 లక్షల రైతులు ఇప్పటికే కొనసాగుతున్న కెఎంఎస్ సేకరణ కార్యకలాపాలతో లబ్ధి పొందారు. ఒక మెట్రిక్ టన్ను రూ. 18880 కనీస మద్దతు ధర చొప్పున మొత్తం రూ. 22026.26 కోట్ల మేరకు రైతులు లబ్ది పొందారు.
రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతిపాదన ఆధారంగా తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, గుజరాత్, హర్యానా, ఉత్తర్ ప్రదేశ్, ఒడిషా, రాజస్థాన్, ఆంధ్ర ప్రదేశ్‌ల నుంచి పప్పుధాన్యాలు, నూనె విత్తనాలను ధర మద్దతు పథకం కింద 45.24 లక్షల మెట్రిక టన్నుల వరకు ధర మద్దతు పథకం (Price Support Scheme (PSS) ) కింద సేకరించేందుకు అనుమతి ఇవ్వడం జరిగింది. అదనంగా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ నుంచి 1.23 లక్షల మెట్రిక్ టన్నుల కొబ్బరిని సేకరించేందుకు అనుమతి మంజూరు చేశారు. ఇతర రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలకు పప్పు ధాన్యాలు, నూనె విత్తనాలు, కొబ్బరిని ధర మద్దతు పథకం కింద సేకరించాలన్న ప్రతిపాదనకు అనుమతిని ఇవ్వనున్నారు. తద్వారా 2020-21 సంవత్సరానికి ప్రకటించిన కనీస మద్దతు ధరల కింద ఈ పంటల నాణ్యత వర్గీకరణను చేయవచ్చు. అలాగే, ఒకవేళ ఆయా రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలలో కనీస మద్దతు ధర మార్కెట్ ధరకన్నా తక్కువగా ఉంటే, నేరుగా నమోదు చేసుకున్న రైతుల నుంచి రాష్ట్రం నామినేట్ చేసిన ఏజెన్సీల ద్వారా కేంద్ర నోడల్ ఏజెన్సీలు చేస్తాయి.
ప్రభుత్వం తన నోడెల్ ఏజెన్సీల ద్వారా 20.10.2020 వరకు తమిళనాడు, మహారాష్ట్ర, హర్యాణాలకు చెందిన 862మంది రైతులకు లబ్ధి చేకూరుస్తూ రూ. 6.36 కోట్ల విలువైన 883.34 మెట్రిక్ టన్నుల పెసరపప్పు, మినపప్పును కొనుగోలు చేసింది. అలాగే, కర్ణాటక, తమిళనాడులో 3691 మంది రైతులకు లబ్ది చేకూరుస్తూ రూ. 52.40 కోట్ల మేరకు కనీస మద్దతు ధరతో 5089 మెట్రిక్ తన్నుల కొబ్బరిని కొనుగోలు చేయడం జరిగింది. కొబ్బరి, పెసరపప్పు అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రాలలో మార్కెట్ ధరలు కనీస మద్దతు ధరలకన్నా ఎక్కువగా ఉన్నాయి. ఆయా రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంత ప్రబుత్వాలు ఖరీఫ్ పప్పు ధాన్యాలు, నూనె విత్తనాలను నిర్ణయించిన తేదీ నుంచి సేకరించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాయి.
కనీస మద్దతు ధర కింద పత్తి సేకరణ కార్యకలాపాలు పంజాబ్, హర్యానా, రాజస్థాన్, మధ్య ప్రదేశ్‌లలో సాఫీగా కొనసాగుతున్నాయి. సుమారు 53181 రైతులకు లబ్ధి చేకూరుస్తూ రూ. 76821.02 లక్షల విలువైన 272136 పత్తి బేళ్ళను 21.10.2020 వరకు సేకరించడం జరిగింది.
****
(Release ID: 1666867)
Visitor Counter : 141