రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ

దేశంలోనే మొట్టమొదటి మల్టీ-మోడల్ లాజిస్టిక్ పార్క్‌కు అస్సాంలో శ్రీ నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేశారు

రూ .693.97 కోట్ల వ్యయంతో చేపట్టిన పార్కు ద్వారా వాయు, రహదారి, రైలు, జలమార్గాల అనుసంధానం లభిస్తుంది

ఈ ప్రాజెక్టు వల్ల రాష్ట్రంలోని దాదాపు 20 లక్షల మంది యువతకు ప్రత్యక్ష లేదా పరోక్షంగా ఉపాధి లభిస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

Posted On: 20 OCT 2020 3:08PM by PIB Hyderabad

కేంద్ర రోడ్డు రవాణా, రహదారులు మరియు ఎంఎస్‌ఎంఈల మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ ఈ రోజు అస్సాంలోని జోగిగోపాలో దేశంలోనే మొట్టమొదటి మల్టీ-మోడల్ లాజిస్టిక్ పార్కుకు శంకుస్థాపన చేశారు. 693.97 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్ ద్వారా స్థానికులకు రైలు, రోడ్డు, వాయు, జలమార్గాల అనుసంధానం కల్పిస్తుందని చెప్పారు. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ మాల పరియోజన పథకం కింద ఈ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేస్తున్నారు. వర్చువల్‌ ద్వారా నిర్వహించిన ఈ సదస్సుకు ముఖ్యమంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో  కేంద్ర  మంత్రులు డాక్టర్ జితేంద్ర సింగ్, జనరల్ (రిటైర్డ్) డాక్టర్ వి కె సింగ్, శ్రీ రామేశ్వర్ తేలి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అస్సాం రాష్ట్రానికి చెందిన మంత్రులు, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు, కేంద్రం, రాష్ట్రానికి చెందిన సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

అస్సాంలోని దేశంలోని మొట్టమొదటి మల్టీ-మోడల్ లాజిస్టిక్ పార్కుకు శంకుస్థాపన చేస్తున్న విఐపీలు

యూట్యూబ్ లింక్: https://youtu.be/SyEWc6TKOu0
ఇక్కడి నుండి వీడియో క్లిప్‌ను చూడవచ్చు: https://twitter.com/nitin_gadkari/status/1318438677882699778?s=20

జోగిగోఫాలో లాజిస్టిక్ పార్కు ఏర్పాటుపై అస్సాం ప్రభుత్వం, ఎన్‌హెచ్‌ఐడిసిఎల్ మరియు అశోక పేపర్ మిల్లుల మధ్య భూ వినియోగంపై అవగాహన ఒప్పందం కుదిరింది.

అస్సాం ప్రభుత్వం, ఎన్‌హెచ్‌ఐడిసిఎల్ మరియు అశోక పేపర్ మిల్స్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.

ఈ సందర్భంగా శ్రీ నితిన్ గడ్కరీ మాట్లాడుతూ దేశంలో 35 మల్టీ-మోడల్ లాజిస్టిక్ పార్కులను (ఎంఎంఎల్‌పి) అభివృద్ధి చేయాలని తమ మంత్రిత్వ శాఖ సంకల్పించిందని వాటికి సంబంధించిన డిపిఆర్, సాధ్యాసాధ్య నివేదికను తయారుచేసే పనులు ప్రస్తుతం జరుగుతున్నాయని చెప్పారు. ఈ ఎంఎంఎల్‌పిలందరికీ ఎస్‌పివిలు ఏర్పాటు చేస్తామని వాటన్నీంటికి అనుభవం,నైపుణ్యం, అర్హత  ఉన్న వారిని  సిఇఓలను నియమిస్తామని చెప్పారు. అందులో భాగంగా మొదటి ఎంఎంఎల్పీ అస్సాంలోని జోగిగోపాలో ఎన్ హెచ్ఐడీసీఎల్ ఏర్పాటు చేస్తోందని చెప్పారు. ఇది రహదారి, రైలు, వాయు మరియు జలమార్గాలకు అనుసంధానించబడుతుంది. బ్రహ్మపుత్ర వెంట 317 ఎకరాల భూమిలో దీనిని అభివృద్ధి చేస్తున్నారు. మొదటి దశ నిర్మాణం 2023 నాటికి పూర్తవుతుందని  శ్రీ గడ్కరీ తెలిపారు. ప్రాజెక్టు కోసం 280 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిందని అందులో రహదారి నిర్మాణానికి రూ .171 కోట్లు, పార్క్‌నిర్మాణం కోసం రూ .87 కోట్లు, రైల్ లైన్ కోసం రూ .23 కోట్లు కేటాయించినట్టు చెప్పారు. దీనికి సంబంధించిన పనులు వచ్చే నెలలో  ప్రారంభమవుతాయన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల రాష్ట్రంలోని దాదాపు 20 లక్షల మంది యువతకు ప్రత్యక్ష లేదా పరోక్ష ఉపాధి లభిస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.


జోగిగోఫా, గౌహతి మధ్య 154 కిలోమీటర్ల దూరం 4 వరుసల రోడ్లతో అనుసంధానింపపడుతుందని అలాగే 3 కిలోమీటర్ల రైలు మార్గం జోగిగోపా స్టేషన్‌ను ఎంఎంఎల్‌పికి అనుసంధానిస్తుందని, మరో 3 కిలోమీటర్ల రైలు లింక్‌ను అనుసంధానిస్తుందని మంత్రి తెలిపారు. కొత్తగా అభివృద్ధి చెస్తున్న రుప్సీ విమానాశ్రయాన్ని కనెక్ట్ చేసేందుకు నాలుగు లైన్ల రోడ్డును అభివృద్ధి చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. ఈ మల్టీ-మోడల్ లాజిస్టిక్ పార్కులో గిడ్డంగి, రైల్వే సైడింగ్, కోల్డ్ స్టోరేజ్, కస్టమ్ క్లియరెన్స్ హౌస్, యార్డ్ సౌకర్యం, వర్క్‌షాప్‌లు, పెట్రోల్ పంపులు, ట్రక్ పార్కింగ్, అడ్మినిస్ట్రేటివ్ భవనం, బోర్డింగ్ రూమ్ లు, పలహారశాలలు నీటి శుద్ధి కర్మాగారం వంటి అన్ని సౌకర్యాలు ఉంటాయి.

నాగ్‌పూర్‌లోని వార్ధ డ్రై పోర్టు ప్రాంతంలో  346 ఎకరాల విస్తీర్ణంలో మల్టీ-మోడల్ లాజిస్టిక్ పార్కు ఏర్పాటుకు ప్రాథమిక నివేదికతో పాటు మాస్టర్ ప్లాన్ సిద్ధంగా ఉందని శ్రీ గడ్కరీ తెలియజేశారు. అలాగే బెంగళూరు ఎంఎంఎల్‌పి, పంజాబ్, సూరత్, ముంబై, ఇండోర్, పాట్నా, హైదరాబాద్, విజయవాడ, మరియు కోయంబత్తూర్‌లోని సంగ్రూర్ గిడ్డంగి కాంప్లెక్స్ కోసం సాధికారిత నివేదికలు సిద్ధం చేస్తున్నారని వెల్లడించారు. చెన్నై ఓడరేవు సమీపంలో మల్టీ-మోడల్ లాజిస్టిక్ పార్కు ఏర్పాటు కోసం డీపీఆర్ తయారవుతోందని పూణే మరియు లుధియానాలో ఎంఎంఎల్‌పీ కోసం అధ్యయనాలు ప్రారంభమయ్యాయి. అహ్మదాబాద్, రాజ్‌కోట్, కాండ్ల, వడోదర, లూధియానా, అమృత్‌సార్,జలందర్, భటిండా, హిస్సార్, అంబాలా, కోట, జైపూర్, జగత్‌సింగ్‌పూర్, సుందర్‌నగర్‌,ఢిల్లీ, కోల్‌కతా, పూణే, నాసిక్, పనాజీ, భోపాల్, రాయ్‌పూర్, మరియు జమ్మూలో 22 ఎంఎంఎల్‌పిలను ప్రతిపాదించారు.

ఈ రోజు అస్సాంలోని దేశంలోనే మొట్ట మొట్టమొదటి మల్టీ-మోడల్ లాజిస్టిక్ పార్కుకు శంకుస్థాపన చేసిన కార్యక్రమంలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారులు మరియు ఎంఎస్‌ఎంఇల మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ ప్రసంగించారు.

అస్సాంలో 80,000 కోట్ల రూపాయల విలువైన జాతీయ రహదారి పనుల కోసం తమ మంత్రిత్వ శాఖ ప్రణాళికలు సిద్ధంచేస్తోందని మంత్రి తెలిపారు.రూ 3,545 కోట్లతో చేపట్టిన 575 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారులు ఈ ఆర్ధిక సంవత్సరం చివరినాటికి పూర్తవుతాయని చెప్పారు. వచ్చే ఏడాది నాటికి రాష్ట్రానికి రూ .15 వేల విలువైన జాతీయ రహదారులు కేటాయించగా రూ .21 వేల కోట్ల విలువైన పనుల కోసం డిపిఆర్‌లు పూర్తవుతున్నాయని తెలియజేశారు. సిఆర్‌ఐఎఫ్ పథకం కింద రూ .610 కోట్ల వ్యయంతో 203 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారులను 2020-21 కి ఆమోదించామని ఆయన చెప్పారు. రాష్ట్రానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేల నుంచి వస్తున్న రోడ్డు ప్రతిపాదనలను ఆమోదిస్తున్నామని మంత్రి ప్రకటించారు.

అస్సాంలోని జాతీయ రహదారులపై మొత్తం 12 చోట్ల ప్రమాదకరమైన ప్రదేశాలను గుర్తించామని వాటిలో మూడింటిని  తాత్కాలికంగా సరిచేశామని 2023 నాటికి అన్ని ప్రమాదక ప్రదేశాలను సరిచేస్తామని వివరించారు.

ఈశాన్య ప్రాంత అభివృద్ధి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ చేస్తున్న కృషిని కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ధి మరియు ప్రధాన మంత్రి కార్యాలయానికి రాష్ట్ర మంత్రి, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పెన్షన్లు, అణు ఇంధన శాఖ, అంతరిక్ష శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రశంసించారు. శ్రీ గడ్కరీ చేసిన కృషి వల్లనే ఈ రోజు మనకు ఈ ప్రాంతంలో విస్తృతమైన రోడ్ల నెట్‌వర్క్ ఉందని ఆయన తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల్లో జలరవాణా మార్గాలను గడ్కరీ ప్రారంభించారని ప్రస్తుతం ఈ ప్రాంతంలో 10 కి పైగా జలమార్గాలు అభివృద్ధి చేయబడుతున్నాయని వివరించారు. సరుకు రవాణా వ్యయాన్ని ఇది నాలుగోవంతు తగ్గిస్తుందన్నారు. ప్రత్యేక రహదారి అభివృద్ధి పథకాల ద్వారా దెబ్బతిన్న మురియు వదిలివేసిన రహదారులను శ్రీగడ్కరీ అభివృద్ధి చేశారని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. తక్కువ ఖర్చుతో కూడుకున్న ఈ విధానంతో వ్యాపారులు, వర్తకులకు ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేశారు. సరిహద్దుల్లో ముఖ్యంగా తూర్పు ప్రాంతంలో వాణిజ్యం అభివృద్ధి చెందడానికి ఈ విధానం ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ఎంఎంఎల్‌పి సరికొత్త ఆలోచన అని  త్వరలోనే ఇవి ఇతర రాష్ట్రాల్లో కార్యరూపం దాలుస్తాయని చెప్పారు.అనేక ప్రత్యేకమైన మరియు వినూత్నమైన మెగా ప్రాజెక్టుల కారణంగా, దేశంలో అభివృద్ధికి ఈశాన్యప్రాంతం ఒక నమూనాగా అవతరించిందని  అదేవిధంగా ఈ ప్రాంతంలో రోడ్లు మెరుగుపడ్డాయని వివరించారు.

ఈ రోజు అస్సాంలో దేశంలోనే  మొట్టమొదటి మల్టీ-మోడల్ లాజిస్టిక్ పార్కుకు శంకుస్థాపన చేసిన కార్యక్రమంలో కేంద్రమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రసంగించారు.

ముఖ్యమంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్, కేంద్ర ఆర్‌టిహెచ్ జనరల్ (రిటైర్డ్) డాక్టర్ వికె సింగ్, ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రి శ్రీ రామేశ్వర్ తేలి, రాష్ట్ర మంత్రులు డాక్టర్ హిమంత బిస్వా శర్మ, శ్రీ చంద్ర మోహన్ పోత్వారీ, మరియు శ్రీ ఫాని భూషణ్ చౌదరిలు కార్యక్రమంలో ప్రసంగించారు.

ఈ రోజు అస్సాంలో దేశంలోనే మొట్టమొదటి మల్టీ-మోడల్ లాజిస్టిక్ పార్కుకు శంకుస్థాపన చేసిన కార్యక్రమంలో అస్సాం ముఖ్యమంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ ప్రసంగించారు.

***



(Release ID: 1666282) Visitor Counter : 185