రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
దేశంలోనే తొలి బహుళ నమూనా లాజిస్టిక్ పార్కుకు మంగళవారం అసోంలో శంకుస్థాపన చేయనున్న శ్రీ గడ్కరీ
प्रविष्टि तिथि:
19 OCT 2020 6:02PM by PIB Hyderabad
కేంద్ర రహదారి రవాణా, హైవేల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ, దేశంలోనే తొలిసారిగా అసోంలో నిర్మించనున్న బహుళ నమూనా లాజిస్టిక్ పార్కుకు శంకుస్థాపన చేయనున్నారు. మంగళవారం, వర్చువల్ పద్ధతిలో ఈ కార్యక్రమం ఉంటుంది. అసోం ముఖ్యమంత్రి శ్రీ శరబానంద సోనోవాల్ శంకుస్థాపన కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తారు. కేంద్ర సహాయ మంత్రులు డా.జితేంద్ర సింగ్, డా.వి.కె.సింగ్, శ్రీ రామేశ్వర్ తెలి, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సీనియర్ అధికారులు పాల్గొంటారు.
రూ.693.97 కోట్ల విలువైన ఈ పార్కుతో, వాయు, రహదారి, రైల్వే, జల మార్గాల అనుసంధానం ద్వారా ప్రజలకు ప్రయోజనం కలుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్‌మాల పరియోజన కింద ఈ పార్కును ఏర్పాటు చేస్తున్నారు.
(रिलीज़ आईडी: 1665896)
आगंतुक पटल : 161