సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
ఎంఎస్ఎంఇ ఎగుమతి ప్రోత్సాహక మండలి అనధికారిక, దురుద్దేశపూరిత చర్యలపై ప్రజలను హెచ్చరించిన ఎంఎస్ఎంఇ మంత్రిత్వ శాఖ
ఎంఎస్ఎంఇ మంత్రిత్వ శాఖ అనుబంధ విభాగం పేరుతో ఆ సంస్థ నిర్వహిస్తున్న తప్పుడు కార్యకలాపాల పట్ల మంత్రిత్వ శాఖ తీవ్ర అభ్యంతరం
ఆ విభాగం జారీ చేసే నియామక పత్రాల్లో తన పాత్ర గాని, అధికారిక గుర్తింపు గాని లేవని స్పష్టీకరణ
Posted On:
17 OCT 2020 9:41AM by PIB Hyderabad
ఎంఎస్ఎంఇ ఎగుమతుల ప్రోత్సాహక మండలి డైరెక్టర్ పోస్ట్ భర్తీకి నియామక పత్రం జారీ చేసిందని కొన్ని పత్రికలు, సామాజిక మాధ్యమాల్లో వార్త ప్రచురితమయిందన్న విషయం తన దృష్టికి వచ్చినట్టు ఎంఎస్ఎంఇ మంత్రిత్వ శాఖ తెలియచేసింది. ఎంఎస్ఎంఇ మంత్రిత్వ శాఖ పేరును కూడా ఆ సంస్థ ఉపయోగించుకుంటున్నట్టు తెలిసిందని పేర్కొంది.
భారతప్రభుత్వ ఎంఎస్ఎంఇ మంత్రిత్వ శాఖకు ఎంఎస్ఎంఇ ఎగుమతుల ప్రోత్సాహక మండలితో ఎలాంటి సంబంధం లేదని ధ్రువీకరిస్తున్నట్టు ఆ ప్రకటనలో తెలిపింది. మండలికి సంబంధించిన నియామకాలు, పోస్టులు, పోస్టింగ్ లకు తమ శాఖ గుర్తింపు లేదని తెలియచేసింది. అలాంటి ప్రకటనలు, వర్గాల వలలో పడొద్దని ప్రజలకు ఇందుమూలంగా తెలియచేస్తున్నట్టు తెలిపింది.
***
(Release ID: 1665402)
Visitor Counter : 226