జల శక్తి మంత్రిత్వ శాఖ
అరుణాచల్ ప్రదేశ్‌లోని మారుమూల నివాసాలకు జలజీవన్ మిషన్ కింద కుళాయి నీటి సరఫరా
Posted On:
14 OCT 2020 4:51PM by PIB Hyderabad
అరుణాచల్ ప్రదేశ్ లో పశ్చిమ కామెంగ్ జిల్లాలో భారతదేశం, భూటాన్ మధ్య అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలో ఉన్న ఓ చిన్న గ్రామం బ్రోక్‌సర్‌త్సంగ్. సమద్రమట్టానికి 2,900 ఎత్తులో ఈ గ్రామం ఉంది. 22 నివాసాలు ఉన్న ఈ గ్రామ ప్రస్తుత 170 మంది. వీరంతా 'బ్రోక్పా' వర్గానికి చెందినవారు. వీరంతా పశువులను మేపుకుంటూ సంచార జీవనాన్ని గడుపుతారు. జిల్లా ప్రధాన కేంద్రమైన బోమ్డిలా ఈ గ్రామానికి సుమారు 76 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ గ్రామానికి 36 కిలోమీటర్ల దూరంలో సమీప పట్టణమైన దిరాంగ్ ఉంది.
2019 వరకూ ఈ గ్రామస్తులు తాగునీటి సరఫరా కొరతను ఎదుర్కొన్నారు. అయితే జల్ జీవన్ మిషన్ (జెజెఎం) కింద 2020లో రాష్ట్రంలోని పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ విభాగం ఈ గ్రామంలోని అన్ని గృహాలకు రక్షితమంచినీటి సరఫరాను ప్రారంభించింది. గురుత్వాకర్షణ శక్తి ఆధారంగా 67 లక్షల రూపాయల అంచనా వ్యయంతో ఈ సురక్షిత తాగునీటి సరఫరా వ్యవస్థను ఇక్కడి గ్రామస్తుల కోసం ఏర్పాటు చేశారు. తాగునీటిసరఫరా పథకం అమలు,నిర్వహణలో స్థానికులు సంఘటితంగా పాల్గొన్నారు. శ్రమదానంతో పాటు 5 శాతం భూమిని కూడా దీనికోసం గ్రామస్తులు అందించారు. ఈ పనుల్లో గ్రామ నీరు మరియు పారిశుద్ధ్య కమిటీ చురుకుగా పాల్గొంది. నీటి సరఫరా వ్యవస్థకు చెందిన ఓ అండ్ ఎమ్‌ను తమ పరిధిలోకి తీసుకునే పనిలో కమిటీ ఉంది. జల్ జీవన్ మిషన్ కింద చేపట్టిన ఈ కార్యక్రమంలో నీటి సరఫరా పథకాల ప్రణాళిక, అమలు, ఆపరేషన్ మరియు నిర్వహణలో స్థానికులు సంఘటితంగా పాల్గొన్నారు.
శీతాకాలంలో సున్నా ఉష్ణోగ్రతలు, వర్షాకాలంలో ఎడతెరిపిలేని వర్షాలు వంటి కఠినమైన వాతావరణ పరిస్థితులు ఉండే ఈ కఠిన ప్రాంతంలో సురక్షిత మంచినీటిని అందించడం అంత సులభమైన పనికాదు. నిర్మాణ భాగం అతి కష్టతరమైనది. ఇక్కడి కఠినమైన వాతావరణ పరిస్థితుల కారణంగా నిపుణులైన పనివారిని రప్పించడం మరియు విపరీతమైన చలికారణంగా వారితో పని చేయించడం కష్టంతో కూడుకున్నది. మంచునిండిన రహదారులు, భారీ పొగమంచుతో రోడ్లు కనిపించకపోవడం, తరచూ కొండచరియలు విరిగిపడడం వంటి పరిస్థితుల కారణంగా ఇక్కడి నిర్మాణం సాగించడం, ఆ పనులను పర్యవేక్షించడం కష్టతరమైనది. అయితే ఆ అడ్డంకులను అదిగమించి రూపకల్పన చేసిన ఈ పథకం విజయవంతంగా పూర్తయింది. దీంతో గ్రామస్తులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వారిలో ఆ సంతోషం కనిపిస్తోంది. వారి సంప్రదాయాలను అనుసరించి ప్రార్ధనలు చేసిన అనంతరం గ్రామస్తులు ఈ నీటిని స్వీకరించారు.
రాష్ట్రప్రభుత్వాల భాగస్వామ్యంతో 2024నాటికి దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లోని నివాసలన్నీంటికి సురక్షిత కుళాయి నీటిని అందించే లక్ష్యంతో 2019 ఆగస్టు 15 న ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ జల్ జీవన్ మిషన్ పథకాన్ని ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతంలోని ప్రతి ఇంటికీ రోజుకు 55 లీటర్ల తలసరి మంచినీటిని శాశ్వత ప్రాతిపదికిన అందించడం ద్వారా వారి జీవితాలను మెరుగుపర్చాలన్నదే ఈ పథకం యొక్క ముఖ్య ధ్యేయం.
కొండలు, గుట్టలు, పర్వతాలు, ఎత్తైన ప్రదేశాలు వంటి కఠినమైన భూభాగం ఉన్న ప్రాంతాల్లో జల్ జీవన్ మిషన్ అమలు చేయడం చాలా కష్టమైన పని. కఠినమైన వాతావరణ పరిస్థితులు, ఇతర ప్రాంతాలతో తక్కువ అనుసంధానం వంటి కారణాలతో పథకం అమలు క్లిష్టతరమవుతుంది. అలాగే స్థానికుల అలవాట్లు, నమ్మకాలను మార్చడంతో పాటు జీవనశైలిని మార్చుకోవడానికి వారిని ఒప్పించడం కూడా అంతే సవాలు. అయితే ఆ సవాళ్లను అదిగమిస్తూ సాగిన ఈ విజయ గాథ.. వీరి జీవితాల్లో వచ్చిన మార్పులు, ఇక్కడి వారి జీవితాల్లో ముఖ్యంగా మహిళలకు కేంద్ర ప్రభుత్వం కల్పించిన భరోసా స్పూర్తిదాయకం.
***
(Release ID: 1665212)
Visitor Counter : 106