ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కేరళ, కర్ణాటక, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, పశ్చిమబెంగాల్ కి ఉన్నత స్థాయి కేంద్ర బృందాలను పంపిన కేంద్రం

నియంత్రణ, నిఘా, పరీక్ష, సంక్రమణ నివారణ మరియు సమర్థవంతమైన క్లినికల్ మేనేజ్‌మెంట్‌ను బలోపేతం చేయడానికి

కేంద్ర బృందాలు సహాయపడతాయి

Posted On: 16 OCT 2020 11:34AM by PIB Hyderabad

ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కేరళ, కర్ణాటక, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ , పశ్చిమ బెంగాల్‌కు ఉన్నత స్థాయి కేంద్ర బృందాలను నియమించింది. ఈ రాష్ట్రాలు ఇటీవలి రోజుల్లో కొత్త కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు నివేదిస్తున్నాయి. ప్రతి బృందంలో ఒక సంయుక్త కార్యదర్శి (సంబంధిత రాష్ట్రానికి నోడల్ ఆఫీసర్), ప్రజారోగ్య అంశాలను చూసుకోవటానికి ఒక ప్రజారోగ్య నిపుణుడు, సంక్రమణ నివారణ పద్ధతులను, క్లినికల్ మేనేజ్‌మెంట్ ప్రోటోకాల్ రాష్ట్రం అనుసరిస్తోందా లేదా చూసుకోవటానికి ఒక వైద్యుడు సభ్యులుగా ఉంటారు. 

నియంత్రణ, నిఘా, పరీక్ష, సంక్రమణ నివారణ మరియు నియంత్రణ చర్యలు మరియు పాజిటివ్ కేసుల సమర్థవంతమైన క్లినికల్ నిర్వహణను బలోపేతం చేయడానికి రాష్ట్రం చేసే ప్రయత్నాలకు ఈ బృందాలు సహకరిస్తాయి. సకాలంలో రోగ నిర్ధారణకు సంబంధించిన సవాళ్లను సమర్థవంతంగా నిర్వహించడంలో కేంద్ర బృందాలు మార్గనిర్దేశం చేస్తాయి. కేరళలో మొత్తం కేసులు 3,17,929, ఇవి మొత్తం కేసులలో 4.3%. ఒక మిలియనుకు  8906 చొప్పున కేసులు నమోదవుతున్నాయి. మొత్తం కోలుకున్న కేసుల సంఖ్య 2,22,231 అంటే రికవరీ రేటు 69.90%. క్రియాశీల కేసులు 94,609 (మొత్తం జాతీయ సంఖ్యలో 11.8% ఉన్నాయి). రాష్ట్రంలో మొత్తం మరణాలు 1089, కేసు మరణాల రేటు 0.34% మరియు మిలియన్ జనాభాకి కి 31 చొప్పున మరణాలు  సంభవించాయి. కేరళ యొక్క టిపిఎం 53518 వద్ద ఉంది మరియు పాజిటివిటీ రేటు 16.6%.

కర్ణాటక మొత్తం కేసులు 7,43,848 ఉండగా, ఇది దేశవ్యాప్త సంఖ్యలో 10.1% గా నివేదిస్తోంది. ఒక మిలియన్ జనాభాకు 11,010 చొప్పున కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో 6,20,008 మంది రోగులు కోలుకున్నారు, ఫలితంగా రికవరీ రేటు 83.35% ఉంది. క్రియాశీల కేసులు 1,13,557 (జాతీయ సంఖ్యలో 14.1%). రాష్ట్రం మొత్తం 10,283 మరణాలు, 1.38% సిఎఫ్ఆర్ మరియు మిలియన్ జనాభాకు 152 మరణాలు నివేదించింది. ఒక మిలియన్ మందిలో 95674 మందికి పరీక్షలు జరుగుతుండగా,  పాజిటివిటీ రేట్ 11.5% వద్ద ఉంది.

రాజస్థాన్ మొత్తం కేసులు 1,67,279 (దేశంలో మొత్తం వాటా: 2.3%), ఒక మిలియన్‌కు 2,064 చొప్పున కేసులు ఉండగా, రికవరీ రేటు 86.07% తో 1,43,984 మొత్తం రికవరీలను నమోదు చేసింది. తేదీ నాటికి యాక్టివ్ కేసులు 21,587 (జాతీయ సంఖ్యలో 2.7% వాటా). రాష్ట్రంలో మరణాల సంఖ్య 1,708; మరణాల రేటు 1.02%; మరియు ఒక మిలియన్ కి మరణాలు 21 నమోదు అవుతున్నాయి. టిపిఎం 38,605, పాజిటివిటీ రేట్ 5.3% ఉంది. 

రాజస్థాన్ మొత్తం కేసులు 1,67,279 (మొత్తం% వాటా: 2.3%), మిలియన్‌కు 2,064 కేసులు మరియు రికవరీ రేటు 86.07% తో 1,43,984 మొత్తం రికవరీలను నమోదు చేసింది. తాజా పరిస్థితి ప్రకారం యాక్టివ్ కేసులు 21,587 (జాతీయ సంఖ్యలో 2.7% వాటా). రాష్ట్రంలో మరణాల సంఖ్య 1,708; కేసు మరణాల రేటు 1.02%; మరియు మిలియన్ కి మరణాల సంఖ్య 21 వద్ద ఉంది. టిపిఎం 38,605, పాజిటివిటీ రేట్ 5.3%.

పశ్చిమ బెంగాల్‌లో మొత్తం కేసులు 3,09,417 ఉన్నాయి (దేశ వ్యాప్త మొత్తం కేసులలో 4.2%) మిలియన్ జనాభాకు 3,106 కేసులు. మొత్తం రికవరీ 2,71,563 మరియు రికవరీ రేటు 87.77%. 31,984 యాక్టివ్ కేసులతో, మొత్తం దేశంలో 4.0% కేసులు రాష్ట్రంలో నమోదయ్యాయి. మొత్తం మరణాలు 5,870;  మరణాల రేటు 1.90% కాగా, మిలియన్ జనాభాకు మరణాలు 59 ఉన్నాయి. . 37,872 టిపిఎం, పాజిటివిటీ రేటు 8.2%గా నమోదయింది.

చత్తీస్‌గఢ్ 1,53,515 మొత్తం కేసులు నమోదయ్యాయి (మొత్తం కేసులలో వాటా - 2.1%), మిలియన్‌ జనాభాకు 5,215 కేసులు ఉన్నాయి, 1,23,943 కేసులు మొత్తం రికవరీ అయ్యాయి. 80.74% రికవరీ రేటు ఉంది. ఇది 28,187 యాక్టివ్ కేసులను కలిగి ఉంది, ఇందులో జాతీయ సంఖ్యలో 3.5% ఉన్నారు. కేసు మరణాల రేటు 0.90% మరియు మిలియన్‌కు 47 మరణాలు ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం 1385 మరణాలు సంభవించాయి. టిపిఎం 50191 మరియు పాజిటివిటీ రేట్ 10.4% గా నమోదయ్యాయి.

 

 

కోవిడ్ నిర్వహణ కోసం వివిధ రాష్ట్ర / యుటి ప్రభుత్వాల ప్రయత్నాలను బలోపేతం చేయడానికి కొనసాగుతున్న ప్రయత్నంగా, కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు వివిధ రాష్ట్రాలు / యుటిలను సందర్శించడానికి కేంద్ర బృందాలను నియమించింది. ఈ బృందాలు రాష్ట్ర / యుటి అధికారులతో చర్చిస్తాయి. వారు ఎదుర్కొంటున్న సవాళ్లు మరియు సమస్యలపై మొదటి అవగాహనచేసుకుని, తద్వారా అక్కడ కొనసాగుతున్న కార్యకలాపాలను బలోపేతం చేయడానికి ఉన్న అడ్డంకులను తొలగించేందుకు కృషి చేస్తాయి. 

****



(Release ID: 1665157) Visitor Counter : 169