రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

వైస్‌ చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌, లెఫ్టినెంట్‌ జనరల్ ఎస్‌.కె. సైనీ అమెరికా పర్యటన

Posted On: 16 OCT 2020 11:15AM by PIB Hyderabad

వైస్‌ చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌, లెఫ్టినెంట్‌ జనరల్ ఎస్‌.కె. సైనీ, శనివారం నుంచి అమెరికాలో పర్యటించనున్నారు. ఈనెల 20 వరకు పర్యటన కొనసాగుతుంది. రెండు దేశాల సైనిక దళాల మధ్య సహకారాన్ని పెంపొందించడం ఈ పర్యటన లక్ష్యం.

    ఇండో-పసిఫిక్ ఆర్మీ కమాండ్ విభాగమైన యూఎస్‌ ఆర్మీ పసిఫిక్‌ కమాండ్‌ను లెఫ్టినెంట్‌ జనరల్ ఎస్‌.కె. సైనీ సందర్శిస్తారు. సైనిక దళ ఉన్నతాధికారులతో సమావేశమవుతారు. అమెరికా సైనికుల శిక్షణ, ఆయుధ సంపత్తిని పరిశీలిస్తారు. తర్వాత, ఇండో-పసిఫిక్ ఆర్మీ కమాండ్‌కు కూడా వెళతారు. అక్కడ, ఇరు దేశ సైనిక దళాల మధ్య సహకారం, సంబంధాల ప్రోత్సాహంపై చర్చిస్తారు. సైనిక సేకరణలు, తగిన రీతి శిక్షణ, ఉమ్మడి విన్యాసాలు, సామర్థ్యం పెంపు వంటి అంశాలు చర్చకు వస్తాయి.

    ఇరు దేశ సైన్యాల మధ్య కార్యాచరణ, వ్యూహాత్మక సహకారాన్ని ఈ పర్యటన పెంచుతుంది. కొవిడ్‌ పరిమితులు ఉన్నా, అమెరికాతో కలిసి రెండు ఉమ్మడి సైనిక విన్యాసాల్లో భారత్‌ పాల్గొంటుందని ఈ పర్యటన స్పష్టం చేస్తుంది. ఆ రెండు విన్యాసాలు యుద్ధ్‌ అభ్యాస్‌ ( ఫిబ్రవరి, 2021), వజ్ర ప్రహార్‌ (మార్చి, 2021).

***


(Release ID: 1665095) Visitor Counter : 153