గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ

ఆన్లైన్లో “టెక్ ఫర్ ట్రైబల్స్” కార్యక్రమాన్ని ప్రారంభించిన ట్రైఫెడ్, ఐఐటీ కాన్పూర్, ఛత్తీస్గఢ్ ఎంఎఫ్పీ ఫెడరేషన్

"టెక్ ఫర్ ట్రైబల్స్" కార్యక్రమం గిరిజన వ్యవస్థాపకులు, పట్టణ మార్కెట్ల మధ్య అంతరాన్ని తగ్గిస్తుంది

Posted On: 13 OCT 2020 1:32PM by PIB Hyderabad

"టెక్ ఫర్ ట్రైబల్స్" కార్యక్రయాన్ని ఛత్తీస్ గఢ్,  ఎంఎఫ్పీ ఫెడరేషన్,  ఐఐటి కాన్పూర్ సహకారంతో గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ట్రైఫెడ్ నేడు ప్రారంభించాయి. చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ (ఎంఎస్‌ఎంఇ) సహకారంతో ట్రైఫెడ్..., 'టెక్ ఫర్ ట్రైబల్స్'ను ఈఎస్డీపీ ప్రోగ్రామ్లో భాగంగా ప్రారంభించింది. గిరిజనుల సమగ్ర అభివృద్ధే ఈ కార్యక్రమం లక్ష్యం.  వారి వ్యాపార సామర్థ్యాన్ని,   పెంచడం, ఐటి,  వ్యాపార అభివృద్ధి నైపుణ్యాలను పెంచడంపై దృష్టి సారిస్తారు. వన్ ధన్ వికాస్ కేంద్రాలు ( వీడీవీకే) స్వయం సహాయక సంఘాలను ఇందుకోసం ఉపయోగించుకుంటారు. ఆన్‌లైన్ ద్వారా ప్రారంభించిన ఈ కార్యక్రమానికి ట్రైఫెడ్ ఎండీ ప్రవీర్ కృష్ణ,  సిజిఎంఎఫ్‌పిఎఫ్ఇడి మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ శుక్లా,  ప్రొఫెసర్ అమితాభ్ బంధోపధ్యాయ్,  ప్రొఫెసర్-ఇన్-ఛార్జ్, ఇంక్యుబేటర్ @ ఐఐటీ కాన్పూర్,  ఫస్ట్ ఐఐటీ కాన్పూర్ సీఈఓ డాక్టర్ నిఖిల్ అగర్వాల్,  శిక్షణా కార్యక్రమ లబ్ధిదారులతో పాటు, ట్రైఫెడ్, సీజీఎంఎఫ్పీఎఫ్ఈడీ,  ఐఐటీ కాన్పూర్ అధికారులు పాల్గొన్నారు.

ఈ నెల 13 నుండి వచ్చే నెల ఏడో తేదీ వరకు  ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని వన్ ధన్ లబ్ధిదారులకు ఆరు వారాలు శిక్షణ ఇస్తారు.  సూక్ష్మ సంస్థల సృష్టి, నిర్వహణ,  పనితీరు ను మెరుగుపర్చుకోవడంపై తర్ఫీదు ఉంటుంది.  50 రోజుల్లో  120 సెషన్లు ఉంటాయి. శిక్షణ విధానాన్ని ఐఐటి కాన్పూర్ అభివృద్ధి చేసింది.  ఆన్‌లైన్ క్లాసులు,  శిక్షణలు, ఆన్‌లైన్ కార్యకలాపాల ద్వారా దశలవారీగా లబ్ధిదారులకు శిక్షణను పూర్తి చేస్తారు. తదనంతరం తరగతి గదుల్లో ముఖాముఖిలు, ప్రాక్టికల్, ఆన్‌సైట్ సందర్శనలు వంటి కార్యక్రమాలు ఉంటాయి.  

 గిరిజనుల సాంప్రదాయ జ్ఞానం,  నైపుణ్యాలను ఉపయోగించి మార్కెట్ ఆధారిత ఎంటర్ప్రైజ్ ద్వారా బ్రాండింగ్, ప్యాకేజింగ్, మార్కెటింగ్ వంటి నైపుణ్యాలను నేర్పిస్తారు. తద్వారా వీరి ఆదాయం పెరుగుతుంది. ఇందుకోసం వన్ ధన్ కేంద్రాల ( వీడీవీకే) లను ఏర్పాటు చేస్తారు.   ట్రైఫెడ్ ఇప్పటివరకు 21 రాష్ట్రాల్లో, ఒక కేంద్రపాలిత ప్రాంతాల్లో 1243 వన్ ధన్ కేంద్రాలను మంజూరు చేసింది. దాదాపు. వీటిలో దాదాపు   3.68 లక్షల మంది గిరిజన సేకర్తలు ఉన్నారు.

జూమ్ కాల్‌లో పాల్గొన్న వారిని, కార్యక్రమ లబ్ధిదారులను తన ప్రసంగంలో ఫస్ట్ ఐఐటీ కాన్పూర్ సిఇఒ డాక్టర్ నిఖిల్ అగర్వాల్ స్వాగతించారు. ఈ ప్రత్యేకమైన కార్యక్రమం వెనుక ఉన్న ఉద్దేశాన్ని ఆయన వివరించారు.  "గిరిజన వ్యవస్థాపకులు  పట్టణ మార్కెట్ల మధ్య అంతరాన్ని తగ్గిస్తాం. భారతదేశపు గిరిజనులను" ఆత్మనిర్భర్ "గా మార్చుతాం. వన్ధన్ ఈఎస్డీపీ శిక్షణా కార్యక్రమాల కోసం  ట్రైఫెడ్... కాన్పూర్, ఐఐటి,  ఆర్ట్ ఆఫ్ లివింగ్, బెంగళూరులోని టిస్, ముంబైలోని కిస్, చెన్నై వివేకానంద కేంద్రాలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఛత్తీస్గఢ్, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, రాజస్థాన్ రాష్ట్రాల్లో  శిక్షణా కార్యక్రమాలు జరుగుతాయి. కాన్పూర్ ఐఐటి అభివృద్ధి చేసిన శిక్షణా విధానాన్ని ఉపయోగించి స్థానిక అవసరాలకు అనుగుణంగా చిన్న మార్పులతో ఇతర రాష్ట్రాల్లో, ఇతర శిక్షణ భాగస్వాముల ద్వారా వన్ధన్-ఇఎస్‌డిపి శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించాలని ట్రైఫెడ్ యోచిస్తోంది. ఇతర రాష్ట్రాల్లోనూ ఇలాంటి కార్యక్రమాలు తదనంతరం మొదలవుతాయి” అని ఆయన వివరించారు.  ఐఐటీ కాన్పూర్ డెవెలప్ చేసిన శిక్షణా విధానాన్నే ఇందుకు ఉపయోగిస్తామని చెప్పారు. స్థానిక అవసరాల మేరకు అవసరమైతే చిన్న చిన్న మార్పులు చేస్తామని వెల్లడించారు. గిరిజన అభివృద్ధి, సాధికారత విషయంలో టెక్ ఫర్ ట్రైబల్స్ కార్యక్రమం గొప్ప ముందడుగు అని కృష్ణ వివరించారు.

గత కొన్ని నెలలుగా  ప్రభుత్వ సహాయంతో 'మినిమమ్ సపోర్ట్ ప్రైస్ (ఎంఎస్పి) ద్వారా చిన్న అటవీ ఉత్పత్తిలను మార్కెటింగ్ చేసే విధానానికి (ఎంఎఫ్‌పి) ఉద్దేశించిన  సరఫరా గొలుసుతో గిరిజనులు ఎలా అభివృద్ది చెందుతున్నారో కూడా కృష్ణ ఈ సందర్భంగా వివరించారు.  వన్ ధన్ గిరిజన స్టార్టప్ల పథకాలు గిరిజన సేకర్తలకు,  అటవీ నివాసులకు, గిరిజన కళాకారులకు ఉపాధి కల్పిస్తున్నాయని చెప్పారు.  వన్ ధన్ కేంద్రాలను చిన్నస్థాయి పరిశ్రమలుగా పరిగణించవచ్చు. అటవీ ఉత్పత్తులకు ఇవి అదనపు విలువను అందిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ట్రైఫైడ్ ‘వోకల్ ఫర్ లోకల్ గో ట్రైబల్’ కార్యక్రమాన్ని మరిన్ని ప్రాంతాల్లో చేపడుతుంది. 27 రాష్ట్రాల్లోని 397 జిల్లాల్లో 300 వన్ధన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది.
ఈ సందర్భంగా సంజయ్ శుక్లా మాట్లాడుతూ ఛత్తీస్గఢలోని ఎంఎఫ్సీ కార్యక్రమం ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో వివరించారు. ఎంతో మంది దీనిని ప్రశంసించారని చెప్పారు. ‘టెక్ ఫర్ ట్రైబల్స్’ మరో ముందడుగు కానుందని అన్నారు. గత కొన్ని నెలల్లో ఛత్తీస్గఢ్ రూ.106.53 కోట్ల విలువైన 46,857 మెట్రిక్ టన్నుల విలువైన అటవీ ఉత్పత్తులను సేకరించింది. ఎంఎఫ్సీ పథకానికి మద్దతుధర కార్యక్రమం కోసం ప్రభుత్వం ఎంతో కష్టపడుతున్నదని ప్రశంసించారు. ఛత్తీస్గఢ్లో 866 సేకరణ కేంద్రాలు ఉన్నాయి. స్వయంసహాయక సంఘాల వన్ ధన్ కేంద్రాల సామర్థ్యాన్ని వాడుకుంటున్నది. సంచార యూనిట్ల ఇంటింటికీ తిరిగి అటవీ ఉత్పత్తలను సేకరించడం వంటి వినూత్న కార్యక్రమాన్ని కూడా మొదలుపెట్టారు. ఉత్పత్తులను భారీగా సేకరించడానికి అటవీ, రెవెన్యూ, వీడీవీకే అధికారులు శ్రమించారు.  

ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ అమితాబ బంధోపధ్యాయ్ మాట్లాడుతూ తమ సంస్థ చెప్పినట్టు నైపుణ్యాల అభివృద్ధి, సాంకేతిక మార్పిడుల గురించి వివరించారు. ఛత్తీస్గఢ్ గిరిజన యువత కోసం తమ ఐఐటీ నైపుణ్యాల అభివృద్ధి కార్యక్రమం నిర్వహిస్తుందని వెల్లడించారు. ఎంఎఫ్పీల ద్వారా తమ ఉత్పత్తరులను అమ్ముకుంటూ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవచ్చని అన్నారు. నిబద్ధత, సామర్థ్య నిర్మాణం, మార్కెట్ లింకేజ్ల అనే మూడు ప్రధానాంశాల ద్వారా ఈ కార్యక్రమం సుస్థిర వ్యవస్థాపకతను వృద్ధి చేస్తుందన్నారు. విలువ జోడింపు, అటవీ ఉత్పత్తుల శుద్ధీకరణ లక్ష్యంగా ఈ కోర్సును తయారు చేశామని ప్రొఫెసర్ చెప్పారు. ఈ సామర్థ్య నిర్మాణ కార్యక్రమం గిరిజన వ్యవస్థాపకులు మరిన్ని విజయాలను సాధించేలా చేస్తుందని, నాణ్యమైన ధ్రువీకరణల ద్వారా ప్రొడక్టులను సులువుగా అమ్ముకోవచ్చని వివరించారు. 

***


(Release ID: 1664147) Visitor Counter : 178