వ్యవసాయ మంత్రిత్వ శాఖ

ప్ర‌స్తుత వ‌రి పంట‌ను ఎం.ఎస్.పి ప్రాతిప‌దిక‌న కొనుగోలుచేయ‌డం జ‌రుగుతుంది.

ఈఏడాది ప్ర‌భుత్వ ఏజెన్సీలు రికార్డు స్థాయిలో ప్రొక్యూర్‌మెంట్
ఇలాగే గోధుమ‌లు కూడా సేక‌ర‌ణ‌

ఏ రైతూ ఎలాంటి స‌మ‌స్య‌నూ ఎదుర్కొన‌రు: హ‌ర్దీప్ పూరి

పంజాబ్‌లో ఎం.ఎస్‌.పి ధ‌ర‌కు మున్నెన్న‌డూ లేనంత‌గా ప్రొక్యూర్‌మెంట్‌.

గ‌త ఏడాది 7.4 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నులు సేక‌రించ‌గా,11-10-2020 నాటికి 26.1 ల‌క్ష‌ల మెట్రిక్‌ట‌న్నులు సేక‌రించారు. అంటే గ‌త ఏడాదితో పోలిస్తే 251 శాతం ప్రొక్యూర్‌మెంట్‌లో పెరుగుద‌ల‌.

దేశ‌వ్యాప్తంగా మొత్తం వ‌రి ప్రొక్యూర్‌మెంట్ 35 శాతం పెరిగింది, గ‌త ఏడాది 31.7 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నులు సేక‌రించ‌గా ఈ ఏడాది

42.5 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నులు సేక‌రించారు.

గోధుమ‌ల‌కు ర‌బీ సీజ‌న్‌లో 2020-21లో ప్రొక్యూర్‌మెంట్ సెంట‌ర్లు 21,869కు పెర‌గ‌గా, గ‌త ఏడాది
ప్రొక్యూర్‌మెంట్ సెంట‌ర్లు14,838 గా ఉన్నాయి.

2020-21 సంవ‌త్స‌రానికి ఉద్దేశించిన ప్రొక్యూర్‌మెంట్ సెంంట‌ర్ల‌ను 30,549 (2019-20) నుంచి 39,130 కి పెంచారు.

అంటే ప్రొక్యూర్‌మెంట్ సెంట‌ర్లు 30 శాతం పెరిగాయి.

ర‌బీ, ఖ‌రీఫ్ సీజ‌న్ల‌కు క‌లిపి మొత్తం ప్రొక్యూర్ మెంట్ సెంట‌ర్లు 2016-17లో 48,550 సెంట‌ర్లు ఉండ‌గా 2019-20 నాటిక

Posted On: 13 OCT 2020 2:57PM by PIB Hyderabad

కేంద్ర ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన కొత్త వ్య‌వ‌సాయ చ‌ట్టాల వ‌ల్ల రైతు రాబ‌డి పెరుగుతుంద‌ని అవి వారికి ప్ర‌యోజ‌న‌క‌ర‌మ‌ని తెలిసిన‌ప్ప‌టికీ పంజాబ్‌లో కొంద‌రు అస‌త్యాలు, మోస‌పూరిత‌ ప్ర‌చారం చేస్తూ, రైతుల‌ను ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా రెచ్చ‌గొట్ట‌డం వంటివి చేస్తున్నార‌ని, కేంద్ర గృహ‌, ప‌ట్ట‌ణ‌వ్య‌వ‌హారాలశాఖ స‌హాయ మంత్రి  (ఇంఛార్జి), పౌర‌విమాన‌యాన శాఖ , 

వాణిజ్యం, ప‌రిశ్ర‌మ‌ల శాఖ స‌హాయ‌మంత్ర శ్రీ హ‌ర్‌దీప్ సింగ్ పూరి అన్నారు.

“ఎం.ఎస్‌.పి కొన‌సాగ‌బోతున్న‌ది. ప్ర‌స్తుత వ‌రి పంట‌ను ఎం.ఎస్‌.పి కింద కొనుగోలు చేయ‌నున్నారు. ఈ సీజ‌న్‌లో ప్ర‌భుత్వ  ఏజెన్సీలు రికార్డు స్థాయిలో కొనుగోళ్లు చేశాయి.అలాగే గోధుమ‌లు కూడా ఈ సీజ‌న్‌లో సేక‌రిస్తారు. ఏ రైతుకూ ఎలాంటి స‌మ‌స్యా రాదు. అని మంత్రి అన్నారు.త‌ర‌న్‌త‌ర‌న్‌, అమృత్‌స‌ర్‌ల‌నుంచి శాస్త్ర‌వేత్త‌లు, ప్రొఫెస‌ర్లు, ఇత‌ర సీనియ‌ర్ల‌తో వ్య‌వ‌స‌యార సంస్క‌ర‌ణ‌ల బిల్లుల‌పై వీడియో  కాన్ఫ‌రెన్సుద్వారా మాట్లాడుతూ ఆయ‌న ఈమాట‌ల‌న్నారు.

ఈ సంస్క‌ర‌ణ‌ల‌వ‌ల్ల అర్హితియా క‌మ్యూనిటీకి వ‌చ్చే లాభాల‌గురించి వివరిస్తూ శ్రీ పూరి, ఈ బిల్లులు మ‌న అర్హితియా క‌మ్యూనిటీకి ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌ల్పిస్తాయ‌ని, వీరికి మంచి విత్త‌నాలు, ఇన్‌పుట్‌లు, విజ్ఞానం, స‌ప్ల‌య్ చెయిన్ స‌హాయం తోపాటు ప్ర‌స్తుత మండీల‌లో వారి పాత్ర కొన‌సాగుతుంద‌ని అన్నారు. ఈ రంగంలో పెట్టుబ‌డులు స‌ర‌ఫ‌రా చెయిన్‌లో అన్ని ద‌శ‌ల‌లో మార్పులు తెస్తాయ‌ని, ఇది అంద‌రు స్టేక్‌హోల్డ‌ర్ల‌కు ప్ర‌యోజ‌న‌క‌ర‌మ‌ని ఇది వ్య‌వ‌సాయంలో వృదాను ప్ర‌స్తుతం ఉన్న 30 శాతాన్ని గ‌ణ‌నీయంగా త‌గ్గిస్తుంద‌ని ఆయ‌న అన్నారు.

ఈ వీడియో కాన్ప‌రెన్సులో మాట్లాడుతూ శ్రీ పూరి, పంజాబ్‌లో ఎంఎస్ పి ద్వారా ప్రొక్యూర్‌మెంట్ పెరిగింద‌న్నారు. ప్ర‌స్తుత ఖ‌రీఫ్ సీజ‌న్‌లో పంజాబ్లోమున్నెన్న‌డూ లేనంత‌గా ప్రొక్యూర్‌మెంట్ పెరిగింద‌ని, ఇది గ‌త ఏడాది 7.3ల‌క్ష‌ల మిలియ‌న్ల ట‌న్నులు ఉండ‌గా ప్ర‌స్తు సంవ‌త్స‌రం 11.10.2020 నాటికి ఇది 26.1ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నులకు పెరిగింది. ఇది గ‌త ఏడాది ఖ‌రీఫ్ ప్రొక్యూర్‌మెంట్‌తో  పోలిస్తే 251 శాతం ఎక్కువ‌.

 

2020 అక్టొబ‌ర్ 11 నాటికి దేశంలోని అన్ని రాష్ట్రాల‌లో వ‌రి మొత్తం ప్రొక్యూర్‌మెంట్ 35 శాతం పెరిగి 31.7 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల నుంచి 42.5 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల‌కు ఈ ఏడాది పెరిగింది. గ‌త 5 సంవ‌త్స‌రాల‌లో 3,069 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల వ‌రి ధాన్యాన్ని మ‌ద్ద‌తు ధ‌ర‌కు రూ 4,95,043 కోట్ల రూపాయ‌ల‌కు కొనుగోలు చేయ‌డం  జ‌రిగింది. అదే 2009 నుంచి 2014 వ‌ర‌కు 1768 ల‌శ్రీ‌ల మెట్రిక్ ట‌న్నుల‌ను కేవ‌లం 2,06,059 ల‌క్ష‌ల కోట్ల‌కు సేక‌రించారు. ఎం.ఎస్‌.పి విలువ‌లో 2.40 రెట్ల పెరుగుద‌ల క‌నిపించింది.అలాగే, గ‌త 5 సంవ‌త్స‌రాల‌లో 1627 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల గోధుమ‌ల‌ను క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర‌కు 2,97,023 కోట్ల రూపాయ‌ల‌కు ప్రొక్యూర్ చేశారు. అదే 2009-2014 మ‌ధ్య‌1394 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల గోధుమ‌ల‌ను 1,68,202 కోట్ల రూపాయ‌ల‌కు సమీక‌రించారు. అంటే ఇది ఎం.ఎస్‌.పి విలువ‌లో 1.77 రెట్లు పెరుగుద‌ల‌తో స‌మానం.

ర‌బీసీజ‌న్‌లో గోధుమ‌ల ప్రొక్యూర్‌మెంట్ కేంద్రాల సంఖ్య 2020-21లో 21,869 కి పెరిగాయి. అంత‌కు ముందు సంవ‌త్స‌రం 14,838 ప్రొక్యూర్‌మెంట్ సెంట‌ర్ల‌తో పోలిస్తే 50 శాతం ఎక్కువ‌.

 

2020-21 సంవ‌త్స‌రం ఖ‌రీఫ్ సీజ‌న్‌కు ప్రొక్యూర్‌మెంట్ సెంట‌ర్ల సంఖ్య 30,549 (2019-20)నుంచి 39,130 కి పెరిగాయి అంటే ప్రొక్యూర్‌మెంట్ సెంట‌ర్లు 30 శాతం పెరిగాయి.

ర‌బీ, ఖ‌రీఫ్ సీజ‌న్ల‌కు సంబంధించి మొత్తం ప్రొక్యూర్ మెంట్ కేంద్రాలు 2016-2017లో 48,550 ఉండ‌గా 2019-20 నాటికి అవి 64,515 కు పెరిగాయి. ప‌ట్టుమ‌ని నాలుగు సంవ‌త్స‌రాల వ్య‌వ‌ధిలో  సుమారు 33 శాతం పెరిగాయి. మ‌ద్ద‌తుధ‌ర‌వ‌ద్ద వ‌రి ప్రొక్యూర్‌మెంట్ వ‌ల్ల ల‌బ్దిపొందిన రైతుల సంఖ్య 2017-18నుంచి 2019-20 మ‌ధ్య 72 శాతం పెరిగింది

 

ఎన్‌.డి.ఎ గ‌త ఆరేళ్ల‌లొ రైతుల ప్ర‌యోజ‌నాల కోసం తీసుకున్న చ‌ర్య‌లు..

 ఎం.ఎస్‌.పి నిర్ణ‌యానికి సంబంధించి స్వామినాథ‌న్ క‌మిటీ సిఫార్సుల అమ‌లు. క‌నీసం ఉత్ప‌త్తి ఖ‌ర్చుల‌పై 50 శాతం లాభం ఉండేలా నిర్ణ‌యం.

2. వ్య‌వ‌సాయ బ‌డ్జెట్ 2009-10 సంవ‌త్స‌రంలో 12,000 కోట్ల రూపాయ‌లు ఉండ‌గా 2020-21 సంవ‌త్స‌రంలో ఇది 1,34,399 కోట్ల రూపాయ‌లకు పెంపు.

3. ఆత్మ‌నిర్భ‌ర్ ప్యాకేజ్ కింద అగ్రి ఇన్‌ప్రా ఫండ్ రూ 1 ల‌క్ష కోట్ల రూపాయ‌ల ప్ర‌క‌ట‌న‌.

 4.పి.ఎం. కిసాన్ స‌మ్మాన్ నిధి కింద 10 కోట్ల మంది రైతులు ప్ర‌యోజ‌నం పొందారు. రూ94,000 కోట్ల రూపాయ‌ల‌కు పైగా రైతుల‌కు డిబిటి ద్వారా బ‌ద‌లాయించ‌డం జ‌రిగింది.  

5. కోవిడ్ మ‌హ‌మ్మారి స‌మ‌యంలో 9 కోట్ల మందికి పైగా రైతుల‌కు పిఎం కిసాన్ కింద 38,000 కోట్ల రూపాయ‌ల చెల్లింపు.

6.2019 ఫిబ్ర‌వ‌రి నుంచి మ‌త్స్య‌, ప‌శుగ‌ణాభివృద్ధి రైతుల‌కు కెసిసి కార్డుల ప్ర‌యోజ‌నం కూడా వ‌ర్తింప‌చేయ‌డం జ‌రిగింది.

7. గ‌త ఆరు నెల‌ల్లో 1.29 కోట్ల కొత్త కెసిసి కార్డులు జారీచేయ‌డం జ‌రిగింది.

8. ఈ ఏడాది వేసవిలో 57 ల‌క్ష‌ల హెక్టార్ల‌లో నాట్లు ప‌డ్డాయి. ఇది గ‌త ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 16 ల‌క్ష‌ల హెక్టార్లు ఎక్కువ‌.

9.ఈ ఏడాది ఖ‌రీఫ్ నాట్లు :1104 ల‌క్ష‌ల హెక్టార్లు, ఇది రికార్డు స్థాయిలో ఖ‌రీఫ్ సీజ‌న్ నాట్లు జ‌రిగిన 2016 నాటి 1075 ల‌క్ష‌ల హెక్టార్ల కంటే ఎక్కువ‌.

10. ఈనామ్ మండీల‌ను కోవిడ్ మ‌హ‌మ్మారి లాక్‌డౌన్ స‌మ‌యంలో 585 నుంచి వెయ్యికి పెంచడం జ‌రిగింది. ఈనామ్ ప్లాట్‌ఫారంల‌పై ల‌క్ష కోట్ల రూపాయ‌ల‌కంటే ఎక్కువ వ్యాపారం జ‌రిగింది.

***


(Release ID: 1664144) Visitor Counter : 199