ఆయుష్
మహాత్మాగాంధీ ఆలోచనలు గుర్తు చేసుకున్న నేషనల్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ నేచురోపతి
Posted On:
12 OCT 2020 11:18AM by PIB Hyderabad
పుణెలోని ది నేషనల్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ నేచురోపతి ఆయుష్ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో పనిచేస్తోంది.1945లో మహాత్మాగాంధీ స్థాపించిన ఆల్ ఇండియా నేచుర్ క్యూర్ సంస్థే నేషనల్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ నేచురోపతిగా రూపాంతరం చెందింది. గాంధీజీ 151 జయంతి సందర్భంగా మానవత్వానికి ఆ మహాత్ముడు చేసిన సేవలను స్మరించుకుంది.
ఆరోగ్యం, ఆహారం మరియు పోషకాహారంపై మహాత్మా గాంధీ ఆలోచనలను ప్రతిబింబిస్తూ ఎన్‌ఐఎన్ రూపొందించిన 48 వెబ్‌నార్ల మెగాసిరీస్..గాంధీ జయంతి సందర్భంగా ప్రారంభమయింది. మెగా సిరీస్‌లో మొదటి భాగానికి ప్రజలనుండి మంచి స్పందన వచ్చింది. ఆ కాలంనాటి గాంధేయ ఆలోచనలను ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పటికీ కూడా ఆచరణీయమైనవే.
గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న "లివింగ్ గాంధీ" స్మారక చిహ్నాన్ని ఎన్‌ఐఎన్ ప్రారంభించింది. ఆల్ ఇండియా నేచర్ క్యూర్ ఫౌండేషన్ ట్రస్ట్, సొసైటీ ఆఫ్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్ సభ్యుడు, పూణేలోని ఎన్ఐఎన్ పాలకమండలి సభ్యుడు కూడా అయిన శ్రీ లాల్ ఘన్షాని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రీజనల్ అవుట్‌రీచ్ బ్యూరో (మహారాష్ట్ర మరియు గోవా)కు చెందిన బృందం ఈ కార్యక్రమంలో గాంధీజీకి భవ్యాంజలి ఘటించింది. యోగా, నేచురోపతి కళాశాలల విద్యార్థుల కోసం ఎన్‌ఐఎన్ నిర్వహించిన వ్యాసరచన పోటీ ఫలితాలను ఈ కార్యక్రమంలో ప్రకటించారు.
మెగా సిరీస్‌కు సంబంధించిన మొదటి కార్యక్రమం అక్టోబర్ 02న ప్రసారం చేయబడింది.ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర ప్రభుత్వ మాజీ అదనపు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శ్రీ ఎ.ఎన్ త్రిపాఠి..ఆరోగ్యంపై మహాత్మాగాంధీ ఆలోచనల గురించి మాట్లాడారు. గాంధీజీ ఆదర్శాలు, తన వ్యక్తిగత అనుభవాలు, ప్రకృతి పరిరక్షణపై ప్రసంగకర్త చేసిన వ్యాఖ్యానాలపై శ్రోతలను ఆకట్టుకున్నాయి.షెడ్యూల్ ప్రకారం వెబ్‌నార్ సిరీస్ వారంపాటు కొనసాగింది.కార్యక్రమంలో భాగంగా ప్రతి రోజు ఉదయం 11 గంటలకు ఈ-ఉపన్యాసం ఏర్పాటు చేశారు.
జల్గావ్‌లోని గాంధీ రీసెర్చ్ ఫౌండేషన్‌కు చెందిన ప్రొఫెసర్ గీతా ధరంపాల్ అక్టోబర్ 3న గాంధీజీ సూచించిన వైద్యవిధానాలపై ప్రసంగించారు. గాంధీ చేపట్టిన సత్యాగ్రహం వంటి ఉద్యమాల కారణంగా సమాజంపై పడిన రాజకీయ ప్రభావం, అనంతర పరిణామాల గురించి వివరించారు. గాంధీ చేపట్టిన అహింసా సిద్ధాంతం సమాజానికి ఔషధం వలే పనిచేసిందని చెప్పారు. న్యూ ఢిల్లీలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌కు చెందిన డాక్టర్ జార్జ్ మాథ్యూ 4వ తేదీన గాంధీజీ గ్రామ్ స్వరాజ్ మరియు గ్రామ్ ఆరోగ్య గురించి మాట్లాడారు. 'విలేజ్ యాజ్ రిపబ్లిక్' అనే ఆంశంపై గాంధీజీ అభిప్రాయాలను ఆయన వివరించారు. స్వయం సంమృద్దే దాని యొక్క ముఖ్య ఉద్దేశమని చెప్పారు. కారుణ్య జీవనశైలిపై గాంధీజీ సిద్ధాంతాలను అక్టోబర్ 5న ప్రసిద్ధ పర్యవరణ పరిరక్షణకారుడు శ్రీ నిఖిల్ లంజెవార్ వివరించారు. శాంతి,సామరస్యాలు జీవన సాఫల్యతకు ఏ విధంగా దారుచూపుతాయన్న ఆంశాలను వివరించారు. గోరఖ్‌పూర్ ప్రాంతీయ వైద్య పరిశోధన కేంద్రం (ఆర్‌ఎంఆర్‌సి) డాక్టర్ రజనీకాంత్ శ్రీవాస్తవ గాంధేయ ధర్మాలను మరియు ఆరోగ్యానికి వాటి ప్రాముఖ్యతను ఆ మరుసటి రోజు వివరించారు. గాంధీజీ ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను తెలియజేశారు. అవి ప్రేక్షకులకు స్ఫూర్తిదాయకమైన కథలుగా ఉపయోగపడ్డాయి.
కార్పొరేట్ చెఫ్ అయిన శ్రీ నిశాంత్ చౌబే అక్టోబర్ 7వ తేదీన 21వ శతాబ్దంలో గాంధేయన్ భోజనం అనే ఆంశంపై ఆసక్తికరమైన వివరాలను తెలియజేశారు. భారతీయ సాంప్రదాయ వంటకాలతో పాటు గాంధీజీ సూచించిన స్వరాజ్ , స్వదేశీలపై తన ఆలోచనలను పంచుకున్నారు. స్థానిక మరియు ఆరోగ్యకరమైన కలయికలతో ఆధునిక ఆహారాన్ని మరింత రుచికరంగా మరియు ఆరోగ్యంగా చేసే అవకాశాలకు వెబ్‌నార్‌లో వివరించారు. అహింస మరియు శ్రేయస్సు మధ్య పరస్పర సంబంధాలను ఆయన వివరించారు. ఆస్ట్రేలియాలోని భారతీయ విద్యా భవన్‌కు చెందిన గంభీర్ వాట్స్..గాంధీజీ నేతృత్వంలో జరిగిన ప్రముఖ ఉద్యమాలను గురించి తెలియజేశారు. ఈ ఉద్యమాల ద్వారా గాంధీజీ సూచించిన అహింస సందేశం సమాజ శ్రేయస్సుకు ఎంతగానో ఉపయోగపడిందని చెప్పారు.
21వ శతాబ్దంలో వివిధ రంగాల్లో ముఖ్యంగా ఆరోగ్యం గురించి మహాత్మా గాంధీ సందేశాలపై రూపొందించిన ఈ వెబ్‌నార్ల రోజువారీ సిరీస్ నవంబర్-18, 2020 వరకూ కొనసాగుతుంది.
గాంధేయ ఆలోచనలు మరియు ఆలోచనలపై సమాజంలోని వివిధ మేథోవర్గాలు తమ అభిప్రాయాలను ఈ కింద సూచించిన లింక్ ద్వారా పంచుకోవచ్చని
ఆయుష్ మంత్రిత్వ శాఖ సూచించింది: https://www.facebook.com/watch/punenin/
.***
(Release ID: 1663853)
Visitor Counter : 234