గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ
చత్తీస్‌ఘడ్ ఎంఎఫ్‌పి ఫెడరేషన్, ఐఐటి కాన్పూర్‌లతో కలిసి టెక్ ఫర్ ట్రైబల్స్ కార్యక్రమాన్ని రేపు ప్రారంభించనున్న ట్రైఫెడ్ సంస్థటెక్ ఫర్ ట్రైబల్స్= వందన్ -ఇఎస్‌డిపి శిక్షణ కార్యక్రమాన్ని ఎం.ఎస్.ఎం.ఇ తమ ఇఎస్‌డిపి పథకం కింద మంజూరు చేసింది.-
Posted On:
12 OCT 2020 4:15PM by PIB Hyderabad
గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ కింద గల ట్రైఫెడ్ సంస్థ ఛత్తీస్‌ఘడ్ ఎం.ఎఫ్.పి ఫెడరేషన్, ఐఐటి కాన్పూర్ తో కలసి రేపు టెక్ ఫర్ ట్రైబల్ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. వందన్ గిరజన లబ్ధిదారులకు మరింత ఉన్నత స్థాయి శిక్షణ నిచ్చేందుకు ట్రైఫెడ్ సంస్థ తన ఇఎస్‌డిపి పథకం ద్వారా ఎం.ఎస్.ఎం.ఇ సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నది. వన్‌ధన్ గిరిజన లబ్ధిదారులకు ఉన్నత స్థాయి నైపుణ్య శిక్షణ నివ్వడం, వారి ఎంటర్‌ప్రెన్యురియల్ సామర్ధ్యాలకు మరింత మద్దతునివ్వడం ద్వార వారి సుస్థిర ఎంటర్‌ప్రైజ్‌కు వీలు కల్పించడం దీని ఉద్దేశం. ఈ కార్యక్రమానికి టెక్ ఫర్ ట్రైబల్స్ అని పేరు పెట్టారు. ఇది గిరిజనుల సమగ్ర వికాసానికి వారి, ఎంటర్‌ప్రెన్యుయర్ షిప్ అభివృద్ధికి, సాఫ్ట్ స్కిల్స్, ఐటి, వన్ ధన్ కేంద్రాల ద్వారా నిర్వహించే స్వయం సహాయక బృందాల వ్యాపార అభివృద్ధి లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపడుతున్నారు. దీని కింద, ట్రైఫెడ్, ప్రముఖ జాతీయ సంస్థలైన ఐఐటి కాన్పూర్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ బెంగళూరు, టిఐఎస్ ఎస్, ముంబాయి, కెఐఎస్ఎస్ భువనేశ్వర్, వివేకానంద కేంద్ర తమిళనాడు, శ్రీజన్ రాజస్థాన్ వంటి సంస్థలతో సంబంధం పెట్టుకుని వాటి ద్వారా చత్తీస్‌ఘడ్, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిషా, తమిళనాడు, రాజస్థౄన్ రాష్ట్రాలలో వన్‌ధన్-ఇఎస్‌డిపి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు టెక్ ఫర్ ట్రైబల్స్ భారత దేశ గిరిజనులకు సంబంధించిన ఒక ప్రత్యేక కార్యక్రమం. గిరిజనులను ఆత్మనిర్భర్ గా తీర్చిదిద్దడం దీని ఉద్దేశం. అలాగే గిరిజన ఎంటర్‌ప్రెన్యుయర్లు, అర్బన్ మార్కెట్ ల మధ్య అంతరాన్ని తొలగించడం పై ఇది దృష్టిపెడుతుంది.ఈ పథకం కింద లబ్ధిదారులు ఆరు వారాలపాటు 30 రోజులలో 120 సెషన్‌ల కార్యక్రమానికి హాజరౌతారు. ఇందుకు సంబంధించిన శిక్షణ అక్టోబర్ 12 నుంచి నవంబర్ 7 , 2020 వరకు జరుగుతుంది. ఇందులో చత్తీసఘడ్ రాష్ట్రానికి చెందిన అన్ని జిల్లాలకు చెందిన వన్ ధన్ లబ్ధిదారులకు శిక్షణనివ్వడం జరుగుతుంది. వీరికి మైక్రో ఎంటర్‌ప్రైజ్ ఏర్పాటు, మేనేజ్‌మెంట్ వ్యవహారాలు కార్యకలాపాలు వంటి వాటిపై శిక్షణనిస్తారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఐఐటి కాన్పూర్ రూపొందించింది. దశల వారీగా లబ్ధిదారులకు ఇందుకు సంబంధించి బోధిస్తారు. ఆన్‌లైన్ ఉపన్యాసాలు, శిక్షణ, ఆన్‌లైన్ కార్యకలాపాలు వంటి వాటి నుంచి నెమ్మదిగా ముఖాముఖి తరగతి గది కార్యకలాపాలు, ప్రాక్టికల్స్, క్షేత్రస్థాయి సందర్శనలు వంటి ఉంటాయి. తయారీకి సంబంధించిన అత్యుత్తమ ప్రమాణాలు, నాణ్యత, పరిశుభ్రత, మార్కెట్‌లో పాటించాల్సిన ప్రమాణాలు వంటివి ఈ శిక్షణలో భాగంగా ఉంటాయి. బ్రాండ్ ప్రాధాన్యత, అత్యుత్తమ పాకేజింగ్ పరిష్కారాలు, గిరిజనులలో ఎంటర్ ప్రెన్యుయర్ షిప్ కు సంబంధించిన ప్రచారం వంటివి కూడా తెలియజేస్తారు. ఈ శిక్షణ ద్వారా విజయవంతమైన, ఆత్మవిశ్వాసంతో కూడిన గిరిజన ఎంటర్‌ప్రెన్యుయర్లు,మార్కెట్‌లోని అత్యుత్తమ ఉత్పత్తలకు గట్టి పోటీనిచ్చే రీతిలో తగిన వ్యాపార ప్రణాళికలతో ముందుకు రావడానికి వీలు కలుగుతుంది.ఐఐటి కాన్పూర్ వారు ఛత్తీస్‌ఘడ్, కేరళలోని గిరిజన యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఎంఎఫ్‌పిలు ఉపయోగించుకుంటూ తమ ఉత్పత్తులను వాణిజ్యపరంగా లాభదాయకంగా ఉండేలా ఎంటర్‌ప్రైజ్‌ను నిర్మించడానికి వారికిసహాయపడతారు. ఈ కార్యక్రమం ప్రధానంగా మూడు అంశాలపై ఆధారపడినది.అది ఎంగేజ్‌మెంట్, సామర్ధ్యాల నిర్మాణం, మార్కెట్‌లింకేజ్. ఇది గిరిజన ఎంటర్‌ప్రెన్యుయర్లను లాభదాయకంగా ముందుకు తీసుకుపోవడానికి వీలు కల్పిస్తుంది.
***
(Release ID: 1663847)
Visitor Counter : 163