ప్రధాన మంత్రి కార్యాలయం

జయప్రకాశ్ నారాయణ్ గారికి ఆయన జయంతి నాడు నమస్సులు అర్పించిన ప్రధాన మంత్రి

నానాజీ దేశ్ ముఖ్ గారికి ఆయన జయంతి నాడు నమస్సులు అర్పించిన ప్రధాన మంత్రి

Posted On: 11 OCT 2020 9:29AM by PIB Hyderabad

లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ గారికి, నానాజీ దేశ్ ముఖ్ గారికి ఆదివారం వారి జయంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రణామాన్ని ఆచరించారు.  

‘‘లోక్ నాయక్ జెపి కి ఆయన జయంతి ని పురస్కరించుకొని నేను నమస్కరిస్తున్నాను.  భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఆయన సాహసించి, పోరాడారు.  మన ప్రజాస్వామ్య విలువల పై దాడి జరిగినప్పుడు, మన ప్రజాస్వామ్య విలువలను కాపాడడం కోసం ఒక బలమైన ప్రజా ఉద్యమానికి ఆయన నాయకత్వం వహించారు.  ఆయన దృష్టి లో- ప్రజల సంక్షేమం, దేశ హితం కంటే మిన్న అయినటువంటివి- మరేవీ లేవు. 


లోక్ నాయక్ జెపి అంటే అత్యంత శ్రద్ధ, భక్తులు కలిగిన అనుయాయుల్లో మహానుభావుడు నానాజీ దేశ్ ముఖ్ గారు ఒకరు. జెపి ఆలోచనలకు, ఆదర్శాలకు లోకప్రియత్వాన్ని సాధించిపెట్టడం కోసం నానాజీ దేశ్ ముఖ్ గారు అలుపెరుగక శ్రమించారు.  గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి దిశ లో నానాజీ దేశ్ ముఖ్ గారి స్వయంగా సల్పిన కృషి మనలో ప్రేరణ ను కలిగించేటటువంటిదే.   ‘భారత్ రత్న’ నానాజీ దేశ్ ముఖ్ గారి ని ఆయన జయంతి నాడు స్మరించుకొంటున్నాను.

లోక్ నాయక్ జెపి, నానాజీ దేశ్ ముఖ్ ల వంటి మహనీయులు ఈ గడ్డ మీద పుట్టినందుకు భారతదేశం ఎంతో గర్విస్తోంది.  మన దేశం కోసం వారు కన్న కలలను నెరవేర్చే దిశ లో మనను పునరంకితం చేసుకోవలసిన రోజు ఈ రోజు’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

***



(Release ID: 1663499) Visitor Counter : 136