రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
'భారత్‌మాల పరియోజన' కింద 2921 కి.మీ. పొడవైన రహదారుల నిర్మాణం; 12,413 కి.మీ. నిర్మాణం కోసం 322 ప్రాజెక్టులు మంజూరు
प्रविष्टि तिथि:
11 OCT 2020 9:39AM by PIB Hyderabad
ఈ ఏడాది ఆగస్టు వరకు 'భారత్‌మాల పరియోజన' కింద, 12,413 కి.మీ. పొడవైన రహదారుల నిర్మాణం కోసం 322 ప్రాజెక్టులు మంజూరయ్యాయి. ఇందులో, ఆగస్టు వరకు 2921 కి.మీ. రహదారుల నిర్మాణం పూర్తయింది.
జాతీయ రహదారి సంస్థలతో క్షుణ్నంగా సమీక్షించిన కేంద్ర రహదారి రవాణా&హైవేల మంత్రిత్వ శాఖ, భారత్‌మాల పరియోజన తొలిదశ కింద, 34,800 కి.మీ. పొడవైన రహదారుల అభివృద్ధికి అనుమతినిచ్చింది. ఇందుకు రూ.5.35 లక్షల కోట్ల వ్యయమవుతుందని అంచనా వేసింది. అసంపూర్ణంగా ఉన్న 10 వేల కి.మీ. ఎన్‌హెచ్‌డీపీ విస్తరణలు కూడా ఇందులో భాగం.
ఆర్థిక కారిడార్ల అభివృద్ధి, ఇంటర్ కారిడార్లు&ఫీడర్లు రూట్లు, జాతీయ కారిడార్ సామర్థ్యం పెంపుదల, సరిహద్దులు&అంతర్జాతీయ అనుసంధాన రహదారులు, తీర&నౌకాశ్రయాల అనుసంధాన మార్గాలు, గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ రహదారుల వంటి వాటి నిర్మాణం ద్వారా కీలక మౌలిక సదుపాయల అంతరాలను సరిచేసి; దేశవ్యాప్తంగా సరుకులు, ప్రజా రవాణా సామర్థ్యాన్ని ఉత్తమంగా వినియోగించునేలా దృష్టి పెట్టేందుకు హైవేల రంగం కోసం తెచ్చిన కార్యక్రమమే 'భారత్‌మాల'.
***
(रिलीज़ आईडी: 1663496)
आगंतुक पटल : 332
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Tamil
,
Kannada
,
Malayalam