వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

2020-21 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ లో ఎమ్.ఎస్.పి. కార్యకలాపాలు

వరి పండించే రాష్ట్రాలలో కే.ఎమ్.ఎస్. 2020-21 కోసం వరి సేకరణ సజావుగా జరుగుతోంది

09.10.2020 వరకు 2.83 లక్షల మంది రైతుల నుండి 6065.09 కోట్ల రూపాయల విలువైన 32,12,439 మెట్రిక్ టన్నుల వరి కొనుగోలుచేయడం జరిగింది.

Posted On: 10 OCT 2020 6:33PM by PIB Hyderabad

2020-21 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ (కె.ఎం.ఎస్) ఇప్పటికే ప్రారంభమైంది.  గత సీజన్లలో చేసినట్లుగానే, ప్రస్తుత ఎం.ఎస్.పి. పథకాల ప్రకారం ప్రభుత్వం రైతుల నుండి ఎం.ఎస్.పి. వద్ద 2020-21 ఖరీఫ్ పంటల సేకరణ కొనసాగిస్తోంది. 

వరి పండించే రాష్ట్రాలలో కే.ఎమ్.ఎస్. 2020-21 కోసం వరి సేకరణ సజావుగా జరుగుతోంది.  09.10.2020 వరకు 2.83 లక్షల మంది రైతుల నుండి 6065.09 కోట్ల రూపాయల విలువైన 32,12,439 మెట్రిక్ టన్నుల వరి కొనుగోలుచేయడం జరిగింది.

దీనితో పాటు, రాష్ట్రాల ప్రతిపాదనల ఆధారంగా, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ, గుజరాత్, హర్యానా, ఉత్తర ప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల కోసం ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2020 కోసం 30.70 లక్షల మెట్రిక్ టన్నుల పప్పులు, నూనె గింజలను సేకరించడానికి అనుమతి ఇవ్వడం జరిగింది.  వీటితో పాటు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు 1.23 లక్షల మెట్రిక్ టన్నుల కొబ్బరి (బహు వార్షిక పంట) కొనుగోలుకు అనుమతి ఇవ్వబడింది.  ఇతర రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల కోసం ధర మద్దతు పథకం (పి.ఎస్.ఎస్) కింద పప్పుధాన్యాలు, నూనెగింజలు, కొబ్బరి సేకరణకు కూడా ప్రతిపాదనలు స్వీకరించినప్పుడు అనుమతి ఇవ్వబడుతుంది.  అందువలన, సంబంధిత రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలలో, గుర్తించిన పంట కాలం వ్యవధిలో మార్కెట్ రేటు ఎం.ఎస్.పి. కంటే తక్కువగా ఉన్నట్లయితే, రాష్ట్రాలు గుర్తించిన సేకరణ ఏజెన్సీల ద్వారా సెంట్రల్ నోడల్ ఏజెన్సీలు, ఎఫ్.ఏ.క్యూ. గ్రేడ్ కు చెందిన ఈ పంటలను నమోదు చేసుకున్న రైతుల నుండి నేరుగా 2020-21 సంవత్సరానికి ప్రకటించిన ఎం.ఎస్.పి. వద్ద సేకరించవచ్చు. 

09.10.2020 వరకు తమిళనాడు, హర్యానా లోని 326 మంది రైతుల నుండి 3.33 కోట్ల రూపాయల మేర ఎమ్.ఎస్.పి. విలువ కలిగిన 459.60 మెట్రిక్ టన్నుల పెసలను ప్రభుత్వం తన నోడల్ ఏజెన్సీ ల ద్వారా సేకరించింది.  అదేవిధంగా, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలోని 3,961 మంది రైతులకు లబ్ది చేకూరే విధంగా 52.40 కోట్ల రూపాయల మేర ఎమ్.ఎస్.పి. విలువ కలిగిన 5,089 మెట్రిక్ టన్నుల కొబ్బరి ని సేకరించడం జరిగింది. కొబ్బరి, మినుముల ధరల విషయానికి వస్తే, వీటిని ప్రధానంగా పండించే చాలా రాష్ట్రాల్లో, వీటి ధరలు ఎమ్.ఎస్.పి. కి సమానంగా లేదా అంతకంటే ఎక్కువ ఉన్నాయి.  పెసలు, ఇతర ఖరీఫ్ పప్పుధాన్యాలు, నూనెగింజలకు సంబంధించి, ఆయా రాష్ట్రాలు నిర్ణయించిన తేదీ నుండి సంబంధిత రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు సేకరణను ప్రారంభించడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాయి.

2020-21 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ లో పత్తి గింజల (కపాస్) సేకరణ 2020 అక్టోబర్, 1వ తేదీ నుండి ప్రారంభమైంది.   భారత ప్రత్తి సంస్థ 2020 అక్టోబర్, 9వ తేదీ వరకు 4,286 మంది రైతులకు లబ్ధి చేకూరే విధంగా మొత్తం 6451.73 లక్షల రూపాయల మేర ఎమ్.ఎస్.పి. విలువ కలిగిన 22,339 బేళ్లను సేకరించింది.

*****


(Release ID: 1663479) Visitor Counter : 140