సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ

"మెంటల్‌ హెల్త్‌-లుకింగ్‌ బియాండ్‌ కొవిడ్‌-19" అంశంపై, మెల్‌బోర్న్‌ విశ్వవిద్యాలయంతో కలిసి అంతర్జాతీయ సదస్సు నిర్వహించనున్న కేంద్ర దివ్యాంగుల సాధికారత విభాగం

Posted On: 07 OCT 2020 3:30PM by PIB Hyderabad

కేంద్ర సామాజిక న్యాయం& సాధికారత మంత్రిత్వ శాఖకు చెందిన దివ్యాంగుల సాధికారత విభాగం, అంతర్జాతీయ సదస్సు నిర్వహించబోతోంది. "మెంటల్‌ హెల్త్‌-లుకింగ్‌ బియాండ్‌ కొవిడ్‌-19" అంశంపై, ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ విశ్వవిద్యాలయంతో కలిసి గురువారం ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతోంది. సదస్సు ఆసాంతం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సాగుతుంది. కేంద్ర సామాజిక న్యాయం&సాధికారత శాఖ మంత్రి శ్రీ థావర్‌చంద్‌ గెహ్లోత్‌ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఆస్ట్రేలియా-ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌ ప్రొ.క్రెయిగ్‌ జెఫ్రీతోపాటు భారత్‌లో ఆస్ట్రేలియా హై కమిషనర్‌ కూడా సదస్సులో పాల్గొంటారు.

    మానసిక ఆరోగ్య పునరావాసంపై, ముఖ్యంగా కొవిడ్‌ సమయంలో తలెత్తిన మానసిక రుగ్మతలపై సదస్సులో చర్చిస్తారు. ఆరోగ్యేతర సిబ్బంది కోసం ఒత్తిడి నిర్వహణ; బహుళాంశాల మానసిక ఆరోగ్యం; మానసిక ఆరోగ్యం నిర్వహణ; ఇంటి నుంచి విధులు; భారత్‌లో ఆత్మహత్యలు, అనుబంధ అంశాలు; భారత్‌, ఆస్ట్రేలియాలో మానసిక ఆరోగ్యం, మానవ హక్కులు; దివ్యాంగుల్లో మానసిక ఆరోగ్య పునఃసృష్టి నిర్మాణ సాధనాలు వంటి అంశాలపై ఇరు దేశాల నిపుణుల చర్చిస్తారు.

    దివ్యాంగ రంగంలో సహకారం కోసం, గతేడాది నవంబర్‌లో, ఆస్ట్రేలియా ప్రభుత్వంతో కేంద్ర దివ్యాంగుల సాధికారత విభాగం అవగాహన ఒప్పందం చేసుకుంది. అందులో భాగంగానే గురువారం సంయుక్త సదస్సు నిర్వహిస్తున్నారు. 

    దివ్యాంగుల సాధికారత విభాగం యూట్యూబ్‌ ఛానెల్‌లో https://youtu.be/GcNKczaqVsQ లింక్‌ ద్వారా సదస్సు ప్రత్యక్ష ప్రసారాన్ని చూడవచ్చు.

***


(Release ID: 1662409) Visitor Counter : 216